స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ చిత్రంతో సంచలన బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు. ఆ సినిమాలో ఆయన పోషించిన టిల్లు పాత్ర యువతలో కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. టిల్లుగా సిద్ధు పంచిన వినోదాన్ని ప్రేక్షకులు అంత తేలికగా మరిచిపోలేరు. టిల్లు మాటలు, చేష్టలు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నాయి.
ఇప్పుడు ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్ గా ‘టిల్లు స్క్వేర్’ వస్తోంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి.. టిల్లుని, అతని చేష్టలను తిరిగి వెండితెరపై చూడటం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచాయి.
‘టిల్లు స్క్వేర్’ నుంచి ఇప్పటికే విడుదలైన ‘టికెటే కొనకుండా’, ‘రాధిక’ పాటలు విశేష ఆదరణ పొందాయి. యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ తో సంచలనం సృష్టించాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఓ మై లిల్లీ’ అనే పాట విడుదలైంది. సోమవారం వారం సాయంత్రం హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్ లో అభిమానుల కోలాహలం మధ్య జరిగిన వేడుకలో ఈ పాటను విడుదల చేశారు.
అచ్చు రాజమణి స్వరపరిచిన ‘ఓ మై లిల్లీ’ మెలోడీ సాంగ్ కట్టి పడేస్తోంది. గాయకుడు శ్రీరామ్ చంద్ర తన మధుర స్వరంతో మాయ చేశాడు. సిద్ధు, రవి ఆంథోనీ సాహిత్యం అద్భుతంగా కుదిరింది. తేలికైన పదాలతో లోతైన భావాన్ని పలికించారు. ఇక లిరికల్ వీడియోలో సిద్ధు, అనుపమ మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అందరినీ అలరించే చిత్రం:
పాట విడుదల సందర్భంగా దర్శకుడు మల్లిక్ రామ్ మాట్లాడుతూ.. “ఓ మై లిల్లీ పాట మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. విజయవంతమైన చిత్రానికి సీక్వెల్ కావడంతో ఈ సినిమా మొదలైనప్పుడే ఎంతో బాధ్యత, ఒత్తిడి ఉందని అర్థమైంది. మాకు ఒక మంచి టీం దొరికింది. అందరం కలిసి మంచి అవుట్ పుట్ ని తీసుకొచ్చాము. ఈ చిత్రం మార్చి 29న థియేటర్లలో విడుదల కానుంది. మీ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నాను” అన్నారు.
డీజే టిల్లుని మించేలా సీక్వెల్ ఉంటుంది:
కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. “డీజే టిల్లు చేసే సమయంలో ప్రేక్షకుల్లో సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. అందుకే ఎలాంటి ఒత్తిడి లేకుండా చేశాము. కానీ టిల్లు స్క్వేర్ పై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకే చాలా జాగ్రత్తగా, మొదటి భాగాన్ని మించేలా సినిమాని రూపొందించాము. టిల్లు పాత్ర అలాగే ఉంటుంది. కానీ కథ మాత్రం వేరేలా ఉంటుంది” అన్నారు.
మీ ప్రేమ మాపై ఎప్పుడు ఇలాగే ఉండాలి:
కథానాయిక అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. “నేను మొదటిసారి టిల్లు స్క్వేర్ కి సంబంధించిన వేడుకలో పాల్గొన్నాను. మీ స్పందన చూసి చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి నుంచి ఒక్క వేడుక కూడా మిస్ అవ్వను. మీ ప్రేమ మాపై ఎప్పుడు ఇలాగే ఉండాలి. మార్చి 29న సినిమా విడుదలవుతోంది. ఈ చిత్ర విడుదల కోసం మేము ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాము. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.” అన్నారు.
కుటుంబ ప్రేక్షకులను కూడా మెప్పించేలా ఉంటుంది:
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. “ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. వేసవి సీజన్ లో మొదటి సినిమాకి లబ్ది చేకూరుతుందన్న ఉద్దేశంతో మార్చి 29న వస్తున్నాం. ఎన్నికలు కూడా ఏప్రిల్ లో లేకపోవడంతో కలిసొచ్చింది. డీజే టిల్లు మొదట యూత్ ఫుల్ సినిమాగా ప్రచారం పొందింది. కానీ యువతతో పాటు కుటుంబ ప్రేక్షకుల నుంచి కూడా విశేష స్పందన లభించింది. టిల్లు స్క్వేర్ కూడా యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుంది” అన్నారు.
‘టిల్లు స్క్వేర్’ చిత్రం 2024, మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. రామ్ మిరియాల, అచ్చు రాజమణి ఈ చిత్రానికి నేపథ్య సంగీతం అందిస్తున్నారు. సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…