టాలీవుడ్

శ్రీ రామ నవమి వైభవాన్ని చాటి చెప్పేలా ఆదిపురుష్ పోస్టర్

ఇండియాస్ టాప్ స్టార్ ప్రభాస్, కృతిసనన్ జంటగా నటించిన సినిమా ఆదిపురుష్. ఓమ్ రౌత్ డైరెక్షన్ లో రామాయణ ఇతిహాస నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ రావణుడు పాత్రలో, హనుమంతుడి పాత్రలో సన్నీ సింగ్ నటిస్తున్నారు. శ్రీ రామనవమి సందర్భంగా ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్ విడుదల చేసింది మూవీ టీమ్. ఈ పోస్టర్‌లో రాఘవ్‌గా ప్రభాస్‌, జానకిగా కృతి సనన్‌, శేష్‌గా సన్నీ సింగ్‌, భజరంగ్‌గా దేవదత్తా నాగే వారికి వంగి వంగి వంగి నమస్కరిస్తున్నట్లు ఉంది.

శ్రీ రామ ధర్మాన్ని మరోసారి చాటిచెప్పేలా ఈ చిత్రాన్ని రూపొందించారు. అందుకు తగ్గట్టుగానే శ్రీ రాముడి నైజాలైన ధర్మం, ధైర్యం, త్యాగం వంటి అంశాలు పోస్టర్ లో ప్రతిబింబించేలా రూపొందించారు.
శ్రీ రామనవమి అంటే శ్రీరాముని జన్మదిన, వివాహ మహోత్సవం. ఆయన మంచితనానికి ప్రారంభంగా ఈ రోజును నిర్వహించుకుంటారు. అందుకే అధర్మాన్ని ఓడించి, ధర్మ స్థాపన చేసిన రాముడుగా ప్రభాస్ లుక్ ను డిజైన్ చేశారు. ఇక రీసెంట్ గానే వైష్ణోదేవి ఆలయంలో ఆశీస్సులు అందుకుని మూవీ ప్రమోషన్స్ ను ఈ శ్రీ రామనవమి నుంచి ప్రారంభిస్తాం అని చెప్పింది మూవీ టీమ్. అందుకు తగ్గట్టుగానే ఈ పోస్టర్ తో అభిమానుల్లో ఆనందాన్ని నింపారు. త్వరలోనే మరింత అగ్రెసివ్ గా ప్రమోషన్స్ స్టార్ట్ కాబోతున్నాయి.

ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌కు చెందిన వంశీ, ప్రమోద్‌లతో కలిసి  టి- సిరీస్, భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రెట్రోఫైల్స్ రాజేష్ నాయర్ నిర్మించారు. అద్బుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందిన ఆదిపురుష్  16 జూన్ 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

7 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago