ఈ టీవీలో ట్రెండీగా రాబోతున్న షో మిస్టర్‌ అండ్‌ మిసెస్‌

ఈ టీవీలో ట్రెండీగా రాబోతున్న సరికొత్త రియాలిటీ షో మిస్టర్‌ అండ్‌ మిసెస్‌….ఒకరికి ఒకరు
తెలుగు టీవి రంగంలో గత పదేళ్లుగా విశిష్ట సేవలందిస్తుంది జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ. దర్శకుడు అనిల్‌ కడియాలను, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థను ఈటీవి మొదటినుండి ఎంతో సపోర్టు చేయటంతో అనేక బ్లాక్‌బస్టర్‌ టీవీషోలను అనిల్‌ తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఉదాహరణకు అనిల్‌ కడియాల దర్శకత్వంలో ఈ టీవీలో గత ఆరేళ్లుగా ‘అలీతో సరదాగా’ ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ‘వావ్‌’,‘పాడుతా తీయగా’, ‘స్వరాభిషేకం’ వంటి అనేక షోలతో పాటు పండగల పూట ప్రసారమయ్యే స్పెషల్‌ షోలను డిజైన్‌ చేసి దర్శకత్వం వహించారు అనిల్‌ కడియాల.

ఈ షోలన్నింటికి కంటెంట్‌ పార్టును దగ్గరుండి చూసుకుంటూ నిర్మాతగా వ్యవహరించే వ్యక్తే ప్రవీణా కడియాల. నిర్మాత–దర్శకులిద్దరూ భార్య,భర్తలు కావటంతో ఎంత పెద్ద షోనైనా సక్సెస్‌ బాట పట్టించటం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇదే స్పీడుతో ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌’ ఒకరికి ఒకరు అనే ట్యాగ్‌లైన్‌తో సరికొత్తగా షోను డిజైన్‌ చేసి పది ఫేమస్‌ జంటలతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కంటెంట్‌ను ఎంతో క్రియేటివ్‌గా డిజైన్‌ చేసిన నిర్మాత ప్రవీణా కడియాల మాట్లాడుతూ–‘‘ ఈటీవిలో అక్టోబర్‌ 11న ప్రారంభం అవుతుంది మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ ఒకరికి ఒకరు. ప్రతి మంగళవారం రాత్రి 9–30నిమిషాలకు ప్రసారం కానున్న ఈ షోద్వారా ప్రముఖ నటి స్నేహ తొలిసారి జడ్జిగా వ్యవహరిస్తుండటం విశేషం.

స్నేహతో పాటు నటుడు శివబాలాజి ఒక జడ్జిగా వ్యవహరిస్తుండగా బ్లాక్‌బస్టర్‌ చిత్రాలకు కేర్‌ ఆఫ్‌ అడ్రస్‌గా నిలిచి ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌ స్లోగన్‌ను తెలుగువారికి పరిచయం చేసిన దర్శకుడు అనిల్‌ రావిపూడి స్పెషల్‌ జడ్డిగా వ్యవహరించటం ఈ షోకే హైలెట్‌. ఈ షోలో పాల్గొంటున్న పది జంటలకు రకారకాల టాస్క్‌లు ఉంటాయి. ఆ టాస్క్‌ల్లో విజేతగా నిలిచిన వారు ఫైనల్‌కి వెళ్లి గ్రాండ్‌ ఫినాలే టైటిల్‌తో పాటు భారీ ప్రైజ్‌మనీని సొంతం చేసుకుంటారు’’ అన్నారామే.మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ పోటీలో పాల్గొంటున్న పదిజంటలు..1. రవికిరణ్‌–సుష్మా 2. పవన్‌–అంజలి 3. సందీప్‌–జ్యోతి 4. హ్రితేష్‌–ప్రియా 5. శ్రీవాణి–విక్రమ్‌ 6. మధు–ప్రియాంక 7. ప్రీతమ్‌–మానస 8. సిద్దు–విష్ణుప్రియ 9. రాకేశ్‌–సుజాత 10. విశ్వ–శ్రద్ధ ఈజంటలందరూ బుల్లితెరపై అందరికి సుపరిచితులే. అనేక సందర్భాల్లో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నవారే. ఈ అందరినీ కలుపుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన స్టైల్‌తో మాస్‌ అభిమానులను సొంతం చేసుకున్న లేడి మాస్‌ స్టార్‌ శ్రీముఖి ఈ కార్యక్రమానికి యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు.

Tfja Team

Recent Posts

మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “చిరంజీవి” సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా "చిరంజీవి". ఈ చిత్రంలో తనికెళ్ల భరణి,ఈశ్వరీ రావు, గోపరాజు రమణ,శ్రీకాంత్…

4 hours ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 day ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

5 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

5 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago