శ్రీకాంత్‌ చేతులమీదుగా ‘అంతిమ తీర్పు’ ట్రైలర్‌ విడుదల

శ్రీకాంత్‌ చేతులమీదుగా ‘అంతిమ తీర్పు’ ట్రైలర్‌ విడుదల
కబాలి ఫేం సాయి ధన్సిక, విమలారామన్‌, గణేష్‌ వెంకట్రామన్‌ ముఖ్య పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘అంతిమ తీర్పు’. శ్రీసిద్ధి వినాయక మూవీ మేకర్స్‌ పతాకంపై డి.రాజేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఎ.అభిరామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

షూటింగ్‌ తదితర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం కానుంది. ‘అంతిమ తీర్పు’ సినిమా ట్రైలర్‌ను హీరో శ్రీకాంత్‌ తన నివాసంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సినిమా సక్సెస్‌ కావాలని ఆకాంక్షించారు.

నిర్మాత డి.రాజేశ్వరరావు మాట్లాడుతూ ‘‘వినూత్న కథాంశంతో రూపొందిన చిత్రమిది. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. సాయిధన్సిక నటన సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. అడగ్గానే మంచి మనసుతో మా సినిమా ట్రైలర్‌ విడుదల చేసిన శ్రీకాంత్‌గారికి కృతజ్ఞతలు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని అన్నారు.

నటుడు దీపు, బండి రమేష్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ట్రైలర్‌ విడుదల చేసిన శ్రీకాంత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాను ఆదరించాలని కోరారు.

నటీనటులు:
సాయి ధన్సిక, విమలారామన్‌, గణేష్‌ వెంకట్రామన్‌, సత్యప్రకాశ్‌, అమిత్‌ తివారీ, దీపు, నాగమహేశ్‌ తదితరులు.

సాంకేతిక నిపుణులు:
కథ: మురళీ రమేశ్‌
కెమెరా: ఎన్‌ సుధాకరరెడ్డి,
సంగీతం: కోటి
ఎడిటర్‌: గ్యారీ బి.హెచ్‌
కొరియోగ్రాఫర్‌: ఈశ్వర్‌ పెంటి
ఫైట్స్‌: డ్రాగన్‌ ప్రకాశ్‌ –దేవరాజ్‌
చీఫ్‌ కో డైరెక్టర్‌: బండి రమేష్‌
పీఆర్వో: మధు విఆర్‌
పబ్లిసిటీ డిజైనర్‌: సుజిత్‌ యాడ్స్‌
టీజర్‌ అండ్‌ ట్రైలర్‌ కట్స్‌: రామకృష్ణ కోనేరు.

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago