విశాఖ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘శబరి’ చిత్రం

టాలీవుడ్ హ్యాపెనింగ్ లేడీ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘శబరి’. తాజాగా మూడో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. విశాఖలోని ఆర్కే బీచ్, సిరిపురం జంక్షన్‌తో పాటు అరకు లాంటి అందమైన లొకేషన్లలో షూటింగ్ చేశాం. అక్కడ ప్రధాన తారాగణంపై కొన్ని యాక్షన్ సీక్వెన్సులు, ఒక పాట, కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు.నందు, నూర్ మాస్టర్స్ పర్యవేక్షణలో రూపొందిన ఈ యాక్షన్ సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని చిత్ర బృందం తెలిపింది. నాలుగో షెడ్యూల్ ఈ నెలలో హైదరబాద్‌లో మొదలు కానుంది. దాంతో సినిమా చిత్రీకరణ పూర్తి అవుతుంది. నవంబర్ చివరి వారంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు కానున్నాయి. 

ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ కాట్జ్ మాట్లాడుతూ… “వరలక్ష్మీ శరత్ కుమార్ గారు ఎంపిక చేసుకునే చిత్రాలు భిన్నంగా ఉంటాయి. మా ‘శబరి’ కూడా అటువంటి భిన్నమైన చిత్రమే. శబరి పాత్రను నిజ జీవితంలో కూడా ధైర్యంగా ఉండే వ్యక్తి చేస్తే బాగుంటుందని అనుకుంటున్న తరుణంలో వరలక్ష్మి గారు ఈ కథ వినటం, సినిమా చేయడానికి ఒప్పుకోవడం మా అదృష్టం. ఈ చిత్రంలో స్వతంత్ర భావాలున్న యువతిగా ఆమె కనిపిస్తారు. యాక్షన్ ఎపిసోడ్స్ లో చాలా ఎఫెక్టివ్ గా పెర్ఫార్మ్ చేశారు. అన్ని హంగులున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు తీసుకు వద్దామా అని ఎదురు చూస్తున్నాం” అని అన్నారు.

నటీనటులు:

వరలక్ష్మీ శరత్ కుమార్, గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్, మధునందన్, రషిక బాలి (Bombay), వైవా రాఘవ, ప్రభు, భద్రం, కృష్ణతేజ, బిందు పగిడిమర్రి, ఆశ్రిత వేముగంటి, హర్షిని కోడూరు, అర్చన అనంత్, ప్రమోదిని బేబీ నివేక్ష, బేబీ కృతిక తదితరులు ఈ చిత్రంలో తారాగణం.

సాంకేతిక బృందం:

ఈ చిత్రానికి రచనా సహకారం: సన్నీ నాగబాబు, పాటలు: రహమాన్, మిట్టపల్లి సురేందర్, మేకప్: చిత్తూరు శ్రీను, కాస్ట్యూమ్స్: అయ్యప్ప, కాస్ట్యూమ్ డిజైనర్: మానస, స్టిల్స్: ఈశ్వర్, పబ్లిసిటీ డిజైనర్: సుధీర్, పీఆర్వో: పులగం చిన్నారాయణ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: లక్ష్మీపతి కంటిపూడి, కో- డైరెక్టర్: వంశీ, ఫైట్స్: నందు – నూర్, కొరియోగ్రాఫర్స్: సుచిత్ర చంద్రబోస్ – రాజ్ కృష్ణ, ఆర్ట్ డైరెక్టర్: ఆశిష్ తేజ పూలాల, ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ, నాని చమిడి శెట్టి , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సీతారామరాజు మల్లెల, సంగీతం: గోపి సుందర్, సమర్పణ: మహర్షి కూండ్ల, ప్రొడ్యూసర్: మహేంద్ర నాథ్ కూండ్ల, కథ – మాటలు – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: అనిల్ కాట్జ్.

Tfja Team

Recent Posts

మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “చిరంజీవి” సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా "చిరంజీవి". ఈ చిత్రంలో తనికెళ్ల భరణి,ఈశ్వరీ రావు, గోపరాజు రమణ,శ్రీకాంత్…

8 hours ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 day ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

5 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

5 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago