‘మల్లేశం’, ‘వకీల్‌సాబ్’ చిత్రాల ఫేం అనన్య నాగళ్ల ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘తంత్ర’. హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం పోస్టర్‌ను నిర్మాణ సంస్థ విడుదల చేసింది. భయంకరమైన క్షుద్రశక్తులు అనన్యని పీడిస్తున్నట్టుగా కనపడుతున్న పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ‘మగధీర’లో షేర్‌ఖాన్ లాంటి ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన దివంగత నటుడు శ్రీహరి తమ్ముడి కొడుకు ధనుష్ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. మరో కీలక పాత్రలో ‘మర్యాదరామన్న’ ఫేం సలోని ఈ సినిమా ద్వారా రీఎంట్రీ ఇస్తోంది.
మన తంత్ర శాస్త్రానికి చెందిన విస్తు గొలిపే రహస్యాలు ఈ మూవీ ద్వారా చెప్పబోతున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వి ఫిల్మ్ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంతో శ్రీనివాస్ గోపిశెట్టి అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. “ఫిమేల్ ఓరియెంటెడ్ లైన్‌తో రూపొందుతున్న హారర్ ఎంటర్‌టైనర్ ఇది. భారతీయ తాంత్రిక శాస్త్రం, పురాణగాధల నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది” అని దర్శకనిర్మాతలు తెలిపారు.
నటీనటులు
అనన్య నాగళ్ల. ధనుష్, సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్ తదితరులు
సాంకేతిక నిపుణులు:
బ్యానర్: ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వి ఫిల్మ్ ఫ్యాక్టరీ
నిర్మాతలు: నరేష్ బాబు పి, రవి చైతన్య
దర్శకత్వం: శ్రీనివాస్ గోపిశెట్టి (ప్రోమో డైరెక్టర్ వాల్ డిస్నీ ముంబై)
కెమెరా: సాయి రామ్ ఉదయ్ (రాజుయాదవ్ ఫేం), విజయ భాస్కర్ సద్దాల
ఎడిటింగ్: ఎస్.బి ఉద్దవ్ (భలే భలే మగాడివోయ్, మిథునం)
సంగీతం: ఆర్‌ఆర్ ధృవన్ (క్రేజీ ఫెలో, మైల్స్ ఆఫ్ లవ్)
సౌండ్ డిజైనర్: జ్యోతి చేతియా (రాధేశ్యామ్, గంగూబాయ్ కతియావాడి)
పీఆర్వో: మధు విఆర్.
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…