టాలీవుడ్

‘జటాధర’ లోని డివైన్ సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తాయి. ఖచ్చితంగా బిగ్ స్క్రీన్ పై చూడదగ్గ సినిమా ఇది: హీరో సుధీర్ బాబు

   నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ పవర్‌హౌస్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర. అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్  అందించే ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరు‍ణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మించారు. ఈ చిత్రంలో శిల్పా శిరోధ్కర్ కీలక పాత్ర పోషించారు. జటాధర నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సుధీర్ బాబు అరోరా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

జటాధర కథ ఫస్ట్ టైం మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఫీలయ్యారు?
-చిన్నప్పుడు మనం జానపద, చందమామ కథలు వినుంటాం.’ బ్యాంకులో లేని సమయంలో ధనాన్ని భూమిలో పాతి ఒక బంధనం వేసి దానికి ఒక పిశాచి కాపలాగా ఉంటుంది’ అని ప్రచారంలో ఒక కథ ఉండేది. ఈ కథకు అలాంటి ఒక జానపదం ఆధారం. అలాంటి కథని ప్రజెంట్ టైం లోకి వచ్చి తీసుకొచ్చి చాలా ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేశారు.

-సినిమాలో డిఫరెంట్ ప్లేయర్స్ ఉంటాయి. బాలీవుడ్ స్త్రీ సినిమా వచ్చింది. నిజానికి అది మన సౌత్ ఇండియాలో ‘ఓ స్త్రీ రేపు రా’ అన్న జానపదం లాంటి కథ. ఈ కథ విన్నప్పుడు కూడా నాకు ఇంట్రస్టింగ్ గా అనిపించింది. బిగ్ స్క్రీన్ మీద చూడదగ్గ కథ అనిపించింది.

-ఘోస్ట్ హంటింగ్, ఫ్యామిలీ ఎమోషన్, డివోషనల్,  శివుడు గురించి కథలు. ఇలా చాలా లేయర్స్ వున్నాయి. అరుణాచల ప్రస్తావన కూడా వుంది.  సినిమాలో ఉన్న కాన్ఫ్లిక్ట్ కి కి మన పురాణాల్లో ఉన్న కొన్ని కథలు సొల్యూషన్ గా ఈ కథను చేయడం జరిగింది.ఈ సినిమా చేయడానికి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నాకు చాలా ఎక్సైట్ చేసింది. యాక్షన్, ఫ్యామిలీ, మైథలాజి అన్ని ఎమోషన్స్ కుదిరిన సినిమా ఇది.  

ప్రీరిలీజ్ ఈవెంట్లో మీరు చాలా ఎమోషనల్ గా మాట్లాడారు.. అలా ఎప్పుడు చెప్పలేదు కదా.. ప్రత్యేకమైన కారణం ఉందా?
-ఎప్పుడు అలా చెప్పలేదు కాబట్టి చెప్పాను( నవ్వుతూ) ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు. అయితే తెలియని వాళ్ళకి తెలుస్తుందని అలా చెప్పాను. నేను కొన్ని ఈవెంట్స్ కి కొత్తవారిని సపోర్ట్ చేయడానికి వెళుతున్నప్పుడు అక్కడ కూడా నాకు నాకైతే ఈజీగా ఉంటుంది, కొత్త వాళ్లకి ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేనివారికి కష్టం అన్న కామెంట్స్ వినిపిస్తుంటాయి. నిజానికి ఇక్కడ వాళ్లకి నాకు అందరికీ కష్టమే. ఆ ఉద్దేశంతో అలా చెప్పాను.  

జటాధర మీ క్యారెక్టర్ ఎలా వుంటుంది?
-ఇందులో ఘోస్ట్ హంటర్ గా కనిపిస్తా. అయితే తనకి దెయ్యాలు వున్నాటంటే నమ్మకం వుండదు. దేవునిపై నమ్మకం వుంటుంది. సైన్స్ ని నమ్ముతాను. అలా ఎందుకనేది సినిమాలో చాలా ఆసక్తికరంగా వుంటుంది.

-జటాధర అనే టైటిల్ వినగానే ఇది డివైన్ సినిమాని తెలుస్తుంది. ఫైనల్ గా శివుడు వస్తాడని ముందే అర్ధమౌతుంది. అయితే ఆ పాయింట్ కి రీచ్ అయ్యేవరకూ వుండే జర్నీ చాలా ఎక్సయిటింగ్ గా వుంటుంది, ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుంది.

మైథాలజీ జానర్ సినిమాలకి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది కదా.. ఈ సినిమా చేయడానికి అదే కారణమా?
-లేదండి. ఇప్పుడున్న ట్రెండు రెండేళ్ల తర్వాత ఉంటుందో లేదో చెప్పలేం. దాన్నిబట్టి ఒక సబ్జెక్టు సెలెక్ట్ చేసుకోవడం అనేది ఉండదు. నా కెరీర్ లో ఎప్పుడూ అలా చేయలేదు. కో ఇన్సిడెంట్ ఇప్పుడీ జానర్ ట్రెండ్ లో వుంది. టీజర్ ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బిజినెస్ కూడా చాలా బాగుంది. జి స్టూడియోస్ లాంటి సంస్థ నిర్మాణంలో వుంది. అంతా పాజిటివ్ గా ఉంది.  ఏ, బి, సి సెంటర్ అనే తేడా లేకుండా అందరికీ నచ్చే సినిమా.

 



నార్త్ నుంచి తెలుగులోకి తీసుకురావడం ఎలా అనిపించింది?
-ఇది తెలుగు సినిమా. కాకపోతే ప్రొడ్యూసర్స్ నార్త్ నుంచి వచ్చారు. తెలుగు సినిమా చేద్దామని వచ్చారు. నాతో, నానితో కలిసి సినిమా చేద్దామని వచ్చారు. ఒక కథ చెప్పారు. నాకు అంతగా నచ్చలేదు. కొన్ని రోజుల తర్వాత మీ దగ్గర ఏదైనా కథ ఉంటే చెప్పమన్నారు. అప్పుడు ఈ కథని మేము డెవలప్ చేస్తున్నాం .అలా చెప్పినప్పుడు వాళ్ళకి నచ్చింది. తర్వాత ప్రొడక్షన్ స్టార్ట్ అయింది.

సోనాక్షి గారితో వవర్క్ చేయడం ఎలా అనిపించింది?

-సోనాక్షి చాలా అద్భుతమైన నటి. తన లుక్స్ సౌత్ ఇండియన్ లాగే ఉంటాయి. తన నటన అందరినీ ఆకట్టుకుంటుంది. ధనపిశాచి క్యారెక్టర్ కి చాలా వాల్యు యాడ్ చేశారు.  

శిల్పా శిరోద్కర్ గారి గురించి?
-శిల్ప గారు శోభ అనే పాత్రలో  కనిపిస్తారు. అద్భుతంగా నటించారు. చాలా హెవీ పెర్ఫార్మన్స్ ఉన్న క్యారెక్టర్ అది. సినిమా తర్వాత తనకి చాలా మంచి అవకాశాలు వస్తాయి. తన పర్ఫార్మెన్స్ అవుట్ స్టాండింగ్ ఉంటుంది.

మ్యూజిక్ ఎలా ఉంటుంది?
-రాజీవ్ చాలా అద్భుతంగా చేశాడు. ఇందులో శివతాండవం ఎపిసోడ్ వుంటుంది. అది థియేటర్స్ లో గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.

జీ స్టూడియోతో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
-చాలా అనుభవం ఉన్న ప్రొడ్యూసర్స్. చాలా సక్సెస్ఫుల్ సినిమాలు తీశారు. వాళ్ళకి కంటెంట్ మీద పూర్తి నమ్మకం ఉంది. ఈ సినిమాకి కావాల్సిన ప్రతిదీ సమకూర్చారు.  

ఇందులో వీఎఫ్ ఎక్స్ వర్క్ ఎలా ఉంటుంది?
-ఇది పూర్తిగా విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడిన సినిమా అయితే కాదు. సోనాక్షి సిన్హా ఉండే పోర్షన్లో విఎఫ్ఎక్స్ వర్క్ ఉంటుంది. అది కూడా చాలా అద్భుతంగా వచ్చింది ఆడియన్స్ చాలా నేచురల్ గా ఫీల్ అవుతారు.  

మిగతా నటుల గురించి?
అవసరాల శ్రీనివాస్ గారు, రాజీవ్ కనకాల గారు, ఝాన్సీ గారు, కిషోర్,  ప్రదీప్ రావత్, శిల్పా శిరోద్కర్ ఇలా అందరూ తెలుగులో తెలిసిన నటీనటులే. అందరి క్యారెక్టర్స్ కూడా చాలా కథకి అనుగుణంగా చాలా బాగా వచ్చాయి.

