టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, సెల్వమణి సెల్వరాజ్, స్పిరిట్ మీడియా & వేఫేరర్ ఫిల్మ్స్ చిత్రం టైటిల్’ కాంత’
టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా, తెలుగులో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించిన మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ ఓ చిత్రం కోసం జతకట్టారు. రానా స్పిరిట్ మీడియా, దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ మల్టీ లింగ్వల్ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించనున్నారు.
దుల్కర్ సల్మాన్ పుట్టినరోజున మేకర్స్ ఆసక్తికరమైన పోస్టర్‌తో సినిమా టైటిల్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘కాంత’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ పెట్టారు. సహ నిర్మాతగా వ్యవహరించడంతో పాటు దుల్కర్ సల్మాన్ ఈ చిత్రంలో లీడ్ రోల్ పోషించనున్నారు.
ఈ సినిమాతో అసోసియేట్ అవ్వడానికి చాలా ఎక్సయిటెడ్ గా వున్న రానా ఇది ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని భరోసా ఇచ్చారు.
ఈ చిత్రం గురించి రానా మాట్లాడుతూ.. “చాలా అరుదుగా మంచి సినిమా పవర్ గుర్తు చేసే కథ మనకు కనిపిస్తుంది. కాంత మమ్మల్ని ఒకచోట చేర్చిన ప్రాజెక్ట్. సూపర్ ట్యాలెంటెడ్ దుల్కర్ సల్మాన్, వేఫేరర్ ఫిలిమ్స్ తో ఈ ప్రయాణాన్ని ప్రారంభించడం పట్ల మేము ఆనందిస్తున్నాము. అతని పుట్టినరోజు సందర్భంగా రాబోయే సరికొత్త ప్రపంచానికి సంబధించిన టైటిల్ రివిల్ చేశాం. పుట్టినరోజు శుభాకాంక్షలు దుల్కర్ సల్మాన్. కాంత ప్రపంచానికి స్వాగతం.
” అన్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, టీం వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…