విజయవంతమైన చిత్రం ‘ది కాశ్మీర్ ఫైల్స్’ తో బాలీవుడ్‌లోకి ప్రవేశించిన టాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రితో కలిసి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘ది ఢిల్లీ ఫైల్స్’ కోసం జతకట్టనుంది.
తాజాగా దర్శకుడు, నిర్మాత ఒక అప్‌డేట్‌తో ముందుకు వచ్చారు. ది ఢిల్లీ ఫైల్స్ ఈ సంవత్సరం సెట్స్‌పైకి వెళ్తుందని, వచ్చే ఏడాది విడుదలౌతుందని వివేక్ అగ్నిహోత్రి ధృవీకరించారు.
‘షెడ్యూల్ ప్రకారం #TheDelhiFiles ఈ సంవత్సరం ప్రారంభమౌతుంది. వచ్చే ఏడాది విడుదల. బిగ్ స్టార్లు లేరు. బిగ్ కంటెంట్ మాత్రమే” అని వివేక్ అగ్నిహోత్రి పేర్కొన్నారు. దర్శకుడి స్టేట్మెంట్ పై అభిషేక్ అగర్వాల్ కూడా చిత్రం టైటిల్‌ను ట్యాగ్ చేయడం ద్వారా కన్ఫర్మ్ చేశారు
తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి అభిషేక్ అగర్వాల్, అర్చన అగర్వాల్, వివేక్ రంజన్ అగ్నిహోత్రి పల్లవి జోషి నిర్మాతలు.
ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
నిజాయితీతో, భావోద్వేగపూరిత కథలను ప్రోత్సహిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ వేగంగా ఎదుగుతోన్న నిర్మాణ సంస్థ విజన్ సినిమా హౌస్. డా.…
ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కంటెంట్‌తో ప్రేక్షకులను మెపిస్తూ వారి హృదయాల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జియో హాట్…
యష్ రాజ్ ఫిల్మ్స్ హిస్టారికల్ బ్లాక్ బస్టర్ దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే (DDLJ) 30 వసంతాల సందర్బంగా…
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…