‘డంకీ డ్రాప్ 4’ విడుదల .. అందమైన ప్రపంచాన్ని పరిచయం చేసిన సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాని…

షారూక్ అతని నలుగురి స్నేహితుల ప్రయాణం గురించి చెప్పే డంకీ

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాని కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘డంకీ’. మంగళవారం ఈ సినిమా నుంచి ‘డంకీ డ్రాప్ 4’గా మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇది ఈ ఏడాది మీ హృదయాలను కదిలించే చిత్రంగా గుర్తుండిపోతుంది. దీనికి సంబందించిన కథాంశాన్ని తెలియజేస్తుంది డంకీ డ్రాప్ 4. షారూక్ ఖాన్‌తో పాటు తాప్సీ పన్ను, బోమన్ ఇరాని, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ ప్రధాన పాత్రల్లో నటించారు.

డంకీ కోసం డైరెక్టర్ రాజ్ ‌కుమార్ హిరాని ఆవిష్కరించిన అందమైన ప్రపంచాన్ని డంకీ డ్రాప్ 4 పరిచయం చేస్తుంది. దీన్ని గమనిస్తే.. ట్రైన్‌లో నుంచి షారూక్ తను పుట్టి పెరిగిన ప్రాంతానికి వస్తాడు. అక్కడి నుంచి వారు ఎలాంటి సాహసం చేశారనే దాన్ని కూడా అతని స్వరంలోనే మనకు తెలియజేశారు. ఇందులో హార్డి అనే పాత్రలో షారూక్ నటిస్తున్నారు. తన పాత్రతో పాటు షారూక్ స్నేహితులైైన మను, సుఖి, బుగ్గు, బల్లి పాత్రలను, ఆ పాత్రల్లో నటించిన నటీనటులను డంకీ డ్రాప్ 4లో ఆవిష్కరించారు. ఈ కథంతా పంజాబ్‌లోని ఓ పల్లెటూరులో జరుగుతుంది. జీవితంలో ఉన్నతంగా ఉండాలనే కోరికతో, తమకు ఇష్టమైన వారు బావుండాలనే ఆశతో వారు లండన్ వెళ్లాలనుకుంటారు.

ఈ ప్రయాణంలో ఐదుగురు స్నేహితులు ఎదుర్కొన్న సవాళ్లు, అసాధారణ పరిస్థితులు వారి జీవితాలను ఎలా మార్చాయనేది తెలియజేస్తూనే ప్రేమ, స్నేహం, భావోద్వేగాలతో సినిమా హృదయాలను హత్తుకునేలా ఉంటుందని తెలియజేసింది డంకీ డ్రాప్ 4.

రాజ్‌కుమార్ హిరాని కథలను అద్భుతంగా తెరపై ఆవిష్కరిస్తుంటారు. షారూక్ పుట్టినరోజు సందర్భంగా డంకీ డ్రాప్ 1 వీడియోను విడుదల చేసి అభిమానులకు, ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్లింగ్ ఫీలింగ్‌ను అందించారు. డంకీ డ్రాప్ 2లో ‘లుట్ పుట్ గయా..’ సాంగ్ విడుదల చేశారు. ఇందులో అర్జిత్ సింగ్ గాత్రం అందరినీ ఆకట్టుకుంది. తర్వాత డంకీ డ్రాప్ 3 అంటూ సోనూ నిగమ్ అందమైన స్వరంతో పాడిన ఎమోషనల్ సాంగ్ నికలె ది కబీ హమ్ ఘర్ సే పాటను విడుదల చేశారు. తాజాగా ఇప్పుడు డంకీ డ్రాప్ 4 అంటూ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ప్రేమ, స్నేహం సహా పలు అంశాలు ప్రేక్షకులను చక్కటి ఫీలింగ్‌ను అందిస్తున్నాయి. ఇదొక చక్కటి రైడ్‌లా ఉంటుందనే విషయాన్ని మేకర్స్ చెప్పకనే చెప్పారు. ఐదుగుు స్నేహితులు విదేశాలకు వెళ్లాలనే కోరికను ఎలా నేరవేర్చుకున్నారు. వారి గమ్యస్థానాన్ని వారు చేరుకున్నారా? అనే కథాంశంతో డంకీ సినిమా తెరకెక్కిందని ట్రైలర్ తెలియజేస్తుంది. ఇందులో షారూక్ ముసలివాడి పాత్రలోనూ కనిపిస్తున్నారు. ఇది సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. సినిమా రిలీజ్ కోసం ఎదురు చూసేలా చేసింది డంకీ డ్రాప్ 4.

‘డంకీ’ కేవలం సినిమా మాత్రమే కాదు.. మనల్ని ఓ కొత్త లోకంలోకి తీసుకెళ్లే చక్కటి అనుభూతి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్రను వేస్తుంది. డంకీ ఎమోషనల్ రోలర్ కోస్ట్‌లో ప్రయాణించటానికి సిద్ధంగా ఉండండి. మీ కలలు విమానాలలాగా ఆకాశంలోకి ఎగరాలి. స్నేహం విరబూయాలి అనే విషయాలను సినిమా తెలియజేస్తుంది.

హాస్యం, హృదయాన్ని తాకే అందమైన క్షణాల కలయికగా డంకీ సినిమా మీ కుటుంబ సభ్యులందరితో కలిసి చూసేలా, మీకు శాశ్వతమైన జ్ఞాపకాలను అందించటానికి డిసెంబర్ 21న మీ ముందుకు రానుంది.

ఏ జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, రాజ్‌కుమార్ హిరాని ఫిలిమ్స్ సమర్పణలో రాజ్‌కుమార్ హిరాని, గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 21న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అవుతుంది.

TFJA

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago