ది సోల్‌ఫుల్ మెలోడీ ఆఫ్ ది సీజన్- పెదకాపు-1 నుంచి ‘చనువుగా చూసిన’ పాట విడుదల

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తన సినిమాల్లో ప్లజంట్ ట్యూన్‌లు ఉండేలా చూసుకుంటారు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘పెదకాపు-1’లో కూడా బ్యూటీ ఫుల్ సాంగ్స్ వున్నాయి. సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘అఖండ’ను అందించిన ద్వారకా క్రియేషన్స్‌ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. ఫస్ట్ సింగిల్ ప్రోమోకు మంచి స్పందన లభించింది.

ఈరోజు పూర్తి పాటను మేకర్స్ విడుదల చేశారు. లీడ్ పెయిర్ ఆకర్షణీయమైన రొమాంటిక్ కెమిస్ట్రీతో ప్రోమో అలరించగా, పూర్తి పాట వారి అందమైన ప్రేమకథను ప్రజంట్ చేసింది. మిక్కీ జె మేయర్ లవ్లీ  మెలోడీతో మ్యాజిక్ చేశారు. అనురాగ్ కళ్యాణ కులకర్ణి, చైత్ర అంబడిపూడి వాయిస్ మెస్మరైజ్ చేస్తోంది. కళ్యాణచక్రవర్తి త్రిపురనేని సాహిత్యం ప్రేమలోని లోతుని అద్భుతంగా వర్ణిస్తుంది.

కన్నుల విందుగా చిత్రీకరించిన ఈ పాటలోని విజువల్స్ కళ్లకు కట్టినట్లు ఉన్నాయి. విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ ఇద్దరూ అందంగా కనిపించారు. వారి కెమిస్ట్రీ పాటలో బాగా వర్కౌట్ అయింది. ఈ పాట ఇన్స్టంట్ చార్ట్‌బ‌స్టర్ కాబోతోంది.

అణచివేత, ఘర్షణల నేపథ్యంలో సాగే సినిమా ఇది. టీజర్‌లో శ్రీకాంత్ అడ్డాల కథ-కథనంలో తన ప్రతిభను చూపించారు. టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది.

ఈ చిత్రానికి ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పిస్తున్నారు. ప్రముఖ యాక్షన్ దర్శకుడు పీటర్ హెయిన్స్ ఫైట్స్‌ను పర్యవేక్షించగా రాజు సుందరం కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు.

నటీనటులు: విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ, రావు రమేష్, నాగ బాబు, తనికెళ్ల భరణి, బ్రిగడ సాగ, రాజీవ్ కనకాల, అనుసూయ, ఈశ్వరి రావు, నరేన్ తదితరులు.

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల
నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి
బ్యానర్: ద్వారకా క్రియేషన్స్
సమర్పణ: మిర్యాల సత్యనారాయణ రెడ్డి
సంగీతం – మిక్కీ జె మేయర్
డీవోపీ – చోటా కె నాయుడు
ఎడిటర్ – మార్తాండ్ కె వెంకటేష్
ఫైట్స్: పీటర్ హెయిన్స్
కొరియోగ్రాఫర్ – రాజు సుందరం
ఆర్ట్- జిఎం శేఖర్
పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago