ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటిస్తున్న సినిమా “రామ్ నగర్ బన్నీ”. విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 4వ తేదీన “రామ్ నగర్ బన్నీ” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
హీరోయిన్ విస్మయ శ్రీ మాట్లాడుతూ – రామ్ నగర్ బన్నీ సినిమాలో శైలు క్యారెక్టర్ లో నటిస్తున్నాను. చంద్రహాస్ తో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. తను మంచి కో స్టార్. రామ్ నగర్ బన్నీ సినిమా ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉంటుంది. మీరంతా అక్టోబర్ 4న మా మూవీని చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
హీరోయిన్ రిచా జోషి మాట్లాడుతూ- రామ్ నగర్ బన్నీ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ మళయజ గారికి, డైరెక్టర్ శ్రీనివాస్ గారికి థ్యాంక్స్. లవ్, ఎంటర్ టైన్ మెంట్ తో మీ అందరినీ ఆకట్టుకునే సినిమా అవుతుంది. హీరోయిన్ గా నాకు రామ్ నగర్ బన్నీ మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నా. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.
హీరోయిన్ అంబికా వాణి మాట్లాడుతూ – తెలుగు ప్రేక్షకులకు రామ్ నగర్ బన్నీ సినిమాతో పరిచయం కావడం సంతోషంగా ఉంది. అక్టోబర్ 4న ఒక మంచి మూవీతో మీ ముందుకు వస్తున్నాం. మిమ్మల్ని బాగా ఎంటర్ టైన్ చేసే చిత్రమిది. థియేటర్స్ లో తప్పకుండా చూస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
నటుడు మధునందన్ మాట్లాడుతూ – రామ్ నగర్ బన్నీ సినిమాలో నటించడం ఒక మంచి ఎక్సీపిరియన్స్. ఇందులో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను. ప్రభాకర్ గారికి, దర్శకుడు శ్రీనివాస్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. చంద్రహాస్ లో గొప్ప నటుడికి ఉండాల్సిన డెడికేషన్ ఉంది. అతను భవిష్యత్ లో మంచి పేరు తెచ్చుకుంటాడు. తన గురించి ట్రోల్స్ వచ్చినప్పుడు మరొకరైతే బాధపడి కుంగిపోయేవారు. కానీ చంద్రహాస్ పాజిటివ్ గా తీసుకున్నాడు. అతనిలోని ఆత్మవిశ్వాసం నాకెంతో నచ్చింది. తప్పకుండా చంద్రహాస్ గొప్ప స్థాయికి వెళ్తాడు. అన్నారు.
దర్శకుడు శ్రీనివాస్ మహత్ మాట్లాడుతూ – ప్రభాకర్ నాకు మంచి మిత్రుడు. నా దగ్గర ఉన్న ఒక కథ గురించి తెలిసి ఆయన వింటా అన్నారు. కథ నచ్చడంతో వాళ్ల అబ్బాయి చంద్రహాస్ తో చేయాలని ముందుకొచ్చాడు. కథను అనుకున్న ప్రకారం రావాలంటే తనే ప్రొడ్యూసర్ గా ఉండాలని నిర్ణయం తీసుకుని సినిమా చేశాడు. చంద్రహాస్ దర్శకుల హీరో. సినిమాకు నాకంటే ఎక్కువ కష్టపడ్డాడు చంద్రహాస్. స్టంట్ గానీ, సీన్ గాని చెప్పేలోపే రంగంలోకి దూకేస్తాడు. అంత ఎనర్జీ ఉన్న హీరో. చంద్రహాస్ ను దగ్గరగా చూసి చెబుతున్నా అతను హీరోగా పెద్ద స్థాయికి వెళ్తాడు. ప్రభాకర్ గారు సినిమాను నేను అనుకున్న దానికంటే పెద్ద బడ్జెట్ తో నిర్మించారు. ఆయన నాతో ఒకటే చెప్పారు బాగా నవ్వుకోవాలి. ఫ్యామిలీ అంతా కలిసి చూడాలి. చంద్రహాస్ ఏదైనా పర్ ఫార్మ్ చేయగలడు అనే పేరు తీసుకొచ్చే సినిమా కావాలి అన్నారు. అలా అన్ని ఎలిమెంట్స్ తో ప్రేక్షకులందరికీ నచ్చేలా చేశాం. అక్టోబర్ 4న థియేటర్స్ లోకి వస్తున్నాం. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.
నిర్మాత మళయజ ప్రభాకర్ మాట్లాడుతూ – రామ్ నగర్ బన్నీ సినిమా మీ ఫ్యామిలీ అందరికీ నచ్చుతుంది. మీ ఇంట్లో ఒకరు సినిమా చూశాక నచ్చితే మిగతా అందరూ చూడండి. ఒక అమ్మగా చెబుతున్నా. మీరంతా మూవీని ఎంజాయ్ చేస్తారు. అన్నారు.
ప్రభాకర్ మాట్లాడుతూ – నన్ను బుల్లితెర మీద నా సోదరీమణులు ఆదరించారు. కుటుంబ ప్రేక్షకులు చూడటం వల్లే నా సీరియల్స్ సక్సెస్ అయ్యాయి. మా అబ్బాయిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నప్పుడు నాకున్న ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకున్నాం. చంద్రహాస్ మొదటి సినిమా సకుటుంబంగా ప్రేక్షకులు చూడాలని అనుకున్నాం. అందుకే మరో రెండు సినిమాలు ఉన్నా..ఈ సినిమానే ఫస్ట్ రిలీజ్ చేస్తున్నాం. చంద్రహాస్ మీద ట్రోలింగ్స్ వచ్చినప్పుడు మేమంతా బాధపడిన మాట వాస్తవమే. అయితే ఆ ట్రోలింగ్స్ ను చంద్రహాస్ పాజిటివ్ గా తీసుకున్నాడు. తనలో ఏవైనా లోపాలు ఉంటే సరిచేసుకుంటూ తనకు తాను ఎక్సీపిరియన్స్ చేసి ఎదుగుతున్నాడు. రీసెంట్ గా వరద బాధితుల కోసం తన వంతుగా సాయం చేశాడు. ఖమ్మం జిల్లా వెళ్లి నిత్యావసర వస్తువులు అందించాడు. రామ్ నగర్ బన్నీ లాంటి సినిమాను మాకు ఇచ్చిన డైరెక్టర్ శ్రీనివాస్ మహత్ కు థ్యాంక్స్ చెబుతున్నా. అతను మా అబ్బాయితో మరో సినిమా కూడా చేయాలని కోరుకుంటున్నా. నేను ఇండస్ట్రీలో సంపాదించిందిన డబ్బుతో రామ్ నగర్ బన్నీ చేశా. నటుడిగా నా కొడుకులోని ప్యాషన్ చూసే సినిమా నిర్మాణానికి ముందుకొచ్చా. అతను గొప్ప స్థాయికి వెళ్తాడని నమ్మకం ఉంది. రామ్ నగర్ బన్నీ సినిమా చూసి మీ ఆదరణ చూపించండి. చంద్రహాస్ ఏం చేయగలడు అనేది ఈ సినిమా చూపిస్తుంది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే ఎక్కడా వల్గారిటీ ఉండదు. కుటుంబ ప్రేక్షకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా సినిమా చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. అక్టోబర్ 4న థియేటర్స్ కు వెళ్లి మా మూవీ చూడండి. అన్నారు.
హీరో చంద్రహాస్ మాట్లాడుతూ – రామ్ నగర్ బన్నీ సినిమా టీజర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నా. నాకు ఇంత మంచి మూవీ చేసే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ శ్రీనివాస్ గారికి థ్యాంక్స్. నన్ను స్క్రీన్ మీద బాగా ప్రెజెంట్ చేశాడు. ఈ సినిమాకు ప్రతి ఒక్కరం టీమ్ వర్క్ చేశాం. హీరోయిన్స్ అద్భుతంగా నటించారు. నలుగురు హీరోయిన్స్ పర్ ఫార్మెన్స్ మీ అందరినీ ఆకట్టుకుంటుంది. నేను డ్యాన్స్ లు బాగా చేశానని అంటున్నారు. ముందుగా బాగా ప్రాక్టీస్ చేయడమే స్క్రీన్ మీద మంచి ఔట్ పుట్ తీసుకొచ్చింది. మ్యూజిక్ మా మూవీకి మరో ఆకర్షణ అవుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ అశ్విన్ హేమంత్ హిట్ సాంగ్స్ చేశాడు. ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ గారికి, డ్యాన్స్ మాస్టర్స్ కు, సినిమాటోగ్రాఫర్ అష్కర్ అలీకి అందరికీ థ్యాంక్స్. నాకు రామ్ చరణ్, అల్లు అర్జున్ , ఎన్టీఆర్..ఇలా హీరోలంతా ఇష్టమే. ఎన్నో గొప్ప క్వాలిటీస్ వారిలో ఉన్నాయి. వాళ్లను స్ఫూర్తిగా తీసుకుని నటిస్తా. రామ్ నగర్ బన్నీ సినిమా కంప్లీట్ ఎంటర్ టైనర్. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాను ఏ భాషలో చూసినా సబ్ టైటిల్స్ వేస్తే చాలు ఎంజాయ్ చేస్తారు. అన్నారు.
నటీనటులు – చంద్రహాస్, విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర, మురళీధర్, సలీమ్ ఫేకు, మధునందన్, సుజాత, విజయలక్ష్మి, సమీర్, లక్ష్మణ్ టేకుముడి, ప్రణయ్ గణపూర్, శివ, హృశికేష్ గజగౌని, తదితరులు
టెక్నికల్ టీమ్
పబ్లిసిటీ డిజైన్ – మ్యానీ
ఆర్ట్ డైరెక్టర్ – రాజశేఖర్
ఎడిటింగ్ – మార్తాండ్ కె వెంకటేష్
సినిమాటోగ్రఫీ- అష్కర్ అలీ
మ్యూజిక్ డైరెక్టర్ – అశ్విన్ హేమంత్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – విజయ్
పీఆర్ఓ – సురేష్ కొండేటి
సమర్పణ – దివిజ ప్రభాకర్
నిర్మాతలు – మళయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ
రచన, దర్శకత్వం – శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్)
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…