Ramarao On Duty Teaser | Ravi Teja, Divyansha , Rajisha | Sarath Mandava | Sudhakar Cherukuri

Presenting you the Teaser of Ramarao on Duty Movie written and directed by Sarath Mandava. Produced by Sri Lakshmi Venkateswara Cinemas and RT Team Works, Starring Ravi Teja, Divyansha Kaushik and Rajisha Vijayan.

‘బ్రో’ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ ఇంటర్వ్యూ

Must Read

పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్  కలయికలో పి. సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బ్రో’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే,  డైలాగ్స్ అందిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల ‘మై డియర్ మార్కండేయ’ పాట విడుదలై మెప్పించింది. ఈ నేపథ్యంలో తాజాగా విలేకర్లతో ముచ్చటించిన థమన్ బ్రో సినిమాకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

రీమేక్ సినిమాలకు సంగీతం అందించడం అనేది ఛాలెంజ్ కదా?

ఎవరెస్ట్ ని అధిరోహించడం లాంటిది. నాకు పవన్ కళ్యాణ్ గారితో మూడు సినిమాలూ రీమేక్ లే వచ్చాయి. వకీల్ సాబ్ గానీ, భీమ్లా నాయక్ గానీ, బ్రో గానీ సంగీతం పరంగా నేను చేయాల్సింది చేస్తున్నాను. సాంగ్స్ సినిమాకి హెల్ప్ చేస్తాయి. వకీల్ సాబ్ లో మగువ మగువ వంటి పాటని కూడా మాసీగా ఫైట్ కి ఉపయోగించాం. బ్రో అనే సినిమా విడుదలయ్యాక ఎంతోమందిని కదిలిస్తుంది. హత్తుకునే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. స్క్రీన్ ప్లే,  డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి. త్రివిక్రమ్ గారి రచన సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే సహజంగానే సినిమా స్థాయి పెరుగుతుంది.

మాతృక ప్రభావం మీ సంగీతంపై ఉందా?

ఒరిజినల్ ఫిల్మ్ లో పాటల్లేవు. నేపథ్య సంగీతం మాత్రం బాగా చేశారు. అక్కడ ఆ పాత్ర సముద్రఖని గారు చేశారు కాబట్టి అది సరిపోతుంది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఇంకా ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆయన తెర మీద కనిపిస్తే చాలు సంగీతం అడిగేస్తాం. అందుకే బ్రో శ్లోకం స్వరపరిచాం. నేపథ్య సంగీతం పరంగా అయితే చాలా సంతోషంగా ఉన్నాను. ఉన్నత స్థాయిలో ఉంటుంది. 

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ గార్ల కలయికలో పాట అంటే ఏమైనా ఛాలెంజింగ్ గా అనిపించిందా?

ఆ పాటను మాస్ గా చేయలేము. సామెతలు లాగానే చెప్పాలి. ప్రత్యేక గీతాలు లాంటివి స్వరపరచలేము. ఇది అలాంటి సినిమా కాదు. కొన్ని పరిధులు ఉన్నాయి. కాలం ఎంత ముఖ్యం అనే దానిపై ఒక ప్రమోషనల్ సాంగ్ చేస్తున్నాం. త్వరలో తేజ్ డ్యూయట్ సాంగ్ ఒకటి రానుంది. అలాగే శ్లోకాలను అన్నింటినీ కలిపి ఒక పాటలా విడుదల చేయబోతున్నాం. అంతేకాకుండా క్లైమాక్స్ లో ఒక మాంటేజ్ సాంగ్ కి సన్నాహాలు చేస్తున్నాం. మొత్తం నాలుగు పాటలు ఉంటాయి. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ అద్భుతంగా నటించారు. సినిమాలో చాలా సర్ ప్రైజ్ లు ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ గారికి మ్యూజిక్ చేయడం ప్లెజరా? ప్రెజరా?

ఒక అభిమానిగా ప్లెజర్, అభిమానుల నుంచి ప్రెజర్(నవ్వుతూ). అలాంటి ఒత్తిడి ఉన్నప్పుడే మన అనుభవం సహాయపడుతుంది. సినిమాని బట్టి సంగీతం ఉంటుంది. ‘భీమ్లా నాయక్’ సినిమాలో మాస్ పాటలకు ఆస్కారం ఉంది కాబట్టి, ‘లా లా భీమ్లా’ వంటి పాటలు చేయగలిగాము. 

ఈ సినిమా విషయంలో మీరు సలహాలు ఏమైనా ఇచ్చారా?

లేదండీ. ఇది మనం ఊహించే దానికంటే పెద్ద సినిమా. త్రివిక్రమ్ గారు స్క్రీన్ ప్లే రాసి చెప్పినప్పుడే అందరికీ రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఈ సినిమా అందరికీ కదిలిస్తుంది. కుటుంబ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. జీవితం అంటే ఏంటో తెలిపేలా ఉంటుంది. సున్నితమైన అంశాలు ఉంటాయి. తేజ్ కొన్ని కొన్ని సన్నివేశాలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు, తేజ్ మధ్య ఎంత మంచి అనుబంధం ఉంటుందో అది మనకు తెర మీద కనిపిస్తుంది. బ్యూటిఫుల్ గా ఉంటుంది. 

మీ సంగీతం ఎలా ఉండబోతుంది?

భీమ్లా నాయక్ తరహాలో బ్రో సినిమాలో మాస్ పాటలు ఉండవు. సినిమాకి ఎలాంటి పాటలు అవసరమో అలాంటి పాటలు స్వరపరుస్తాను. సంగీతమైనా, సాహిత్యమైనా సినిమాలోని సందర్భానికి తగ్గట్టుగానే ఉంటాయి. సముద్రఖని గారు, త్రివిక్రమ్ గారు లాంటి దిగ్గజాలు ఉన్నారు. ఈ కథలో ఏం కావాలో, ఎలాంటి పాట రావాలో వారికి తెలుసు. దానికి తగ్గట్టుగానే పాటలు ఉంటాయి. బ్రో సినిమాలో పాటల్లోనూ, నేపథ్య సంగీతంలోనూ కొత్తదనం కనిపిస్తుంది. దర్శకనిర్మాతలతో పాటు ఇతర చిత్ర బృందం ఇప్పటికే ఈ చిత్రం చూసి నేపథ్య సంగీతానికి కంటతడి పెట్టుకున్నారు. మేమందరం సినిమా పట్ల, సంగీతం పట్ల చాలా సంతోషంగా ఉన్నాం.

‘గుంటూరు కారం’ సినిమా గురించి చెప్పండి?

ఆరు నెలల నుంచి దాని మీద పని చేస్తున్నాం. బయట జరిగే అసత్య ప్రచారాలను పట్టించుకోకండి. ఏదైనా ఉంటే నిర్మాతలే అధికారికంగా ప్రకటిస్తారు. కావాలని ఎవరూ ఫ్లాప్ సినిమాలు చేయరు. కొన్ని సార్లు సినిమా ఆలస్యమవ్వడం అనేది సహజం. దానిని భూతద్దంలో పెట్టి చూస్తూ పదే పదే దాని గురించి రాయాల్సిన అవసరంలేదు.

Latest News

దళపతి విజయ్ ‘జన నాయగన్’ జనవరి 9, 2026న విడుదల

దళపతి విజయ్ చివరి సినిమా ‘జన నాయగన్’ జనవరి 9, 2026న విడుదల కాబోతోందని మేకర్లు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం...

More News