‘స్కంద’ ప్రీ రిలీజ్ ఆగస్టు 26న విడుదల

బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని, శ్రీనివాస చిట్టూరి, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ ‘స్కంద’ ప్రీ రిలీజ్ థండర్ ఆగస్టు 26న విడుదల

బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లతో ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించడంలో దిట్ట.  కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లు చేయడంలో స్పెషలిస్ట్ అయినప్పటికీ తన సినిమాల్లో తగిన వినోదం, ఫ్యామిలీ డ్రామా ఉండేలా చూసుకుంటారు. బోయపాటి ‘స్కంద’ కోసం ఎనర్జిటిక్ & మాస్ ఉస్తాద్ రామ్ పోతినేనితో చేతులు కలిపారు. రాపో  హై-ఆక్టేన్ ఎనర్జీ, ఉబర్ స్టయిల్ కి చిరునామా. రామ్ ‘స్కంద’ కోసం అన్ బిలివబుల్ గా మాస్ ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యారు. రాపో డిఫరెంట్  షేడ్స్‌లో కనిపిస్తున్నారు. పోస్టర్స్ లో అల్ట్రా మాస్‌తో పాటు క్లాస్‌ లుక్స్‌లోనూ అదరగొట్టారు. కండలుతిరిగిన శరీరంతో పవర్ ఫుల్ లుక్  లో ఎక్స్ టార్డినరిగా కనిపించారు. ఈ కాంబో & కంటెంట్ ‘స్కంద’ మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ ని సమానంగా అలరిస్తుందని సూచిస్తోంది.  

ఇప్పుడు, మేకర్స్ మరో  అప్డేట్ తో వచ్చారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ థండర్ ఆగస్ట్ 26న విడుదల కానుంది. పోస్టర్‌లో రామ్,  శ్రీలీల బ్యూటీఫుల్ కెమిస్ట్రీని పంచుకున్నారు. రామ్ పంచెకట్టులో కనిపిస్తే, శ్రీలీల హాఫ్ చీరలో హోమ్లీగా కనిపిస్తుంది. పొలంలో కూర్చుని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ అందమైన చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు

ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మొదటి రెండు పాటలు సంచలన విజయం సాధించాయి. ఫస్ట్ థండర్, టైటిల్ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రీ-రిలీజ్ థండర్ మరింతగా అంచనాలని పెంచనుంది.

 శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌తో శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ డిటాకే కెమెరామెన్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సౌత్,  పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా ‘స్కంద’ విడుదల కానుంది.

తారాగణం: రామ్ పోతినేని, శ్రీలీల
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
ప్రెజెంట్స్: జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్
సంగీతం: ఎస్ఎస్ థమన్
డీవోపీ: సంతోష్ డిటాకే
ఎడిటింగ్: తమ్మిరాజు
పీఆర్వో: వంశీ-శేఖర్, పులగం చిన్నారాయ

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago