మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చిత్రానికి ‘దేవర’ టైటిల్ ఖరారు.. ఇన్‌టెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమా నుంచి అప్ డేట్ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూడసాగారు. శనివారం (మే 20) రోజున తారక్ పుట్టినరోజు కావటంతో ఎన్టీఆర్30పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సందర్భంలో ఆయన నెక్ట్స్ మూవీ ఎన్టీఆర్ 30 సినిమా టైటిల్‌ను ‘దేవర’గా ఖరారు చేస్తూ మేకర్స్ ఖరారు చేశారు. హై యాక్షన్ డ్రామాగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.
‘దేవర’ సినిమా ఫస్ట్ లుక్ విషయానికి వస్తే.. ఎన్టీఆర్ రగ్డ్ లుక్‌తో పంచె కట్టుకుని స్టైల్‌గా నిలబడి ఉన్నారు. ఆ ఫస్ట్ లుక్‌లో రా, ఇన్‌టెన్స్ కనిపిస్తోంది. ఇప్పుడు ఇంటర్నెట్ అంతా ఈ లుక్ తుపానులా ట్రెండ్ అవుతోంది. దేవర అంటే దేవుడు అని అర్థం. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రరం యాక్షన్ జోనర్‌లో సరికొత్త బెంచ్ మార్క్‌ని క్రియేట్ చేయనుంది.
నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కొసరాజు హరికృష్ణ, సుధాకర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను ఏప్రిల్ 5 2024లో విడుదల చేస్తున్నారు. ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ చిత్రానికి ఆర్.రత్నవేలు సినిమాటోగ్రఫీ, సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనింగ్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…