ఎస్ఎల్ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణలో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘లెహరాయి’. రామకృష్ణ పరమహంసను దర్శకుడి గా పరిచయం చేస్తూ మద్దిరెడ్డి శ్రీనివాస్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో ధర్మపురి ఫేం గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ చాలా ఫేమస్ కావటం విశేషం. ఇదివరకే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్ కు, సాంగ్స్ కు విశేష స్పందన లభించింది. ఇక సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ ఈ చిత్రంతో జీకే ఈజ్ బ్యాక్ అన్నట్టు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు.
ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన గుప్పెడంత సాంగ్ మిలియన్ వ్యూస్ తెచ్చుకుంది. ఈ సక్సస్ ను పురస్కరించుకుని లెహరాయి చిత్రం నుండి “నువ్వు వందసార్లు వద్దన్న” అనే మరో సాంగ్ ను కూడా విడుదల చేశారు మేకర్స్. ఈ పాటని ఉమ మహేశ్వరరావు తమ్మిరెడ్డి రచించారు.ఈ పాటను హరిచరణ్ ఆలపించారు.
ఈ పాటలోని
“నీ మీద ప్రేమ కొలవలేనులే
అది నీకు చెప్పాలంటే
భాషే చాలదు తెలుసా
గడియ కూడా నీ ఎడబాటు
ఊహించడం నా తరమా”
లాంటి లైన్స్ ఆకట్టుకున్నాయి.
ఈ చిత్రంలో మొత్తం 7 సాంగ్స్ ఉన్నట్లు, మంచి ఫీల్ ఉన్న కథతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు ఇదివరకే దర్శకుడు రామకృష్ణ పరమహంస” తెలిపారు. ప్రముఖులు నటించిన ఈ చిత్రాన్ని నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పిస్తున్నారు. లెహరాయి రిలీజ్ డేట్ ను త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది చిత్ర బృందం.
నటీనటులు: రంజిత్, సౌమ్య మీనన్, గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ,సత్యం రజెష్, జబర్దస్త్ రాంప్రసాద్ తదితరులు.
సాంకేతిక నిపుణులు :
సమర్పకులు : బెక్కం వేణుగోపాల్
బ్యానర్ : ఎస్ ఎల్ ఎస్ మూవీస్
నిర్మాత : మద్దిరెడ్డి శ్రీనివాస్
రైటర్, డైరెక్టర్ : రామకృష్ణ పరమహంస
మ్యూజిక్ : జీకే (ఘంటాడి కృష్ణ)
డి.ఓ.పి : ఎం ఎన్ బాల్ రెడ్డి
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
లిరిక్ రైటర్స్ : రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ , శ్రీమణి
ఫైట్ మాస్టర్ : శంకర్
కొరియోగ్రాఫర్స్ : అజయ్ సాయి
రైటర్ : పరుచూరి నరేష్
పి ఆర్.ఓ : ఏలూరు శీను, మేఘశ్యామ్
Dharma and Aishwarya Sharma play the lead roles in Drinker Sai, which carries the tagline…
ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "డ్రింకర్ సాయి". బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ…
Aaron Taylor-Johnson is arguably one of the fittest stars out there and his physical transformation…
వరల్డ్ లోనే మోస్ట్ హ్యాండ్సం మ్యాన్ అయిన టేలర్ జాన్సన్ తన ఫ్యాన్స్ తో మాట్లాడుతూ, తను క్రావెన్ ది…
జైనీ క్రియేషన్స్ పతాకంపై మూలవిరాట్, పద్మ,రాజ్ కుమార్, స్వప్న నటీ నటులుగా అమ్మ నీకు వందనం, క్యాంపస్ అంపశయ్య’, ప్రణయ…
డైస్ ఆర్ట్ ఫిల్మ్స్ ఆధ్వర్యంలో ప్రముఖ గాయకుడు నోయెల్ తెలుగోడి బీట్ సాంగ్ లాంచ్ ఈవెంట్ విజయవంతంగా జరిగింది. ఈ…