ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ చేతుల మీదుగా “కరణం గారి వీధి” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

కిట్టు తాటికొండ, కష్మీరా,రోహిత్, వైశాలి, సునీల్ రావినూతల, శ్రీ గోపి చంద్ కొండ నటిస్తున్న సినిమా “కరణం గారి వీధి”. ఈ చిత్రాన్ని సౌత్ బ్లాక్ బస్టర్ క్రియేషన్స్ బ్యానర్ పై అడవి అశోక్ నిర్మిస్తున్నారు. దర్శకద్వయం హేమంత్, ప్రశాంత్ తెరకెక్కిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే కంప్లీట్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రమిది. త్వరలోనే గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో కరణం గారి వీధి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో

ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ – కరణం గారి వీధి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నా చేతుల మీదుగా రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. పోస్టర్, టైటిల్ డిజైన్ చాలా కొత్తగా అనిపించింది. కొత్త టాలెంట్ ఎంత ఎక్కువగా ఇండస్ట్రీకి వస్తే అంత మంచిది. ఈ టీమ్ కూడా మంచి ప్రయత్నం చేసి ఉంటారని ఆశిస్తున్నాను. కరణం గారి వీధి సినిమా సక్సెస్ అయి మొత్తం టీమ్ కు మంచి పేరు తేవాలి. కొత్త ఫిలింమేకర్స్ కు నాదొక చిన్న సలహా. సినిమా మీద కనీస అవగాహన, ప్యాషన్ ఉనప్పుడే సినిమాలు చేసేందుకు ముందుకు రండి. అప్పుడే మీరు చేసే సినిమా బాగుంటుంది. అన్నారు.

నిర్మాత అడవి అశోక్ మాట్లాడుతూ – మా కరణం గారి వీధి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ చేసిన ఆర్పీ పట్నాయక్ గారికి థ్యాంక్స్. ఆయన మ్యూజిక్ తో పాటు ఆయన తెరకెక్కించిన సినిమాలంటే మాకు ఇష్టం. ప్రేక్షకులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది. త్వరలోనే సినిమాను థియేటర్స్ లోకి తీసుకొస్తాం. అన్నారు.

దర్శకుడు హేమంత్ మాట్లాడుతూ – పల్లెటూరి నేపథ్యంగా సాగే కంప్లీట్ ఎంటర్ టైనింగ్ మూవీ ఇది. మనం నిజ జీవితంలో చూసే వాస్తవిక ఘటనలు ఉంటాయి. కరణం గారి వీధి సినిమాను అందరికీ నచ్చేలా రూపొందిస్తున్నాం. త్వరలోనే రిలీజ్ డేట్ ప్లాన్ చేసి మీ ముందుకు చిత్రాన్ని తీసుకొస్తాం. అన్నారు.

దర్శకుడు ప్రశాంత్ మాట్లాడుతూ – లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా కరణం గారి వీధి సినిమాను రూపొందిస్తున్నాం. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ప్లెజెంట్ గా ఉంటూ మంచి కామెడీతో మీరంతా ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది. ఆర్పీ గారు తమ టైమ్ కేటాయించి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాం. అన్నారు.

నటుడు సునీల్ రావినూతల మాట్లాడుతూ – విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే చిత్రమిది. అందమైన పల్లెటూరిలో షూటింగ్ చేశాం. పల్లెటూరి నేపథ్యంగా సాగే ఈ చిత్రంతో మా దర్శకులు ఇద్దరు మంచి కంటెంట్ ను మీ ముందుకు తీసుకురాబోతున్నారు. అన్నారు.

హీరో కిట్టు తాటికొండ మాట్లాడుతూ – కరణం గారి వీధి సినిమాలో నేను హీరోగా నటిస్తున్నాను. నాది ఈ మూవీలో ఆటో డ్రైవర్ క్యారెక్టర్. మా డైరెక్టర్స్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మంచి లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ రూపొందించారు. సునీల్ రావినూతల కైలాసం క్యారెక్టర్ లో ఆకట్టుకుంటాడు. మా సెకండ్ హీరోయిన్ వైశాలి బాగా పర్ ఫార్మ్ చేసింది. సినిమా బాగా వచ్చింది. మీ అందరి సపోర్ట్ తో మంచి సక్సెస్ అందుకుంటామని ఆశిస్తున్నాం. అన్నారు.

హీరో రోహిత్ మాట్లాడుతూ – కరణం గారి వీధి లో నేను నటించడం చాలా ఆనందంగా ఉంది, మధ్యతరగతి కుటుంబం కష్టాలు వినోదాసపథంగా డైరెక్టర్స్ చాలాబాగా చిత్రీకరించారు, అన్నారు.

హీరోయిన్ వైశాలి మాట్లాడుతూ – కరణం గారి వీధి సినిమాలో ఒక హీరోయిన్ గా నటించాను. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్. కరణం గారి వీధి చిత్రంతో మా టీమ్ అందరికీ మంచి గుర్తింపు దక్కుతుందని నమ్ముతున్నాం. అన్నారు.

నటుడు శ్రీ గోపిచంద్ కొండ మాట్లాడుతూ – కరణం గారి వీధి చిత్రంలో ఒక మంచి పాత్ర పోషించినడుకు సంతోషంగా ఉంది. ఇది ఒక పల్లెటూరిలో మిడిల్ క్లాస్ నేపథ్యంలో జరిగే కుటుంబ కథ చిత్రం. ఈ చిత్రం చూస్తున్నంతసేపు ప్రతిఒక్కరి నిజ జీవితంలో జరిగే కథ లాగా అనిపిస్తుంది, అవకాశం ఇచ్చిన డైరెక్టర్స్ కి మరియు ఆర్పీ పట్నాయక్ గారికి కృత్ఞతలు తెలిపారు.

నటీనటులు – కిట్టు తాటికొండ, కష్మిరా, రోహిత్,వైశాలి, సునీల్ రావినూతల, శ్రీ గోపిచంద్ కొండ, తదితరులు

టెక్నికల్ టీమ్

ఎడిటింగ్ – రవితేజ.జి.
సినిమాటోగ్రఫీ – వినోద్ షిణగం
మ్యూజిక్ డైరెక్టర్ – సుకుమార్ పమ్మి
పోస్టర్స్, టైటిల్ డిజైన్ – మూన్ లైట్ డిజైనర్స్
పీఆర్ఓ – బి. వీరబాబు
బ్యానర్ – సౌత్ బ్లాక్ బస్టర్ క్రియేషన్స్
నిర్మాత – అడవి అశోక్
దర్శకత్వం – హేమంత్, ప్రశాంత్

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago