నేచురల్ స్టార్ నాని తన 30వ సినిమా కోసం వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ తో కొలబరేట్ అవుతున్నారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నెం 1 రూపొందునున్న ఈ చిత్రాన్ని రెండు రోజుల క్రితం అధికారికంగా ప్రకటించారు. నిర్మాతలు మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కెఎస్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించనున్నారు.
న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్ #Nani30 వరల్డ్ ని ఆవిష్కరిస్తూ ఒక వీడియోను విడుదల చేసారు. నాని ఒక భవనం పైన కూర్చుని ఫోటోలు క్లిక్ చేస్తూ తన తదుపరి ప్రాజెక్ట్ గురించి తన ఆన్-స్క్రీన్ కుమార్తెతో చర్చిస్తున్నట్లు ఈ స్పెషల్ వీడియో చూపిస్తుంది. ‘దసరా’ చిత్రానికి పెంచిన మీసాలతో పాటు గడ్డం కూడా షేవ్ చేస్తానని అంటున్నాడు నాని. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో కూడిన ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుందని, తండ్రీకూతుళ్ల బాండింగ్ యూఎస్‌పీగా ఉండబోతోందని ఈ స్పెషల్ వీడియో చూస్తే అర్ధమౌతోంది.
ఈ గ్లింప్స్ దర్శకుడితో సహా చిత్రానికి సంబంధించిన ప్రధాన సాంకేతిక నిపుణులను ప్రకటించారు. నూతన దర్శకుడు శౌర్యువ్ తొలిసారిగా మెగాఫోన్‌ను పట్టుకుని, చిన్న వీడియోతో భావోద్వేగానికి గురిచేశాడు. సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది.
ఈ చిత్రంలో కొంతమంది ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. సాను జాన్ వర్గీస్ ISC డీవోపీగా పని చేస్తున్నారు. జెర్సీ, శ్యామ్ సింగరాయ్ తర్వాత నానితో ఇది అతనికి మూడవ చిత్రం. సినిమాటోగ్రాఫర్ ఎమోషన్స్ అద్భుతంగా ఆవిష్కరించాడు.
హృదయం ఫేమ్‌కు చెందిన ప్రముఖ మలయాళ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందించారు. వీడియో కోసం అతని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా ఆహ్లాదకరంగా వుంది. సరైన మూడ్‌ని సెట్ చేసింది.
ప్రవీణ్ ఆంథోని ఎడిటర్ గ, జోతిష్ శంకర్ ప్రొడక్షన్ డిజైనర్ గా సతీష్ ఈవీవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా, క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా భాను ధీరజ్ రాయుడు పని చేస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారు మేకర్స్.
తారాగణం: నాని, మృణాల్ ఠాకూర్