‘ఉస్తాద్ భగత్ సింగ్’ మాసీవ్ యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం

వర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, మైత్రీ మూవీ మేకర్స్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మాసీవ్ యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మాస్ ని మెప్పించే బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతోంది.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్‌లు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో కథానాయకుడు ఉపయోగించే ఆయుధాలన్నింటినీ రివీల్ చేస్తూ ఇటీవల దర్శకుడు హరీష్ శంకర్ పోస్టర్‌ను షేర్ చేశారు.

పవన్ కళ్యాణ్ ఈరోజు షూట్‌లో జాయిన్ అయ్యారు. కొత్త షెడ్యూల్ మాసీవ్ యాక్షన్ సీక్వెన్స్‌తో ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ ఖాకీ డ్రెస్‌లో షేడ్స్‌తో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఈ షెడ్యూల్ కోసం ప్రొడక్షన్ డిజైనర్ ఆనంద్ సాయి అండ్ టీమ్ మాసీవ్ సెట్‌ని రూపొందించారు.

మాస్ పల్స్‌ తెలిసిన దర్శకుడు హరీష్ శంకర్ మరోసారి మాస్‌ను మెప్పించే సబ్జెక్ట్‌ను ఎంచుకున్నారు. పవన్ కళ్యాణ్‌ను మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో టెర్రిఫిక్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రెజెంట్ చేస్తున్నారు.

ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన శ్రీలీల నటిస్తోంది. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు.  అయనంక బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఎడిటింగ్ ఛోటా కె ప్రసాద్. స్టంట్ డైరెక్టర్ ద్వయం రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.  

తారాగణం: పవన్ కళ్యాణ్, శ్రీలీల, అశుతోష్ రానా, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్, టెంపర్ వంశీ

సాంకేతిక విభాగం:
రచన & దర్శకత్వం : హరీష్ శంకర్.ఎస్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవి శంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
స్క్రీన్ ప్లే: కె దశరధ్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
డీవోపీ: అయనంక బోస్
ఎడిటర్: చోటా కె ప్రసాద్
అడిషినల్ రైటర్: సి. చంద్రమోహన్
ప్రొడక్షన్ డిజైనర్: ఆనంద్ సాయి
ఫైట్స్: రామ్ – లక్ష్మణ్
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: చంద్రశేఖర్ రావిపాటి, హరీష్ పై
సిఈవో: చెర్రీ
పీఅర్వో: వంశీ శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago