యానిమల్, స్పిరిట్ ఫేం హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ లో ‘త్రికాల’ సినిమా నుంచి అనురాగ్ కులకర్ణి పాడిన అదిరిపోయే పాట యాలో ఈ గుబులే ఎలో రిలీజ్

అర్జున్ రెడ్డి, యానిమల్ పాన్ ఇండియా హిట్స్ తో పాటు నేషనల్ అవార్డ్ అందుకున్న హర్షవర్దన్ రామేశ్వర్ … ఇప్పుడు మైథలాజికల్ జానర్ లో రూపొందుతున్న ‘త్రికాల’ సినిమా మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రద్దా దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్ ప్రధాన పాత్రల్లో మణి తెల్లగూటి దర్శకత్వంలో రాధిక శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం నుంచి తాజాగా యాలో ఈ గుబులే ఎలో పాటని రిలీజ్ చేశారు.

ఈ పాటలో హర్షవర్దన్ రామేశ్వర్ స్టైల్‌తో పాటు మెలడీకి ఉన్న డెప్త్ అద్భుతంగా బ్యాలెన్స్ చేశాడు. ఆయన మ్యూజిక్ ట్రీట్ ఈ పాటకి ప్రధాన బలం. ప్రతి బీట్‌లోనూ ఆయన ట్రేడ్‌మార్క్ ఇంటెన్సిటీ స్పష్టంగా వినిపిస్తూ, పాటకి ఒక ప్రత్యేక ఐడెంటిటీ ఇచ్చింది.

ఇక అనురాగ్ కులకర్ణి వాయిస్ ఈ పాటకి ప్రాణం పోసింది అని చెప్పాలి. భావోద్వేగాల్ని సూటిగా హృదయానికి చేరేలా చెప్పగల ఆయన వాయిస్, పాటలోని లవ్ ఫీలింగ్‌ని మరింతగా ఎలివేట్ చేసింది. సాఫ్ట్ టచ్‌తో పాటు పవర్ ఉన్న వాయిస్ మాడ్యులేషన్‌తో అనురాగ్ మరోసారి తన వెర్సటిలిటీని నిరూపించాడు. రాకేందు మౌళి లిరిక్స్ క్యాచిగా వున్నాయి.

మొత్తానికి ‘యాలో ఈ గుబులే ఎలో’ పాట హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ బ్రిలియన్స్‌కి, అనురాగ్ కులకర్ణి ఎమోషనల్ సింగింగ్‌కి పర్ఫెక్ట్ కాంబినేషన్‌గా నిలుస్తోంది. ‘త్రికాల’ సినిమా ఆల్బమ్‌పై అంచనాలను మరింత పెంచేలా ఈ పాట ప్రత్యేకంగా నిలిచింది. సుచిత్ర చంద్రబోస్ కొరియోగ్రాఫీ సాంగ్ కి మరింత వైబ్ తీసుకొచ్చింది.

రిత్విక్ వేట్షా సమర్పణలో రాధిక, శ్రీనివాస్ నిర్మాతలుగా శ్రీ సాయిదీప్ చాట్లా, వెంకట్ రమేష్ దాడి సహ నిర్మాతలుగా ‘త్రికాల’ సినిమాను మణి తెల్లగూటి తెరకెక్కిస్తున్నారు. శ్రద్దా దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్, సాహితి అవంచ, ఆమని, ప్రభాకర్, అంబటి అర్జున్, రౌడీ రోహిణి వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు.

ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్‌తోనే సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. ఒక్క ట్రైలర్‌తోనే ఏకంగా నార్త్ ఇండియాలోనూ ‘త్రికాల’ బిజినెస్ జరిగిపోయింది. ప్రస్తుతం అన్ని చోట్లా ‘త్రికాల’ మీద మంచి డిమాండ్ ఏర్పడింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.

నటీనటులు: శ్రద్దా దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్, సాహితి అవంచ, ఆమని, ప్రభాకర్, అంబటి అర్జున్, రౌడీ రోహిణి, తనికెళ్ల భరణి, సాయి దీనా

సాంకేతిక సిబ్బంది
నిర్మాత : రాధిక, శ్రీనివాస్
సహ నిర్మాతలు: శ్రీ సాయిదీప్ చాట్లా, వెంకట్ రమేష్ దాడి
దర్శకుడు, ఎడిటర్: మణి తెల్లగూటి
సంగీతం : హర్షవర్దన్ రామేశ్వర్
బీజీఎం: షాజిత్ హుమాయున్
సౌండ్ డిజైన్: ప్రదీప్
కెమెరా : పవన్ చెన్నా
లిరిక్స్: రాకేందు మౌళి, కడలి
పీఆర్వో : తేజస్వి సజ్జా

TFJA

Recent Posts

షూటింగ్‌ పూర్తి చేసుకున్న హ్రీం…

తెలుగు భీజాక్షరాల్లో ‘హ్రీం’ అనే అక్షరానికి ఎంతో ఉన్నతమైన విలువలతో కూడిన అర్థం ఉంది. ‘హ్రీం’ అనే ఒక్క భీజాక్షరంలో…

5 hours ago

యూవీ కాన్సెప్ట్స్, సంతోష్ శోభన్ “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా నుంచి ‘గాబరా గాబరా..’ లిరికల్ సాంగ్ రిలీజ్

సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా "కపుల్ ఫ్రెండ్లీ". ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ…

5 hours ago

ఫిబ్రవరి 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న ‘హే భగవాన్‌’

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం…

5 hours ago

త్వ‌ర‌లోనే నితిన్ 36వ సినిమా షూటింగ్ ప్రారంభం

నితిన్ హీరోగా వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీనివాస సిల్వ‌ర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై రూపొంద‌నున్న యూనిక్ సైఫై ఎంట‌ర్‌టైన‌ర్‌.. వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో…

3 days ago

ప్రముఖ సినీ గీత రచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కాంస్య విగ్రహవిష్కరణ

తానా సాహిత్య విభాగం - తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో మరియు అనకాపల్లి సిరివెన్నెల…

3 days ago

రికార్డులు తిరగరాస్తున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి

కేవలం ఐదు రోజుల్లో రూ.100.2 కోట్ల గ్రాస్ సాధించిన 'అనగనగా ఒక రాజు'నవీన్‌ పొలిశెట్టి కెరీర్‌లోనే అతిపెద్ద విజయంయూఎస్‌లో హ్యాట్రిక్…

1 week ago