‘తిరగబాదరసామి’. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో రాజ్ తరుణ్

యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘తిరగబడరసామీ’. మాల్వి మల్హోత్రా కథానాయికగా నటిస్తోంది. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ ట్రైలర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు.

పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. మాస్ ని అలరించే హై వోల్టేజ్ యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ హైలెట్ గా నిలిచాయి. రాజ్ తరుణ్ యాక్షన్ మునుపెన్నుడూ కనిపించని యాక్షన్ అవతార్ లో అదరగొట్టారు. తన ప్రెజెన్స్, పెర్ఫార్మెన్స్ హైలీ ఎనర్జిటిక్ గా వుంది. హీరోయిన్ మాల్వి మల్హోత్రా క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. మన్నారా చోప్రా, మకరంద్ దేశ్‌పాండే క్యారెక్టర్స్ కూడా చాలా ఇంట్రస్టింగ్ గా వున్నాయి.

డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి యాక్షన్, ఎమోషన్ ని ఎక్స్ ట్రార్డినరీ గా బ్లెండ్ చేశారు. ఆయన టేకింగ్ బ్రిలియంట్ గా వుంది. రాజ్ తరుణ్ ని యాక్షన్ ప్యాక్డ్ రోల్ లో చాలా కొత్తగా చూపించారు. కెమరా వర్క్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్ లో వున్నాయి. హై యాక్షన్, ఎమోషన్, ఎంటర్ టైన్మెంట్ తో అదరగొట్టిన ట్రైలర్ సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచింది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. ఈ సినిమాకి అందరం ప్రాణం పెట్టి చేశాం. మా అందరికి కంటే ఎక్కువ కష్టపడింది డీవోపీ జవహర్ రెడ్డి గారు. ఆయన లేకపోతే సినిమా ఇంత అద్భుతంగా వచ్చేది కాదు. ఈ సినిమాలో నన్ను పార్ట్ చేసిన నిర్మాత శివ గారికి థాంక్ యూ. జెబి గారు గ్రేట్ మ్యూజిక్ ఇచ్చారు. మాల్వి వన్ అఫ్ ది బెస్ట్ యాక్టర్. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరున థాంక్ యూ. డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి గారితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. ఆయన నాపై ఒక్కసారి కూడా కొప్పడలేదు. (నవ్వుతూ). ఇంత యాక్షన్ పార్ట్ చేయడం నాకు కొత్త. డైరెక్టర్ గారి ఎంకరేజ్మెంట్ తో ఈజీగా చేశాను. ఇందులో ఎమోషన్ , ఎంటర్ టైన్మెంట్ అద్భుతంగా వుంటుంది. ఆడియన్స్ కి ఖచ్చితంగా నచ్చుతుంది. ‘తిరగబడరసామీ’ త్వరలోనే థియేటర్స్ లో వస్తుంది. దయచేసి అందరూ థియేటర్స్ లో చూడండి. పైరసీని ఎంకరేజ్ చేయొద్దు’ అన్నారు.

డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి మాట్లాడుతూ.. చాలా ఎమోషనల్ గా వుంది. 2004 ఇదే రోజున యజ్ఞం విడుదలై నా జీవితాన్ని మలుపు తిప్పింది, అదే రోజున ఈ ట్రైలర్ రిలీజ్ కావడం చాలా ఆనందంగా వుంది. రాజ్ తరుణ్ కాబోయే మాస్ హీరో. ఈ సినిమా తర్వాత తను మాస్ హీరోగా నిలబడతాడు. డీవోపీ జోహార్ రెడ్డి అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు, జేబీ అద్భుతమైన మ్యూజిక్ చేశారు. శివకుమార్ గారు సినిమాని చాలా గ్రాండ్ గా నిర్మించారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరు ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమా అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది’ అన్నారు.

మాల్వి మల్హోత్రా మాట్లాడుతూ.. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఇది చాలా బ్యూటీఫుల్ కథ. ఇందులో చాలా మంచి పాత్ర చేశాను. ఇందులో బాలకృష్ణ ఫ్యాన్ గా కనిపిస్తా. నాకు యాక్షన్ సీన్ కూడా వుంది. ఈ సినిమాతో తెలుగులో పరిచయం కావడం ఆనందంగా వుంది. రాజ్ తరుణ్ గారితో కలసి పని చేయడం చాలా అనందంగా వుంది. తను అద్భుతమైన యాక్టర్. అందరూ థియేటర్స్ లో సినిమా చూసి ఎంజాయ్ చేయండి’ అన్నారు.

నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరు ధన్యవాదాలు. ఎ ఎస్ రవికుమార్ చౌదరి గారు కథ చెప్పిన వెంటనే చాలా నచ్చింది. రాజ్ తరుణ్ అయితే బావుటుందని వారు ఒప్పుకోగానే సినిమాని స్టార్ట్ చేశాం, జెబి అద్భుతంగా నేపధ్య సంగీతం చేశారు. జవహర్ రెడ్డి గారు చాలా మంచి విజువల్స్ ఇచ్చారు. నేను ప్రతి సినిమాలో కొత్తవారిని పరిచయం చేస్తుంటాను. మాల్వి ఈ సినిమాతో తెలుగు తెరకి ఎంట్రీ అవుతున్నారు. ఈ పాత్రని చాలా చక్కగా చేశారు. మంచి సినిమాని ప్రేక్షకులకు అందిఇవ్వాలని టీం అంతా సమిష్టి కృషితో పని చేశాం. రాజ్ తరుణ్ యాక్షన్ పాత్రలో చాలా కొత్తగా కనిపిస్తారు. సైలెంట్ గా మొదలై వైలెంట్ ముగింపు వుంటుంది. ఈ నెలలోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ఇది మా బ్యానర్ లో రికార్డ్ లో నిలిచిపోయే సినిమా అవుతుందని ఆశిస్తున్నాం’ అన్నారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

తారాగణం: రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా, మకరంద్ దేశ్‌పాండే, రఘు బాబు, జాన్ విజయ్, అంకిత ఠాకూర్, పృధ్వి, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి

సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం: ఎ ఎస్ రవికుమార్ చౌదరి
నిర్మాత: మల్కాపురం శివకుమార్
బ్యానర్: సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా
సంగీతం: జెబి &భోలే షావలి
డీవోపీ: జవహర్ రెడ్డి యం. ఎన్
ఎడిటర్: బస్వా పైడిరెడ్డి
ఆర్ట్: రవికుమార్ గుర్రం
ఫైట్స్ – పృద్వీ, కార్తీక్
లిరిక్స్: సుద్దాల అశోక్ తేజ, శ్రీమణి
పీఆర్వో: వంశీ శేఖర్

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago