మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు, పృధ్వీ పెరిచర్ల నిర్మిస్తున్న సినిమా “స్కై”. పృధ్వీ పెరిచర్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో శివ ప్రసాద్ అనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. “స్కై” సినిమా ఫిబ్రవరి 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు “స్కై” సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను ప్రముఖ దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
మ్యూజిక్ డైరెక్టర్ శివప్రసాద్ మాట్లాడుతూ – సినిమా ఇండస్ట్రీ మీద ప్యాషన్ తో చిన్న స్థాయి నుంచి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాను. ఈ చిత్రానికి వర్క్ చేసే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ పృథ్వీ పెరిచెర్ల గారికి థ్యాంక్స్. ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్లే ఈ సినిమాకు మంచి మ్యూజిక్ చేయగలిగాను. పాటలకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. అన్నారు.
నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ – ఈ ఈవెంట్ కు వచ్చే ముందు “స్కై” సినిమా కంటెంట్, సాంగ్స్ చూశాను. ఆ కంటెంట్ చూస్తుంటే ఈ మూవీలో ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ చూడబోతున్నామని తెలుస్తోంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. రసూల్ ఎల్లోర్ గారి విజువల్స్ బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఈ సినిమాకు పెట్టిన క్యాప్షన్ తోనే మూవీ ఎస్సెన్స్ తెలుస్తోంది. “స్కై” సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.
ప్రొడ్యూసర్ నాగిరెడ్డి గుంటక మాట్లాడుతూ – ఈ రోజు మా మూవీ ప్రెస్ మీట్ కు వచ్చిన మధుర శ్రీధర్ గారికి థ్యాంక్స్. “స్కై” సినిమాను మేమంతా ఎంతో కష్టపడి ప్రొడ్యూస్ చేశాం. టీమ్ అందరూ ప్యాషనేట్ గా వర్క్ చేశారు. హార్ట్ టచింగ్ ఎమోషన్స్ ఉన్న ఒక కొత్త ప్రేమ కథను మా మూవీలో మీరంతా చూడబోతున్నారు. ఫిబ్రవరి 6న సినిమాను రిలీజ్ చేస్తున్నాం. అన్నారు.
డైరెక్టర్ పృథ్వీ పెరిచెర్ల మాట్లాడుతూ – “స్కై” సినిమా షూటింగ్ కు ముందే అన్ని సాంగ్స్ రెడీ చేసి పెట్టుకున్నాం. డీవోపీ రసూల్ గారు ఇచ్చిన సజెషన్స్ తో సినిమాను అనుకున్న టైమ్ లో కంఫర్ట్ గా కంప్లీట్ చేయగలిగాం. ఆయన గైడెన్స్ మాకు చాలా ఉపయోగపడింది. ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేసిన టీమ్ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. మా సినిమా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాం. అన్నారు.
హీరో మురళీ కృష్ణంరాజు మాట్లాడుతూ – ఈ సినిమా ద్వారా నేను హీరోగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. వాస్తవంగా ఈ చిత్రానికి నిజమైన హీరోలు మా డైరెక్టర్ పృథ్వీ, నిర్మాతలు నాగిరెడ్డి, శ్రీలక్ష్మి. మా సినిమా కోసం టీమ్ చాలా కష్టపడింది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మూవీ కంప్లీట్ చేసి రిలీజ్ కు తీసుకొస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ శివ ఆటో డ్రైవర్, క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ తన ప్యాషన్ తో ఇండస్ట్రీలోకి రాగలిగాడు. మా సినిమా నుంచి రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్స్ అన్నింటికీ మంచి ఆదరణ దక్కింది. థియేట్రికల్ గా కూడా ఇదే సక్సెస్ ఇస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
నటి కేఎల్ కే మణి బామ్మ మాట్లాడుతూ – ఈ చిత్రంలో నేను సోది చెప్పే బామ్మ క్యారెక్టర్ లో నటించాను. రసూల్ గారు అందరితో పాటు నన్ను కూడా అందంగా స్క్రీన్ మీద చూపించారు. ఈ సినిమా మంచి హిట్ అవుతుందని నమ్ముతున్నాం. అన్నారు.
హీరోయిన్ శృతి శెట్టి మాట్లాడుతూ – ఈ చిత్రంలో హీరోయిన్ ది చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్. అలాంటి డెప్త్ ఉన్న క్యారెక్టర్ నేను పర్ ఫార్మ్ చేయగలను అని నమ్మి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్. రసూల్ గారు మా అందరినీ కలర్ ఫుల్ గా చూపించారు. ఈ సినిమాలో నటించడం మా అందరికీ ఒక బ్యూటిఫుల్ జర్నీ ఇచ్చింది. మీరంతా థియేటర్స్ లో మూవీ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.
డీవోపీ రసూల్ ఎల్లోర్ మాట్లాడుతూ – “స్కై” సినిమాకు అంతా కొత్త వాళ్లు పనిచేశారు. నాకున్న ఎక్సిపీరియన్స్ తో వాళ్లకు గైడెన్స్ ఇచ్చాను. చాలా రోజుల తర్వాత ఈ సినిమాకు వర్క్ చేయడం ఒక ఫ్యామిలీ ఫీల్ కలిగింది. మంచి లవ్ స్టోరీతో వస్తున్న చిత్రమిది. ఎంటర్ టైన్ మెంట్, ఎమోషన్ ఆకట్టుకుంటాయి. ఈ టీమ్ తో మళ్లీ కలిసి వర్క్ చేయాలని ఉంది. అన్నారు.
నటీనటులు – మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ భారతి, రాకేశ్ మాస్టర్, ఎంఎస్, కేఎల్ కే మణి బమ్మ, తదితరులు
టెక్నికల్ టీమ్
బ్యానర్ – వేలార్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టూడియోస్
స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – పృథ్వీ పెరిచెర్ల
డీవోపీ – రసూల్ ఎల్లోర్
ఎడిటర్ – సురేష్ ఆర్స్
పబ్లిసిటీ డిజైనర్ – కృష్ణ డిజిటల్స్
డిజిటల్ మీడియా – వినీత్ గౌడ్
ప్రొడ్యూసర్స్ – నాగిరెడ్డి గుంటక, పృథ్వీ పెరిచెర్ల, శ్రీ లక్ష్మీ గుంటక, మురళీ కృష్ణంరాజు
డైలాగ్స్ , స్టోరీ – పృథ్వీ పెరిచెర్ల, మురళీ కృష్ణంరాజు
మ్యూజిక్ – శివ ప్రసాద్
లిరిక్స్ – పృథ్వీ పెరిచెర్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – స్వాతి పెన్మెత్స, లిఖిత గుంటక
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా "కపుల్ ఫ్రెండ్లీ". ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ…
సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో అడుగుపెట్టి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న చిత్రం 'అనగనగా ఒక…
అంతకుమించి చిత్రం పేం సతీష్ జై, డాక్టర్ మైత్రి షరణ్ ల కుమార్తె "నైరా" మొదటి పుట్టినరోజు వేడుకలు ఇటీవల…
యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా "భగవంతుడు". ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ…
విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాతగా ఎంఎం నాయుడు రచన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు…
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఒకరికి ఒకరు వంటి సూపర్‌హిట్ చిత్రాలతో తెలుగులో అందరికి సుపరిచితుడైన కథానాయకుడు శ్రీరామ్. ఈయన…