పాన్ ఇండియా సినిమాలు తీస్తున్న డైరెక్టర్లందరికీ ఇది ఒక పాఠం — ఇరుముడి చూసి నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది!

Must Read

ఇరుముడి సినిమా కలెక్షన్స్ చూస్తుంటే అసలు నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయి. సినిమా చరిత్రలో ఇలాంటి కలెక్షన్స్, ఇలాంటి జనసందోహం చాలా అరుదుగా మాత్రమే చూస్తాం. C సెంటర్ల నుంచి పెద్ద పెద్ద సెంటర్ల వరకు అన్ని థియేటర్లలో షోలు హౌస్‌ఫుల్ అవుతున్నాయి.

ఒకప్పుడు దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో విజయశాంతి గారు నటించిన ఓసే రాములమ్మ సినిమాకు జనాలు బండ్లు కట్టుకుని వచ్చి, రాత్రిళ్లు కూడా థియేటర్ల దగ్గర కాపలాలు కాసి సినిమా చూసిన రోజులను నేను చూశాను. అప్పుడు థియేటర్ల దగ్గర కనిపించిన ఆ జనసందోహం, ఆ ఉత్సాహం మళ్లీ ఇప్పుడు ఇరుముడి సినిమాకు కనిపిస్తోంది.

ఫ్యామిలీస్‌తో కలిసి ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూస్తున్నారు. ఒక్క షో కూడా ఖాళీ లేకుండా జనాలతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. ఇలాంటి దృశ్యాలు చూస్తుంటే ఒక విషయం మరోసారి స్పష్టమవుతోంది — కంటెంట్ బాగుంటే ప్రేక్షకుడు థియేటర్‌కు రావడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు.

ఇరుముడి ₹300 కోట్ల మార్క్‌ను దాటుతుందని అంచనా కూడా కనిపిస్తోంది. అంటే ప్రేక్షకుడు సినిమాను చూడటం మానేయలేదు. మంచి కథ, సరైన కంటెంట్, ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఉంటే ఎలాంటి సినిమా అయినా ప్రేక్షకులు థియేటర్లలో ఆదరిస్తారు. ఇరుముడి ఈ విషయాన్ని మరోసారి నిరూపిస్తోంది.

ఇది పాన్ ఇండియా సినిమాలు తీస్తున్న డైరెక్టర్లందరికీ ఒక మంచి పాఠం. పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద హీరోలు, పాన్ ఇండియా అనే మోజులో పడి… అసలు సబ్జెక్ట్‌ను, కంటెంట్‌ను, సినిమా ఆత్మను దెబ్బతీస్తున్నారు. కానీ ప్రేక్షకుడికి కావాల్సిన సినిమాను మాత్రం ఇవ్వలేకపోతున్నారు.

ప్రేక్షకుడికి పాన్ ఇండియా ట్యాగ్ అవసరం లేదు… మంచి సినిమా కావాలి. మంచి కథ కావాలి. మంచి కంటెంట్ కావాలి.

ప్రేక్షకుడికి ఏ సినిమా కావాలో, ఆ సినిమాను సరైన సబ్జెక్ట్‌తో తీస్తే ప్రేక్షకుడు థియేటర్‌కు రావడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు.

ఇరుముడి మరోసారి నిరూపిస్తున్న నిజం ఒక్కటే — కంటెంట్ ఉంటే అదే అసలైన పాన్ ఇండియా!

రవి తేజ గారికి, శివ నిర్వాణ గారికి, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకు, నిర్మాతలు వై. రవి శంకర్ గారికి, నవీన్ యెర్నేని గారికి మరియు ఇరుముడి చిత్రంలోని మొత్తం టీమ్‌కు హృదయపూర్వక అభినందనలు.

ఈ అద్భుతమైన విజయానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

ఇట్లు,
Natti Kumar
Producer | Distributor | Exhibitor

Latest News

‘టాక్సిక్’ పాత్ బ్రేకింగ్ మూవీ అవుతుంది. మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది. ప్రేక్షకులకు గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది: గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో రాకింగ్ స్టార్ యశ్

రాకింగ్ స్టార్ యశ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో...

More News