మంచి స్క్రిప్ట్‌లు ఎంపిక చేసుకుంటూ, విభిన్నమైన సినిమాలు రూపొందించే నిర్మాత కె.కె.రాధామోహన్. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌లో ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో ఆయన నిర్మించిన యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ క్రేజీ ఫెలో. దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ కథానాయికలు. అక్టోబర్ 14న సినిమా విడుదలౌతున్న నేపధ్యం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. హీరో శర్వానంద్ ప్రీరిలీజ్ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ప్రీరిలీజ్ ఈవెంట్ లో శర్వానంద్ మాట్లాడుతూ.. ఆది నాకు బ్రదర్ లాంటి వాడు. తనని తమ్ముడిలానే చూస్తాను. తనకి సక్సెస్ వస్తే నేను ఎంజాయ్ చేస్తాను. క్రేజీ ఫెలోలో రన్ రాజా రన్ ఫ్లేవర్ కనిపిస్తోంది. ట్రైలర్ చూస్తుంటే మంచి ఎంటర్ టైనర్ అనిపిస్తోంది. క్రేజీ ఫెలో పెద్ద సక్సెస్ కావాలి. రాధ మోహన్ గారు నాకు పదేళ్ళుగా పరిచయం. పాటలు చాలా బావున్నాయి. దర్శకుడు ఫణి కృష్ణ టేకింగ్ బావుంది. మాటల్లో మంచి కామెడీ టైమింగ్ వుంది. ఈ సినిమాకి పని చేసిన అందరికీ బెస్ట్ విశేష్. అక్టోబర్ 14న సినిమా వస్తోంది. అందరూ థియేటర్ సినిమా చూసి ఎంజాయ్ చేయండి” అన్నారు.
ఆది సాయికుమార్ మాట్లాడుతూ.. ఈ ఈవెంట్ కి వచ్చిన శర్వానంద్ అన్నకి కృతజ్ఞతలు. మారుతి, సంపత్ నంది గారికి థాంక్స్. క్రేజీ ఫెలో హిలేరియస్ ఎంటర్ టైనర్. మంచి ఎమోషన్ కూడా వుంటుంది. కథని బలంగా నమ్మి చేశాం. దర్శకుడు ఫణి కృష్ణ చాలా అద్భుతమైన కథని రెడీ చేశారు. నిర్మాత రాధామోహన్ గారు ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాని నిర్మించారు. ద్రువన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సతీష్ ముత్యాల గారు వండర్ ఫుల్ విజువల్స్ ఇచ్చారు. ఈ సినిమాలో చేసిన మిర్నా, అనీష్, రమేష్, సప్తగిరి . అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. అక్టోబర్ 14న సినిమా థియేటర్ లోకి వస్తుంది. ప్రేక్షకులు థియేటర్ లో చూసి ఆదరించాలి” అని కోరారు.సంపత్ నంది మాట్లాడుతూ.. రాధమోహన్ గారి శ్రీ సత్య సాయి ఆర్ట్స్ నా హోం బ్యానర్ లాంటింది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ తొలి సినిమా చేస్తున్న దర్శకులకు లక్కీ బ్యానర్. ఏమైయింది ఈవేళ తో నాకు మంచి విజయం ఇచ్చారు. ఈ సినిమాతో ఫణి కృష్ణ కూడా మంచి విజయం దక్కుతుంది. రాధకృష్ణ గారు ప్యాషన్ తో సినిమా చేసే నిర్మాత. క్రేజీ ఫెలో లో మంచి మ్యూజిక్ వుంది. టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేసి సినిమా చేశారు. అక్టోబర్ 14న అందరూ సినిమా ఆదరిస్తారని కోరుతున్నాను.
నిర్మాత రాధమోహన్ మాట్లాడుతూ.. మేము కోరగానే ఈ వేడుకుకు వచ్చిన శర్వానంద్, సంపత్ నంది, మారుతి గారికి కృతజ్ఞతలు. దర్శకుడు ఫణి కృష్ణ చెప్పిన కథ నచ్చింది. ఈ కథకి ఆది చక్కగా సరిపోయాడు. మిర్నా ఈ సినిమాతో తెలుగులో అడుగుపెడుతోంది. ఈ సినిమా కోసం మంచి టీమ్ వర్క్ చేశాం. ద్రువన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. దర్శకుడు ఫణి కృష్ణ కి మంచి భవిష్యత్ వుంది. తను ఏం చెప్పాడో అదే తీశారు. క్రేజీ ఫెలో మంచి ఎంటర్ టైనర్. అక్టోబర్ 14న సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి” అని కోరారు.చిత్ర దర్శకుడు ఫణి కృష్ణ మాట్లాడుతూ..నేను చెప్పిన కథ నచ్చి, నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాత రాధామోహన్ గారికి కృతజ్ఞతలు. అక్టోబర్ 14న ఆయన నమ్మకం నిలబెట్టుకుంటాను. అది గారు ఈ సినిమాలో కొత్తగా వుంటారు. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధించింది. ఈ సినిమా కోసం చాలా క్రేజీగా పని చేశాం. ఈ సినిమాకి పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు.మిర్నా మీనన్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. సినిమా షూటింగ్ ని చాలా ఎంజాయ్ చేశాను. అది గారితో పని చేయడం ఆనందంగా వుంది.
ఈ సినిమాలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. అక్టోబర్ 14న థియేటర్లో సినిమా చూసి మమ్మల్ని ప్రోత్సహించండి” అని కోరారు.దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. క్రేజీ ఫెలో పాటలు చాలా ఎనర్జిటిక్ గా వున్నాయి. అది చాలా అద్భుతంగా ఫెర్ ఫార్మ్ చేశారు. నిర్మాత రాధ మోహన్ గారు ఎక్కడా రాజీ పడకుండా సినిమాని తీశారు. సినిమాలో కూడా కొత్త కాన్సెప్ట్ ఉంటుందని భావిస్తున్నాను. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి” అని కోరారుద్రువన్ మాట్లాడుతూ.. క్రేజీ ఫెలో క్రేజీ మెమొరీలా వుండిపోతుంది. నిర్మాత రాధామోహన్ గారికి, దర్శకుడు ఫణి కృష్ణ కి కృతజ్ఞతలు. ఆది గారి కెరీల్ ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ విజయం అవుతుంది” అన్నారుఈ వేడుకలో కాసర్ల శ్యామ్, యాక్షన్ కోరియోగ్రఫర్ రామకృష్ణ, అనీష్ కురివిల్లా, వినోదిని వైద్యనాధన్ తదితరులు పాల్గొన్నారు.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…