ఈ సినిమా ప్రమోషన్స్ లో ట్విట్టర్లో ఫాన్స్ తో లైవ్ లో చాట్ చేశారు కదా.. ఎలా అనిపించింది?
-ఫ్యాన్స్ తో ఇంట్రాక్ట్ అవ్వడం ఎప్పుడూ హ్యాపీగా ఉంటుంది. వాళ్ళ రెస్పాన్స్ చాలా ఎనర్జీ ఇస్తుంది. అలాగే ఇంస్టాగ్రామ్ కాల్ లో కొందరు ఫాన్స్ తో కూడా మాట్లాడాను. నేను ఎప్పుడూ సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండను. ఈసారి ఫ్యాన్స్ తో ఇంట్రాక్ట్ అవ్వడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.  

ఈ సినిమా చేసిన తర్వాత ఆత్మల్ని నమ్ముతున్నారా?
-ఇందులో  స్పిరిట్స్ మనతో ఎలా ఇంట్రాక్ట్ అవుతాయనేది ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ సినిమా కోసం కొన్ని డాక్యుమెంటరీలు చూశాను. అలాగే కొన్ని పరికరాల గురించి తెలుసుకున్నాను. అవన్నీ వాటన్నింటి గురించి తెలుసుకుంటున్నప్పుడు నిజంగా అలాంటి స్పిరిట్స్ ఉంటాయనిపించింది. పూర్తిగా కాకపోయినా లైట్ గా నమ్మాలి అనిపిస్తుంది (నవ్వుతూ)

మీరు ఏదైనా ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు అది చాలెంజింగ్ అనిపిస్తుంటుందా?
క్యారెక్టర్ విన్నప్పుడు దాన్ని ఎలా ఎచీవ్ చేయాలనే ఆలోచన వుంటుంది. ఇప్పటివరకూ 20 సినిమాలు చేశాను. ఈ జర్నీలో ఒక క్యారెక్టర్ ని ఎలా అర్థం చేసుకోవాలి? దాని కోసం ఎలా గ్రౌండ్ వర్క్ చేయాలి దానికంటూ ఒక కథను ఎలా మనలో అనుకోవాలి? ఇలా వర్క్ చేసినప్పుడు క్యారెక్టర్ని చేయడం ఈజీ గానే ఉంటుంది.

-ఈ సినిమాలో శివతాండవం ఉంటుంది. నేనెప్పుడూ క్లాసికల్ డాన్స్ చేయలేదు. దానికోసం దాదాపుగా పది రోజులు ప్రిపేర్ అయ్యి ఆ సీక్వెన్స్ ని చేశాను.  

 ఇందులో మహేష్ బాబు గారు కనిపిస్తారని టాక్ వినిపిస్తుంది?
లేదండి. నిజానికి ఇందులో శివుడు కనిపించే ఒక ఎపిసోడ్ ఉంది. అక్కడ కృష్ణ గారిని చూపించాలని అనుకున్నాం. కానీ వీఎఫ్ఎక్స్ కి ఎక్కువ సమయం కుదరలేదు. ఇందులో కృష్ణ గారు గాని మహేష్ గారు గాని కనిపించడం వుండదు.

అవుట్ పుట్ చూసుకున్న తర్వాత ఎలా అనిపించింది?
-సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఎక్కడ కూడా బోర్ కొట్టదు. నరేషన్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆడియన్స్ చాలా థ్రిల్ అవుతారు.  

మీ జర్నీ ఎలా అనిపిస్తుంది?
-నా ఫస్ట్ సినిమా ఎస్ఎంఎస్ చేసిన రోజున నేను 20 సినిమాలు చేస్తానని అనుకోలేదు. ఈ జర్నీ నాకు ఆనందాన్ని ఇస్తుంది. నేను ప్రతి సినిమాకి 100% ఇచ్చాను. ప్రతి క్యారెక్టర్ కోసం అహర్నిశలూ కష్టపడతాను. అలా చూసుకుంటే ఐ డిజర్వ్ మచ్ మోర్ అనిపిస్తుంది.

బాలీవుడ్ నుంచి అవకాశాలు వస్తున్నాయా ?
బాఘీ తర్వాత కొన్ని అవకాశాలు వచ్చాయి. అయితే నా ఫోకస్ ఎప్పుడు తెలుగు సినిమా పైనే ఉంది.

నెక్స్ట్ సినిమాలు గురించి?
రాహుల్ రవీంద్రన్ తో ఒక సినిమా వుంది. ఇప్పుడు వరకు అలాంటి కాన్సెప్ట్ వరల్డ్  సినిమాల్లో రాలేదు. కాన్సెప్ట్ పరంగా అది ఒక బాహుబలి లాంటి సినిమా. అలాగే పుల్లెల గోపీచంద్ బయోపిక్ కూడా చేయాలి.

ఆల్ ది బెస్ట్
-థాంక్ యూ

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

42 minutes ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago