నిఖిల్ నేషనల్ థ్రిల్లర్ ‘స్పై’ టీజర్ మే 15న విడుదల

Must Read

నిఖిల్ పాన్-ఇండియన్ మూవీ, నేషనల్ థ్రిల్లర్ ‘స్పై’ తుమ్ ముజే ఖూన్ దో, మై తుమ్హే ఆజాదీ దూంగా (మీరు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను) అని నినాదం ఇచ్చిన సుభాష్ చంద్రబోస్ యొక్క రహస్యాల ఆధారంగా రూపొందించబడిందని మేకర్స్ ఇటీవల విడుదల చేసిన వీడియో ద్వారా సూచించారు.

ఢిల్లీలో చారిత్రాత్మకం ఈవెంట్ చోటు చేసుకోనుంది. స్పై టీజర్ మే 15న కర్తవ్య పథ్(రాజ్ పాత్)లో విడుదల కానుంది. ఈ ఐకానిక్ ల్యాండ్‌ మార్క్‌ లో మూవీ  టీజర్ లాంచ్ కావడం ఇదే తొలిసారి. కౌంట్‌ డౌన్ ఇప్పుడు ప్రారంభమవుతున్నందున మీ క్యాలెండర్‌ లను మార్క్ చేసుకోండి. అందరి తో పంచుకోండి. అద్భుతమైన ఘట్టం ఒకటి తెరపైకి రాబోతోందని అందరికీ తెలియజేయండి.

ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని ఈడీ  ఎంటర్‌ టైన్‌ మెంట్స్ పై కె రాజశేఖర్ రెడ్డి,  సి ఇ ఓ గా చరణ్ తేజ్ ఉప్పలపాటి నిర్మించారు.నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటిస్తుండగా, సన్యా ఠాకూర్ సెకండ్ ఫిమేల్ లీడ్ లో  పవర్‌ఫుల్ రోల్ పోషిస్తోంది. ఆర్యన్ రాజేష్ తన కమ్ బ్యాక్ లో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు.

ఈ చిత్రానికి నిర్మాత కె రాజశేఖర్ రెడ్డి కథను అందించారు. ఈ కంప్లీట్ యాక్షన్-ప్యాక్డ్ స్పై థ్రిల్లర్‌  తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.స్పై ఈ ఏడాది జూన్ 29న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.

తారాగణం: నిఖిల్ సిద్ధార్థ్, ఆర్యన్ రాజేష్, ఐశ్వర్య మీనన్, సన్యా ఠాకూర్, అభినవ్ గోమఠం, మకరంద్ దేశ్‌పాండే, జిషు సేన్ గుప్తా, నితిన్ మెహతా, రవివర్మ, కృష్ణ తేజ, ప్రిషా సింగ్, సోనియా నరేష్ & ఇతరులు.

సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం & ఎడిటింగ్ : గ్యారీ BH
కథ & నిర్మాత:  కె. రాజశేఖర్ రెడ్డి
సీఈవో : చరణ్ తేజ్ ఉప్పలపాటి
DOP : వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్
అడిషినల్ సినిమాటోగ్రఫీ:  జూలియన్ అమరు ఎస్ట్రాడా DFP, కైకో నకహరా
రచయిత : అనిరుధ్ కృష్ణమూర్తి
సంగీతం: శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్
ఆర్ట్ : అర్జున్ సూరిశెట్టి
సౌండ్ డిజైన్:  సింక్ సినిమా
DI & మిక్సింగ్ అన్నపూర్ణ స్టూడియోస్
మిక్సింగ్ ఇంజనీర్ కన్నన్ గణపత్
అసోసియేట్ ఎడిటర్ భవిన్ ఎం షా
PRO వంశీ – శేఖర్
డిజిటల్ టమాడా మీడియా

Latest News

తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్‌ యోగా...

More News