ఆసక్తిరేపుతున్న హాలివుడ్‌లో తెలుగు హీరో “ది డిజర్వింగ్” ట్రైలర్

Must Read

తెలుగు ట్యాలెంటెడ్ హీరో వెెంకట సాయి గుండ హాలీవుడ్‌లో నిర్మించిన ఫిచర్ ఫిల్మ్ ‘ది డిజర్వింగ్’ ట్రైలర్ విడుదలైంది. కథ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక ట్రైలర్ చూస్తే నిజంగా మతి పోతుంది. ఇంటెన్స్ బ్యాగ్రౌండ్ మ్యాజిక్ ఉంది. రోమాలు నిక్కబొడుచేలా ఒక్కో షాట్ అద్భతంగా డిజైన్ చేశారు. అలాగే సినిమాటోగ్రఫీ సైతం చాలా క్లాస్‌గా ఉంది. ప్రతీ ఫ్రేమ్ అదిరిపోయింది. ముఖ్యంగా ట్రైలర్ కట్ చేసిన విధానం చాలా కొత్తంగా ఉంది. సినిమాకు ఎడిటింగ్ చాలా ప్లస్ అవబోతున్నట్లు అనిపిస్తుంది. కేవలం ట్రైలర్‌లోనే ఇంత సస్పెన్స్‌ను చూపించిన డైరెక్టర్ స్టైల్, టేకింగ్ అద్భుతంగా ఉంది. ది డిజర్వింగ్ సిల్వర్ స్క్రీన్ పై ఏదో మ్యాజిక్ చేస్తుందని అనిపిస్తుంది. ఈ మూవీలో హాలీవుడ్ నటులు నటించడంతో చాలా ఫ్రెస్ ఫిలింగ్ అనిపిస్తుంది. ఇది కచ్చితంగా కొత్త అనుభూతిని కలిగించబోతుంది అని ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతుంది. ఇక ట్రైలర్ హర్రర్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి. కొన్ని షాట్స్ చూస్తుంటే గూజ్ బంప్ప్ వస్తున్నాయి. థియేటర్లో చూసే ప్రేక్షకులు కచ్చితంగా ఊపిరి బిగపట్టి చూస్తారనేది అర్థం అవుతుంది.

తెలుగు నుంచి తొలిసారిగా వెంకట్ సాయి గుండ నిర్మించిన హాలీవుడ్ ఫీచర్ ఫిల్మ్ “ది డిజర్వింగ్” ట్రైలర్ విడుదలైంది. ఈ సైకాలజికల్ హారర్ ఎమోషనల్ థ్రిల్లర్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 28కు పైగా ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకుంది. ఫ్రాన్స్, టొరంటో, స్వీడన్, నేపాల్, లండన్, నైజీరియా, బెర్లిన్, స్పెయిన్, న్యూయార్క్, కేన్స్, రోమ్ వంటి ఎన్నో దేశాలలో ఈ చిత్రం గొప్ప పేరు సంపాదించుకుంది.
ఈ చిత్రం ఈ నెలలో స్పెయిన్‌లోని బార్సిలోనాలో ప్రదర్శింపబడనుంది. సినిమా విమర్శకులు, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ సినిమా, వెంకట్ సాయి గుండ సారథ్యంతో రూపొందించడం విశేషం. పెద్ద బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా, అతని పట్టుదలతో ఈ హాలీవుడ్ స్థాయి సినిమా రూపొందించడం హృదయానికి హత్తుకునే విషయం.

“ది డిజర్వింగ్” చిత్రంలో కేవలం హార్రర్ మాత్రమే కాదు, సమాజంపై బలమైన సందేశాన్ని కూడా ఇవ్వబోతుంది. మనిషి మనుగడ, కఠినమైన పరిస్థితులను ఎదుర్కొనే సన్నివేశాలు, భవిష్యత్తుకోసం ఆరాటం లాంటి అంశాలలను ఎమోషనల్, సైకాలజికల్‌గా చెప్పడం జరిగిందని మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను రంజింప చేస్తుందని మేకర్స్ తెలిపారు. త్వరవలోనే ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది. కచ్చితంగా వెంకట్ సాయి గుండకు ఫిల్మ్ మేకింగ్‌పై చాలా పట్టుందని అర్థం అవుతుంది. భవిష్యత్తులో ఇలాంటి వినుత్మమైన సబ్జెక్టులను తెరకెక్కించే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి.

Latest News

తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్‌ యోగా...

More News