టాలీవుడ్

“ది గర్ల్ ఫ్రెండ్” సినిమాలోని హై వోల్టేజ్ డ్రామా ప్రేక్షకుల్ని సర్ ప్రైజ్ చేస్తుంది – డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా “ది గర్ల్ ఫ్రెండ్”. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 7న హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా హైలైట్స్ తెలిపారు దర్శకుడు రాహుల్ రవీంద్రన్.

  • నేను కాలేజ్ లో ఉన్నప్పుడు చూసిన ఒక ఇన్సిడెంట్ ఆధారంగా “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా కథ రాశాను. అప్పట్లో వచ్చిన ఓ పాట కూడా నన్ను ఈ కథ రాసేందుకు ఇన్స్ పైర్ చేసింది. ఇలా టైమ్ ఉన్నప్పుడు కొన్ని స్క్రిప్ట్స్ చేసుకున్నాను. ఆహా వాళ్లు మాకొక ప్రాజెక్ట్ చేయండి అని అడిగారు. వారికి “ది గర్ల్ ఫ్రెండ్” కథ పంపాను. నేను, రశ్మిక, గీతా ఆర్ట్స్ కాంబినేషన్ లో ఒక సినిమా చేయాల్సిఉండేది. “ది గర్ల్ ఫ్రెండ్” కథను అల్లు అరవింద్ గారు చదివి దీంట్లో సినిమాకు కావాల్సిన కంటెంట్ ఉంది. ఓటీటీకి వద్దు సినిమానే చేద్దామని అన్నారు. రశ్మిక, మా కాంబోలో ముందు అనుకున్న కథ పక్కనపెట్టి ఈ కథనే సినిమాగా మొదలుపెట్టాం.
  • రశ్మికకు స్క్రిప్ట్ పంపినప్పుడు చదివి చెప్తానంది. రెండు రోజుల్లోనే స్క్రిప్ట్ మొత్తం కంప్లీట్ గా చదివి కాల్ చేసింది. ఈ మూవీ మనం వెంటనే చేస్తున్నాం, ఇలాంటి కథ ఆడియెన్స్ కు చెప్పాలి, ఒక అమ్మాయిగా నేను ఈ కథకు చాలా కనెక్ట్ అయ్యాను, బయట ఉన్న అమ్మాయిలు అందరికీ నేను ఇచ్చే బిగ్ హగ్ ఈ సినిమా అని చెప్పింది. నేను ఏ కథ రాసినా నా స్నేహితులు సమంత, వెన్నెల కిషోర్, అడివి శేష్, డైరెక్టర్ సుజీత్..ఇలా కొంతమందికి పంపిస్తుంటా. అలా “ది గర్ల్ ఫ్రెండ్” కథ కూడా పంపాను. సమంతను ఈ సినిమాలో హీరోయిన్ గా అనుకున్నారనే వార్తలూ వచ్చాయి. సమంత ఈ స్క్రిప్ట్ చదివాక, నేను కాదు మరొక హీరోయిన్ అయితేనే ఈ మూవీకి బాగుంటారని సజెషన్ ఇచ్చింది.
  • టీజర్, ట్రైలర్ లో ఆడియెన్స్ ను కావాలనే మిస్ డైరెక్ట్ చేశాం. మెయిన్ కంటెంట్ థియేటర్ లో చూస్తేనే ఎంజాయ్ చేస్తారు. మీకు ట్రైలర్ లో ఉన్న హై వోల్టేజ్ ఇంటెన్స్ డ్రామానే సెకండాఫ్ లో ఉంటుంది. ఈ డ్రామా సర్ ప్రైజ్ చేస్తుంది. ఒక జంట లైఫ్ లో ఇలా జరిగింది అనేది నాకు తెలిసిన పద్ధతిలో చూపించాను. అంతే కానీ ఎలాంటి సందేశాలు, నీతులు చెప్పలేదు. సినిమా చూసి ఆడియెన్స్ ఆలోచించుకుంటారనే నమ్మకం ఉంది. నేను ఇవాళ మంచిది అనుకున్నది ఐదేళ్ల తర్వాత కరెక్ట్ కాదు అని నాకే అనిపించవచ్చు. అందుకే ఎవరికీ మెసేజ్ లు ఇచ్చే ధైర్యం చేయను. ఇంటెన్స్ ఎమోషన్ ఉన్న లవ్ స్టోరీని రియలిస్టిక్ అప్రోచ్ లో చేశాం.
  • రశ్మిక యానిమల్ సినిమా రిలీజై వందల కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తున్నప్పుడు నాకు కొంచెం భయమేసింది. రశ్మికను ఇంత రియలిస్టిక్ గా చూపిస్తున్నాం, అక్కడేమో యానిమల్ ఆడియెన్స్ మీద మరో ఇంప్రెషన్ వేస్తోంది అని అనుకున్నా. రశ్మికకు నా సందేహం తెలిసి, ఈ కథకు మీరు నన్ను ఇలాగే స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయాలి. రియలిస్టిగానే నా క్యారెక్టర్ కనిపించాలి అని సపోర్ట్ చేసింది. మనం వుమెన్ సెంట్రిక్ మూవీస్ అని పిలుస్తుంటాం కానీ ఆ ముద్ర పోయేందుకు ఇంకా చాలా టైమ్ పడుతుంది. ఈ కథలో హీరో హీరోయిన్ ఇద్దరి పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటుంది. హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథను చూపిస్తున్నాం.
  • “ది గర్ల్ ఫ్రెండ్” మూవీలోని విక్రమ్ క్యారెక్టర్ కోసం సెర్చ్ చేశాను. ఈ అబ్బాయి కాలేజ్ లో అడుగుపెట్టగానే చాలామంది అమ్మాయిలు ఇష్టపడతారు అనేలా కనిపించాలి అనుకున్నా. దసరా సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో దీక్షిత్ ను చూసి ఇతను విక్రమ్ క్యారెక్టర్ కు బాగుంటాడు అనిపించింది. మూవీలో హీరో హీరోయిన్స్ పీజీ స్టూడెంట్స్. ఒక లెక్టరర్ రోల్ ఉంది. ఆ క్యారెక్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేస్తే బాగుంటుంది అనిపించింది. ఆయనను అప్రోచ్ అయితే వద్దు, నన్ను స్క్రీన్ మీద చూడగానే ఆడియెన్స్ నవ్వుతారు అని రిజెక్ట్ చేశారు. చివరకు ఆ రోల్ నేనే చేయాల్సివచ్చింది. అనూ ఇమ్మాన్యుయేల్ కూడా తన క్యారెక్టర్ కు పర్పెక్ట్ గా సెట్ అయ్యింది.
  • హేషమ్ అబ్దుల్ వాహాబ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆయన మ్యూజిక్ తో మూవీలోని ఫీల్ మరింత పెరిగింది. తనతో వర్క్ చేసిన ఎక్సిపీరియన్స్ బాగుంది. నా లైఫ్ లో నేను చూసినవి, చదివినవి, తెలుసుకున్న ఇన్సిడెంట్స్ నుంచి ఇన్స్ పైర్ అయి కథ రాస్తుంటాను. దర్శకుడిగా నాకొక తరహా, ఒక ముద్ర ఉండాలని ఎప్పుడూ కోరుకోలేదు. నేను కొన్ని మూవీస్ చేశాక అందులో నా తరహా విలువలు, నమ్మకాలు చూసి ఆడియెన్స్ కు రాహుల్ డైరెక్షన్ లో ఇలాంటి సెన్సబిలిటీస్ ఉన్నాయి అనే ఇంప్రెషన్ కలుగుతుందేమో.
  • నెక్ట్స్ నేను డైరెక్ట్ చేయబోయో రెండు ప్రాజెక్ట్స్ ఓకే అయ్యాయి. వాటి వివరాలు త్వరలో తెలియజేస్తాను. ఈ రెండు సినిమాల తర్వాత రశ్మిక నేను కలిసి మరో సినిమా చేయబోతున్నాం. ఆ కథ లైన్ గా రశ్మికకు నచ్చింది. ఇంకా స్క్రిప్ట్ చేయాల్సిఉంది. మా కాంబోలో ఆ మూవీ వస్తుంది.
  • నేను అసిట్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్న టైమ్ లో హీరోగా అవకాశం వచ్చింది. పరిచయాలు పెరుగుతాయి కదా అని హీరోగా నటించాను. కానీ నా ఆలోచన ఎప్పుడూ డైరెక్షన్ రైటింగ్ సైడే ఉండేది. ఇప్పుడు కూడా హీరోగా అవకాశాలు వస్తున్నాయి. అయితే హీరోగా నటించడం అంటే ఒక కమిట్ మెంట్ ఉండాలి. దాదాపు ఏడాది పాటు ఆ సినిమాకే టైమ్ కేటాయించాలి. నేను డైరెక్టర్ గా ఫస్ట్ మూవీ చేసినప్పుడే హీరోగా వద్దు అనుకున్నా. నటించడాన్ని ఎంజాయ్ చేస్తాను కానీ డైరెక్షన్ అనేది నా కెరీర్ గా భావిస్తా. 20 రోజుల కాల్షీట్ ఉండే క్యారెక్టర్స్ అయితే ఒప్పుకుంటున్నా. ఆ దర్శకుడి దగ్గర నుంచి ఏదైనా నేర్చుకోవచ్చు అనేది కూడా నా మైండ్ లో ఉంటుంది. సుజిత్ నా ఫ్రెండ్, ఓజీలో ఆయన చెప్పగానే నటించాను. హను రాఘవపూడి తన మూవీకి పిలిస్తే తప్పకుండా వెళ్తా. ఆయన ప్రభాస్ గారితో సినిమా చేస్తున్నారు. ఇంకా పెద్ద సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. హను తన నెక్ట్స్ మూవీలో హీరోగా నటించమని అడిగితే మాత్రం నటిస్తా.
Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

56 minutes ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago