ఆర్.కె. ఫిలింస్, స్నిగ్ధ క్రియేషన్స్ బ్యానర్స్‌పై ప్రముఖ దర్శక, నిర్మాత, తెలంగాణ ఫిలిమ్ ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘దీక్ష’. పినిశెట్టి అశోక్ కుమార్, మదాడి కృష్ణారెడ్డి నిర్మాతలు. కిరణ్‌కుమార్, అలేఖ్యరెడ్డి జంటగా నటిస్తున్నారు. తాజాగా జరిగిన కార్యక్రమంలో ఈ చిత్ర ప్రోగ్రెస్ ను తెలిపారు దర్శక నిర్మాత ఆర్ కే గౌడ్. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆర్.కె.గౌడ్ మాట్లాడుతూ – మా ‘దీక్ష’సినిమా షూటింగ్ పూర్తయింది. గ్రాఫిక్ వర్క్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. “దీక్ష” ఉంటే ఏదైనా సాధించగలం అనే పాయింట్ తో మూవీని తెరకెక్కించాం. ఈ పాయింట్ ప్రతి ఒక్క ప్రేక్షకుడికీ కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మన లైఫ్ లో కూడా ఏదో ఒకటి సాధించాలనే తపనతోనే ఉంటాయి. ఈ మూవీలో హీరో కిరణ్ పర్ ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. భీముడి గెటప్ లో ఆయన చెప్పిన నాన్ స్టాప్ డైలాగ్ హైలైట్ అవుతుంది. ఆయనకు హీరోగా మంచి పేరు తెచ్చే చిత్రమిది. మంచి మ్యూజిక్, పాటలతో మా మూవీ ఆకట్టుకుంటుంది. మా ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ గారు వెనకుండి మమ్మల్ని నడిపిస్తున్నారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా. ‘దీక్ష’ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత మహిళా కబడ్డీ సినిమాను లాంఛ్ చేస్తాం. త్వరలో జరగనున్న తెలంగాణ ఫిలింఛాంబర్ ఎన్నికల్లో సభ్యులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నా. అన్నారు
హీరో కిరణ్ మాట్లాడుతూ – ‘దీక్ష’ మూవీలో హీరోగా నటించే అవకాశం ఇచ్చిన ఆర్కే గౌడ్ అన్నగారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమానే కాదు ఆయన నెక్ట్ మూవీ మహిళా కబడ్డీలోనూ నాకు నటించే అవకాశం ఇచ్చారు. ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఆర్కే గౌడ్ అన్నగారు రూపొందించారు. ‘దీక్ష’ చిత్రంతో హీరోగా నాకు మంచి పేరొస్తుంది ఆశిస్తున్నా. నాతో పాటు మా టీమ్ అందరికీ ఈ సినిమా గుర్తింపు తీసుకొస్తుంది. అన్నారు.
నటి అనూష మాట్లాడుతూ – ‘దీక్ష’ సినిమాలో హీరో, హీరోయిన్ కాంబినేషన్ లో నా క్యారెక్టర్ ఉంటుంది. ఇలాంటి మంచి క్యారెక్టర్ లో నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్, ప్రొడ్యూసర్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమాతో నాకు నటిగా గుర్తింపు దక్కుతుందని ఆశిస్తున్నా. త్వరలో రిలీజ్ అవుతున్న ‘దీక్ష’ సినిమాను చూసి ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.
నటి తులసి మాట్లాడుతూ – ఈ సినిమాలో హీరో కిరణ్, హీరోయిన్ అలేఖ్యరెడ్డి తో పాటు మరో లీడ్ రోల్ లో నేను నటించాను. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన ఆర్కే గౌడ్ గారికి థ్యాంక్స్. నటిగా నాకు గుర్తింపు తెచ్చే చిత్రమవుతుంది. ‘దీక్ష’సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.
నటి అక్సాఖాన్ మాట్లాడుతూ – ‘దీక్ష’ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన ఆర్కే గౌడ్ గారికి థ్యాంక్స్. ఈ చిత్రంతో పాటు 18 భాషల్లో వస్తున్న మహిళా కబడ్డి మూవీలోనూ ఆర్కే గౌడ్ గారు అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. అన్నారు.
సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ మాట్లాడుతూ ఈ చిత్రంలో సాంగ్స్ అన్ని చాలా బాగా వచ్చాయి. పాటలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి అన్నారు.
ఈ కార్యక్రమంలో దీక్ష చిత్రబృందంతో పాటు కావేరి చిత్ర నిర్మాత షేక్ అల్లాబక్షు, కావేరి చిత్రబృందం పాల్గొని దీక్ష సినిమా టీమ్ కు బెస్ట్ విషెస్ అందజేశారు.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…