విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం వస్తున్న అప్డేట్లు సినిమా మీద అంచనాలు పెంచుతూనే ఉన్నాయి. కన్నప్ప మూవీ నుంచి పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా పాత్రలకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేశారు. ఇక గత సోమవారం అక్షయ్ కుమార్ పాత్రకు సంబంధించి ప్రీ లుక్‌ను విడుదల చేశారు.
ఇక ఈ సోమవారం కన్నప్ప నుంచి విష్ణు మంచు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో తిన్నడికి విధేయుడైన స్నేహితుడు…. టిక్కిని పరిచయం చేశారు. ఈ గుర్రంకు సంబంధించిన పోస్టర్లు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ పోస్టర్‌లో విష్ణు మంచు లుక్ అదిరిపోయేలా ఉంది. ఇక మున్ముందు కన్నప్ప నుంచి ఎలాంటి అప్డేట్లు వస్తాయో.. ఎంతలా బజ్ క్రియేట్ చేస్తాయో చూడాలి.
ఇప్పటికే కన్నప్ప టీజర్‌తో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయన్న సంగతి తెలిసిందే. విష్ణు మంచు టైటిల్ రోల్‌లో కనిపించనున్న కన్నప్ప అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా రాబోతోంది. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. డిసెంబర్‌లో ఈ సినిమా పాన్ ఇండియా వైడ్‌గా విడుదల కానుంది.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…