వినూత్నంగా జరిగిన ‘ద బ‌ర్త్‌డే బాయ్’ ట్రైలర్‌ విడుదల

కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌ అని ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు నిరూపించాయి. కథ, కథనాలు బాగుంటే కొత్త నటీనటుల సినిమాలు అయినా మన తెలుగు ప్రేక్షకులు సూపర్‌హిట్‌ చేస్తారు. ఆ కోవలోనే స్ట్రాంగ్‌ కంటెంట్‌తో రాబోతున్న చిత్రం ‘ద బర్త్‌డే బాయ్‌’.
ర‌వికృష్ణ‌, స‌మీర్ మ‌ళ్లా, రాజీవ్‌క‌న‌కాల ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రంలో పలువురు నూతన నటీనటులు నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని బొమ్మ బొరుసా ప‌తాకంపై ఐ.భరత్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి విస్కి ద‌ర్శ‌కుడు. జూలై 19న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్‌కు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ విడుదల వేడుక బుధవారం హైదరాబాద్‌లో వినూత్నంగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జబర్ధస్త్ ఫేం రోహిణి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్ర కథ రాసుకున్నాను. నా జీవితంలో తొమ్మిది సంవత్సరాల క్రితం జరిగిన ఓ సంఘటనకు కథ రూపం ఇది. ఈ సినిమా నచ్చితే ఇద్దరికి చెప్పండి. నచ్చకపోతే పది మందికి చెప్పండి. నా అసలు పేరును, నా ఫేస్‌ను సినిమా విడుదలైన తరువాత రివీల్‌ చేస్తాను. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది’ అన్నారు. నిర్మాత ఐ.భరత్‌ మాట్లాడుతూ ఇదొక కామెడీ డ్రామా. చిత్రంలోని ప్ర‌తి పాత్ర ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. ప్ర‌తి పాత్ర‌, ప్ర‌తి స‌న్నివేశం కొత్త‌గా వుంటుంది.ఎం.ఎస్ చ‌ద‌వ‌డానికి విదేశాల‌కు వెళ్లిన‌ప్పుడు ఐదుగురు చిన్న‌నాటి స్నేహితుల‌కు జ‌రిగిన సంఘ‌ట‌న ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాం.

ఐదుగురు స్నేహితుల‌కు ఎదురైన అనుభ‌వాలు, వాటి ప‌ర్య‌వ‌సానాలు చాలా ఆస‌క్తిక‌రంగా వుంటాయి.ఈ సినిమా స‌హ‌జ‌త్వం కోసం సింక్ సౌండ్ వాడాం. కంటెంట్‌తో పాటు మంచి టెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ చిత్రం వుండ‌బోతుంది. ఒక మంచి క్వాలిటీ సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌డానికి ప్ర‌య‌త్నించాం. ఈ సినిమాతో నాకు పర్సనల్‌ మంచి కనెక్షన్‌ వుంది. త‌ప్ప‌కుండా చిత్రం అంద‌రికి న‌చ్చుతుంద‌నే న‌మ్మ‌కం వుంది.

ఈ నెల 19న చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నాం* అన్నారు. నటుడు రవికృష్ణ మాట్లాడుతూ సినిమా అంటే పిచ్చి వున్న టీమ్‌తో నటించినందుకు ఆనందంగా వుంది. ఈ సినిమా కోసం అందరూ ఎంతో కష్టపడ్డారు. తప్పకుండా సినిమా అందరికి కొత్త అనుభూతిని పంచుతుంది అన్నారు. ఈ చిత్రంలో తను నటించకపోయినా, సినిమా కోసం ఈ టీమ్‌ కష్టాన్ని చూసి వాళ్లకు ప్రమోషన్‌ సహాయం చేస్తున్నానని రోహిణి తెలిపారు. ఈ సమావేశంలో ఈ చిత్రంలో నటించన నటీనటులు, సాంకేతిక నిపుణులు తదితరులు పాల్గొన్నారు.


ర‌వికృష్ణ‌, స‌మీర్ మ‌ళ్లా, రాజీవ్‌క‌న‌కాల, ప్ర‌మోదిని, వాకా మ‌ని, రాజా అశోక్‌, వెంక‌టేష్, సాయి అరుణ్‌, రాహుల్ త‌దిత‌రులు ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత: ఐ.భ‌ర‌త్‌,
డీఓపీ : సంకీర్త్ రాహుల్‌, సంగీతం: ప్ర‌శాంత్ శ్రీ‌నివాస్, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: ఏఆర్ వంశీ.జి, ఎడిట‌ర్‌: న‌రేష్ ఆడుపా, సింక్ సౌండ్ డిజైన్‌:
సాయి మ‌ణిధ‌ర్ రెడ్డి, సౌండ్ మిక్సింగ్‌: అర‌వింద్ మీన‌న్‌, మేక‌ప్ చీఫ్‌:
వెంక‌ట్ రెడ్డి, డిజిటల్ మార్కెటింగ్‌: ఫ‌స్ట్ షో, పీఆర్ ఓ: ఏలూరు శ్రీ‌ను, మ‌డూరి మ‌ధు

Tfja Team

Recent Posts

హేబల్‌వంత్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌తో థియేటర్లు ఊగిపోతున్నాయి: సక్సెస్‌మీట్‌లో చిత్ర యూనిట్‌

ప్రామిసింగ్‌ కథానాయకుడు సుహాస్‌, శివానీ నాగారం జంటగా రూపొందిన హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ 'హే బల్‌వంత్‌'. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌…

16 hours ago

‘హే బల్‌వంత్’తో కచ్చితంగా హిట్టు కొట్టబోతోన్నాం.. రిలీజ్ ప్రెస్ మీట్‌లో డిస్ట్రిబ్యూటర్, నిర్మాత వంశీ నందిపాటి

‘లిటిల్‌హార్ట్స్‌’, ‘రాజు వెడ్స్‌ రాంబాయి’, ‘ఈషా’ వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం తాజాగా…

2 days ago

“ప్రభాస్ నిమ్మలతో కలిసి”మిరాకిల్” చేద్దాం రండి” అంటున్నహీరోయిన్ హెబ్బా పటేల్!!

సైదా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రమేష్ ఎగ్గిడి - శ్రీకాంత్ మొగదాసు - చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న…

2 days ago

ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తించేలా ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ ట్రైలర్.. ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్

రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్‌ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…

2 days ago

ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తించేలా ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ ట్రైలర్.. ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్

రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’. ‘రెక్కీ’,…

3 days ago

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్లాప్ తో ఘనంగా ప్రారంభమైన హీరో సత్యదేవ్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా నూతన చిత్రం

హీరో సత్యదేవ్ తన కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. సత్యదేవ్ నటిస్తున్న 15వ చిత్రమిది. ఈ చిత్రాన్ని త్రిశూల్ విజినరీ…

3 days ago