టాలీవుడ్

ఏదైనా సాధించాలనుకునే ప్రతి ఒక్కరికీ “దీక్ష” సినిమా కనెక్ట్ అవుతుంది

ఆర్‌.కె. ఫిలింస్‌, స్నిగ్ధ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై ప్రముఖ దర్శక, నిర్మాత, తెలంగాణ ఫిలిమ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘దీక్ష’. పినిశెట్టి అశోక్‌ కుమార్‌, మదాడి కృష్ణారెడ్డి నిర్మాతలు. కిరణ్‌కుమార్‌, అలేఖ్యరెడ్డి జంటగా నటిస్తున్నారు. తాజాగా జరిగిన కార్యక్రమంలో ఈ చిత్ర ప్రోగ్రెస్ ను తెలిపారు దర్శక నిర్మాత ఆర్ కే గౌడ్. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆర్‌.కె.గౌడ్‌ మాట్లాడుతూ – మా ‘దీక్ష’సినిమా షూటింగ్ పూర్తయింది. గ్రాఫిక్ వర్క్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. “దీక్ష” ఉంటే ఏదైనా సాధించగలం అనే పాయింట్ తో మూవీని తెరకెక్కించాం. ఈ పాయింట్ ప్రతి ఒక్క ప్రేక్షకుడికీ కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మన లైఫ్ లో కూడా ఏదో ఒకటి సాధించాలనే తపనతోనే ఉంటాయి. ఈ మూవీలో హీరో కిరణ్ పర్ ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. భీముడి గెటప్ లో ఆయన చెప్పిన నాన్ స్టాప్ డైలాగ్ హైలైట్ అవుతుంది. ఆయనకు హీరోగా మంచి పేరు తెచ్చే చిత్రమిది. మంచి మ్యూజిక్, పాటలతో మా మూవీ ఆకట్టుకుంటుంది. మా ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ గారు వెనకుండి మమ్మల్ని నడిపిస్తున్నారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా. ‘దీక్ష’ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత మహిళా కబడ్డీ సినిమాను లాంఛ్ చేస్తాం. త్వరలో జరగనున్న తెలంగాణ ఫిలింఛాంబర్ ఎన్నికల్లో సభ్యులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నా. అన్నారు

హీరో కిరణ్ మాట్లాడుతూ – ‘దీక్ష’ మూవీలో హీరోగా నటించే అవకాశం ఇచ్చిన ఆర్కే గౌడ్ అన్నగారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమానే కాదు ఆయన నెక్ట్ మూవీ మహిళా కబడ్డీలోనూ నాకు నటించే అవకాశం ఇచ్చారు. ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఆర్కే గౌడ్ అన్నగారు రూపొందించారు. ‘దీక్ష’ చిత్రంతో హీరోగా నాకు మంచి పేరొస్తుంది ఆశిస్తున్నా. నాతో పాటు మా టీమ్ అందరికీ ఈ సినిమా గుర్తింపు తీసుకొస్తుంది. అన్నారు.

నటి అనూష మాట్లాడుతూ – ‘దీక్ష’ సినిమాలో హీరో, హీరోయిన్ కాంబినేషన్ లో నా క్యారెక్టర్ ఉంటుంది. ఇలాంటి మంచి క్యారెక్టర్ లో నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్, ప్రొడ్యూసర్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమాతో నాకు నటిగా గుర్తింపు దక్కుతుందని ఆశిస్తున్నా. త్వరలో రిలీజ్ అవుతున్న ‘దీక్ష’ సినిమాను చూసి ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటి తులసి మాట్లాడుతూ – ఈ సినిమాలో హీరో కిరణ్, హీరోయిన్ అలేఖ్యరెడ్డి తో పాటు మరో లీడ్ రోల్ లో నేను నటించాను. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన ఆర్కే గౌడ్ గారికి థ్యాంక్స్. నటిగా నాకు గుర్తింపు తెచ్చే చిత్రమవుతుంది. ‘దీక్ష’సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటి అక్సాఖాన్ మాట్లాడుతూ – ‘దీక్ష’ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన ఆర్కే గౌడ్ గారికి థ్యాంక్స్. ఈ చిత్రంతో పాటు 18 భాషల్లో వస్తున్న మహిళా కబడ్డి మూవీలోనూ ఆర్కే గౌడ్ గారు అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. అన్నారు.

సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ మాట్లాడుతూ ఈ చిత్రంలో సాంగ్స్ అన్ని చాలా బాగా వచ్చాయి. పాటలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి అన్నారు.

ఈ కార్యక్రమంలో దీక్ష చిత్రబృందంతో పాటు కావేరి చిత్ర నిర్మాత షేక్ అల్లాబక్షు, కావేరి చిత్రబృందం పాల్గొని దీక్ష సినిమా టీమ్ కు బెస్ట్ విషెస్ అందజేశారు.

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

10 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago