”వ్య‌వ‌స్థ”ను ఆద‌రిస్తోన్న ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌:సందీప్ కిష‌న్‌

150 మిలియన్స్ వ్యూయింగ్ మినిట్స్‌తో జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న‌ వ్య‌వ‌స్థ సిరీస్‌ను  ఆద‌రిస్తోన్న ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌:  వ్య‌వ‌స్థ సక్సెస్ మీట్‌లో సందీప్ కిష‌న్‌

వైవిధ్య‌మైన కంటెంట్‌ను అందిస్తూ ఆడియెన్స్ హృద‌యాల్లో త‌న‌దైన స్థానాన్ని ద‌క్కించుకుని దూసుకెళ్తోన్న ఓటీటీ మాధ్య‌మం జీ 5.  తాజాగా దీని స్ట్రీమింగ్ లైబ్ర‌రీలో చేరిన ఒరిజిన‌ల్ ‘వ్యవస్థ’.

ఈ థ్రిల్లింగ్ కోర్టు రూమ్ డ్రామా ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకుంటూ దూసుకెళ్తోంది. ఆనంద్ రంగ దర్శకత్వం వహించటంతో పాటు పట్టాభి చిలుకూరితో కలిసి రూపొందించారు.  ఇప్ప‌టికే 150 మిలియ‌న్ వ్యూయింగ్ మినిట్స్‌ను సాధించి దూసుకెళ్తోంది. ఈ సంద‌ర్బంగా వ్య‌వ‌స్థ టీమ్ స‌క్సెస్ మీట్‌ను నిర్వ‌హించింది. హీరో సందీప్ కిషన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా..

తేజ కాకుమాను మాట్లాడుతూ ‘‘దర్శకుడు మా అన్నయ్యే కాబట్టి పెద్దగా పొగడాల్సిన పని లేదు. మా కార్తీక్, సంపత్ సార్, టీమ్ అంద‌రినీ చూసి గ‌ర్వ‌ప‌డుతున్నాను’’ అన్నారు.

కార్తీక్ రత్నం మాట్లాడుతూ ‘‘సందీప్ కిషనన్న‌ను క‌లిసి త‌ర్వాత ఆయ‌న నాకు ఎప్పుడూ తిరుగులేని స‌పోర్ట్‌ను అందిస్తూనే ఉన్నారు. ఆనంద్ రంగ‌గారితో క‌లిసి ప‌ని చేయ‌టం ఎంతో ఆనందంగా ఉంది. అదృష్టంగా భావిస్తున్నాను. ప‌ట్టాభిగారు చాలా ధైర్యం చేసి తీశారు. సంప‌త్ రాజ్‌, అనిల్ సార్ అంద‌రికీ థాంక్స్‌. హెబ్బా ప‌టేల్‌, కామ్నా జెఠ్మ‌లానీతో క‌లిసి వ‌ర్క్ చేయ‌టం చాలా ఆనందంగా ఉంది. ఎంటైర్ టీమ్‌కి థాంక్స్‌. జీ 5వారు చేస్తోన్న స‌పోర్ట్ మ‌ర‌చిపోలేం. చ‌క్క‌గా ప్ర‌మోట్ చేస్తున్నారు. ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు’’ అన్నారు.

హెబ్బా ప‌టేల్ మాట్లాడుతూ ‘‘వ్యవస్థ సిరీస్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వ‌స్తోంది. అంత మంచి స‌క్సెస్ అందించిన ప్రేక్ష‌కుల‌కు, ఆనంద రంగ గారికి, స‌పోర్ట్ చేసిన ఎంటైర్ టీమ్‌కు ధ‌న్య‌వాదాలు’’ అన్నారు.https://youtu.be/VYLbTiQ2fkI 

కామ్నా జెఠ్మలానీ మాట్లాడుతూ ‘‘ఎగ్జ‌యిటెడ్‌గా, నెర్వ‌స్‌గా ఉన్నాను. ఎందుకంటే ఆరేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఈ సిరీస్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాను. చిన్న రోల్ అయినా చాలా ఇంపార్టెంట్ ఉండ‌టంతో యాక్సెప్ట్ చేశాను. సంప‌త్‌గారికి, కార్తీక్ ర‌త్నం, హెబ్బా ప‌టేల్ అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు.https://youtu.be/h4T1t8H09_Q 

సంప‌త్ రాజ్ మాట్లాడుతూ ‘‘నాపై నమ్మకంతో నాకీ అవకాశాన్ని ఇచ్చిన ఆనంద్ రంగాగారికి థాంక్స్‌. వెంక‌ట్‌, పట్టాభిగారు స‌హా డైరెక్ష‌న్ టీమ్‌కి ధ‌న్య‌వాదాలు. వ్య‌వ‌స్థ చేసే ముందు చాలా మంది ఎందుకు చేస్తున్నావ‌ని అడిగారు. అయితే నాకు స్క్రిప్ట్‌పై నమ్మ‌కం ఉంద‌ని చెప్పాను. ఇదొక స్లో బ‌ర్న‌ర్‌లా ఆడియెన్స్‌కి క‌నెక్ట్ అయ్యింది. కంటెంట్ బావుంటే ఆడియెన్స్ ఆద‌రిస్తార‌ని మ‌రోసారి వ్య‌వ‌స్థ ప్రూవ్ చేసింది. జీ 5 మార్కెటింగ్ స్ట్రాట‌జీతో దీన్ని సూప‌ర్ సక్సెస్ చేశారు’’ అన్నారు.https://youtu.be/G6BVzLXIHTE 

జీ 5 తెలుగు ఒరిజిన‌ల్ కంటెంట్ హెడ్‌, వైస్ ప్రెసిడెంట్ సాయితేజ దేశ్ రాజ్ మాట్లాడుతూ ‘‘20 రోజుల ముందే చెప్పాం. వ్యవస్థతో హిట్ ఇస్తామని. హిట్ కాదు.. జీ5కిది సమ్మర్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇంత మంచి విజ‌యాన్ని అందించిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. రెక్కీ, పులి మేక‌.. ఇప్పుడు వ్య‌వ‌స్థ‌తో జీ 5 ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకుంది. ఇంకా మంచి కంటెంట్‌తో ఆడియెన్స్‌ను మెప్పించ‌బోతున్నాం’’ అన్నారు.

ద‌ర్శ‌కుడు ఆనంద్ రంగ మాట్లాడుతూ ‘‘నా టీమ్‌ను నా ఫ్యామిలీగా భావించి వర్క్ చేశాను. అందుక‌నే మంచి ఔట్‌పుట్ వ‌చ్చింది. కంటెంట్ మీ ముందే ఉంది. ఇక మీరే చూసి ఎంజాయ్ చేయాలి’’ అన్నారు.

నిర్మాత ప‌ట్టాభి చిలుకూరి మాట్లాడుతూ ‘‘జీ 5, ఆనంద్ రంగాకి థాంక్స్‌. మంచి రిపోర్ట్స్ వ‌స్తున్నాయి. చాలా హ్యాపీగా అనిపిస్తోంది.

సందీప్ కిష‌న్ మాట్లాడుతూ ‘‘వ్యవస్థలో వర్క్ చేసిన వారందరరూ చాలా కావాల్సిన వారే. సంపత్‌గారితో క‌లిసి సినిమా చేయాల‌ని ఎదురు చూస్తున్నాను. అలాగే కామ్నా జెఠ్మ‌లానీతో నేను అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ఉన్న‌ప్ప‌టి నుంచి ప‌రిచ‌యం ఉంది. హెబ్బా ప‌టేల్‌కి కంగ్రాట్స్. కార్తీక్ ర‌త్నం అంటే చాలా ఇష్టం. త‌ను వ్య‌వ‌స్థ‌లో పోషించిన తీరు అద్భుతం. జీ5కి అభినంద‌న‌లు. వారు కంటెంట్‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లే తీరు బావుంది. ఇక ద‌ర్శ‌కుడు ఆనంద్ రంగ‌గారితో డీకే బోస్ చిత్రం నుంచి ప‌రిచ‌యం ఉంది. వ్య‌వ‌స్థ సినిమాను ఎలా తెర‌కెక్కించారా అని వెయిట్ చేసి చూశాను. ఎంటైర్ టీమ్‌కి కంగ్రాట్స్‌. 150 మిలియన్స్ వ్యూయింగ్ మినిట్స్‌తో ఆద‌రిస్తోన్న ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌’’ అన్నారు.https://youtu.be/txxWbpsUQmo 

న‌టీన‌టులు:

వంశీగా కార్తీక్ ర‌త్నం, చ‌క్ర‌వ‌ర్తిగా సంప‌త్ రాజ్‌, యామినిగా హెబ్బా ప‌టేల్‌, గాయ‌త్రి పాత్ర‌లో కామ్నా జెఠ్మ‌లానీ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: ఆనంద్ రంగ‌, నిర్మాత‌లు:  ప‌ట్టాభి చిలుకూరి, ఆనంద్ రంగ‌, సినిమాటోగ్ర‌ఫీ:  అనిల్ భండారి, పి.ఆర్‌.ఒ:  బియాండ్ మీడియా

జీ5 గురించి:

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలి ఇలా ఇతర భాషల్లో ఉన్న గొప్ప కంటెంట్‌ను జీ5 నిత్యం ఆడియెన్స్‌కు అందిస్తూనే ఉంది. దేశ వ్యాప్తంగా జీ5కి మంచి కంటెంట్ అందిస్తుందనే పేరు ఉందన్న సంగతి తెలిసిందే. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మీద నిర్మించిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన లూసర్ 2, బీబీసీ స్టూడియో, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన గాలివాన, రెక్కి, హలో వరల్డ్, మా నీళ్ల ట్యాంగ్, అహనా పెళ్లంట, ఏటీఎం, పులి మేక వంటి ఎన్నో మంచి వెబ్ సిరీస్‌లను జీ5 అందించింది. ఇంకా మ‌రెంతో వైవిధ్య‌మైన కంటెంట్‌ను అందించ‌టానికి జీ 5 సిద్ధ‌మ‌వుతోంది. ఈ లిస్టులో ‘వ్యవస్థ’ చేరింది.

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

12 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago