వరుణ్ ధావన్, కీర్తి సురేష్, వామికా గబ్బి, జాకీ ష్రాఫ్ లీడ్ రోల్స్ లో చేస్తున్న సెన్సేషనల్ మూవీ ‘బేబీ జాన్’. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అట్లీ, జియో స్టూడియోస్ A ఫర్ Apple, Cine1 స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ టేస్టర్ కట్ రిలీజ్ అయ్యింది.
కలీస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ దాదాపు రెండు నిమిషాల టీజర్, చీమల గుంపు ఏనుగును ఎలా ఓడించగలవో ఓ యంగ్ గర్ల్ చెప్పే మెస్మరైజ్ కథనంతో ప్రారంభమైయింది. ఈ మెటాఫర్ వరుణ్ క్యారెక్టర్ బేబీ జాన్‌ను అద్భుతంగా ప్రజెంట్ చేసింది. టీజర్ వరుణ్ ను ఫెరోషియస్ పోలీసుగా, ప్రేమగల తండ్రిగా, యాక్షన్ హీరోగా, నైపుణ్యం కలిగిన వంటవాడిగా ఇలా మల్టీషేడ్స్ లో ప్రజెంట్ చేసింది. బ్రెత్ టేకింగ్ విజువల్స్, అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, వరుణ్ అద్భుతమైన స్లో-మోషన్ స్టంట్స్ ప్రేక్షకులను మరింత ఆసక్తిని కలిగించాయి. ఈ టేస్టర్ కట్‌తో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
వరుణ్‌తో పాటు ఇందులో కీర్తి సురేష్, వామికా గబ్బి కీలక పాత్రలలో నటించారు, లెజెండరీ జాకీ ష్రాఫ్ విలన్ పాత్రను పోషించారు. A ఫర్ Apple స్టూడియోస్, Cine1 స్టూడియోస్ పై ప్రియా అట్లీ, మురాద్ ఖేతాని, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు. థమన్ మ్యూజిక్ స్కోర్ మరింత ఉత్కంఠను పెంచుతుంది. అట్లీ , Jio స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రం డిసెంబర్ 25, 2024న థియేటర్లలోకి రానుంది.
నటీనటులు: వరుణ్ ధావన్, కీర్తి సురేష్, వామికా గబ్బి, జాకీ ష్రాఫ్, రాజ్‌పాల్ యాదవ్
సమర్పణ: జియో స్టూడియోస్, అట్లీ
అసోసియేషన్ విత్ : అట్లీ, సినీ1 స్టూడియోస్ , A ఫర్ Apple & సినీ1 స్టూడియోస్
నిర్మాతలు: మురాద్ ఖేతా, ప్రియా అట్లీ, జ్యోతిదేశ్‌పాండే
దర్శకత్వం: కలీస్
డీవోపీ: కిరణ్ కౌశిక్
అసోసియేట్ ప్రొడ్యూసర్: అమూల్ వి మోహన్
సూపర్వైజింగ్ ప్రొడ్యూసర్: సుధాంశు కుమార్
క్రియేటివ్ ప్రొడ్యూసర్: కైస్ ఖేతాని
మ్యూజిక్ లేబుల్: జీ మ్యూజిక్
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…