టాలీవుడ్

‘ఆ ఒక్కటీ అడక్కు’ నుండి ది బ్లిస్ఫుల్ మెలోడీ హమ్మమ్మో విడుదల

అల్లరి నరేష్ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ ప్రమోషన్ కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్‌కు కూడా అద్భుతమైన స్పందన వచ్చింది.  చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మాణంలో, నూతన దర్శకుడు మల్లి అంకం దర్శకత్వం వహించిన చిత్రాన్ని చూడాలనే ఉత్సాహాన్ని ప్రతి ప్రమోషనల్ కంటెంట్ పెంచింది. భరత్ లక్ష్మీపతి సహ నిర్మాత. అల్లరి నరేష్ సరసన ఫారియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది.

మ్యూజికల్ ప్రమోషన్‌లలో భాగంగా, యూనిట్ సెకండ్ సింగిల్ హమ్మమ్మోను విడుదల చేశారు, ఇది క్లాసికల్ బీట్‌లతో బ్లిస్ఫుల్ మెలోడీ. భాస్కరభట్ల అల్లరి నరేష్ భావాలను తెలియజేసే ఆకర్షణీయమైన సాహిత్యం అందించగా , యశస్వి కొండేపూడి తన చక్కని గానంతో ప్రత్యేక ఆకర్షణను తెచ్చారు. బ్యూటీఫుల్  కెమిస్ట్రీని పంచుకున్న అల్లరి నరేష్,  ఫరియా అబ్దుల్లా ఎలిగెంట్ మూవ్స్ ఆకట్టుకున్నారు

వెన్నెల కిషోర్, జామీ లీవర్, వైవా హర్ష,  అరియానా గ్లోరీ ఈ చిత్రంలో ఇతర ప్రధాన తారాగణం.

ఈ చిత్రానికి అబ్బూరి రవి రచయిత. ఛాయాగ్రహణం సూర్య, గోపి సుందర్ సంగీతం సమకూరస్తున్నారు. ఈ చిత్రానికి చోటా కె ప్రసాద్ ఎడిటర్ కాగా, జెకె మూర్తి ఆర్ట్ డైరెక్టర్.

మేకర్స్ ఇటీవల ప్రకటించినట్లుగా, ఆ ఒక్కటి అడక్కు మే 3, 2024న గ్రాండ్ గా విడుదల కానుంది.

తారాగణం: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్, జామీ లివర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ తదితరులు

సాంకేతిక విభాగం:
దర్శకత్వం – మల్లి అంకం
నిర్మాత – రాజీవ్ చిలక
సహ నిర్మాత – భరత్ లక్ష్మీపతి
బ్యానర్ – చిలక ప్రొడక్షన్స్
రచయిత – అబ్బూరి రవి
ఎడిటర్ – చోటా కె ప్రసాద్
డీవోపీ – సూర్య
సంగీతం – గోపీ సుందర్
ఆర్ట్ డైరెక్టర్ – జె కె మూర్తి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – అక్షిత అక్కి
మార్కెటింగ్ మేనేజర్ – శ్రావణ్ కుప్పిలి
మార్కెటింగ్ ఏజెన్సీ – వాల్స్ అండ్ ట్రెండ్స్
పీఆర్వో – వంశీ-శేఖర్
పబ్లిసిటీ డిజైన్ – అనిల్ భాను

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

20 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

5 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

5 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago