150 మిలియన్స్ వ్యూయింగ్ మినిట్స్‌తో జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న వ్యవస్థ సిరీస్‌ను ఆదరిస్తోన్న ప్రేక్షకులకు థాంక్స్: ‘వ్యవస్థ’ సక్సెస్ మీట్‌లో సందీప్ కిషన్
వైవిధ్యమైన కంటెంట్‌ను అందిస్తూ ఆడియెన్స్ హృదయాల్లో తనదైన స్థానాన్ని దక్కించుకుని దూసుకెళ్తోన్న ఓటీటీ మాధ్యమం జీ 5. తాజాగా దీని స్ట్రీమింగ్ లైబ్రరీలో చేరిన ఒరిజినల్ ‘వ్యవస్థ’.
ఈ థ్రిల్లింగ్ కోర్టు రూమ్ డ్రామా ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటూ దూసుకెళ్తోంది. ఆనంద్ రంగ దర్శకత్వం వహించటంతో పాటు పట్టాభి చిలుకూరితో కలిసి రూపొందించారు. ఇప్పటికే 150 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్‌ను సాధించి దూసుకెళ్తోంది. ఈ సందర్బంగా వ్యవస్థ టీమ్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. హీరో సందీప్ కిషన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా..
తేజ కాకుమాను మాట్లాడుతూ ‘‘దర్శకుడు మా అన్నయ్యే కాబట్టి పెద్దగా పొగడాల్సిన పని లేదు. మా కార్తీక్, సంపత్ సార్, టీమ్ అందరినీ చూసి గర్వపడుతున్నాను’’ అన్నారు.
కార్తీక్ రత్నం మాట్లాడుతూ ‘‘సందీప్ కిషనన్నను కలిసి తర్వాత ఆయన నాకు ఎప్పుడూ తిరుగులేని సపోర్ట్‌ను అందిస్తూనే ఉన్నారు. ఆనంద్ రంగగారితో కలిసి పని చేయటం ఎంతో ఆనందంగా ఉంది. అదృష్టంగా భావిస్తున్నాను. పట్టాభిగారు చాలా ధైర్యం చేసి తీశారు. సంపత్ రాజ్, అనిల్ సార్ అందరికీ థాంక్స్. హెబ్బా పటేల్, కామ్నా జెఠ్మలానీతో కలిసి వర్క్ చేయటం చాలా ఆనందంగా ఉంది. ఎంటైర్ టీమ్‌కి థాంక్స్. జీ 5వారు చేస్తోన్న సపోర్ట్ మరచిపోలేం. చక్కగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు.
హెబ్బా పటేల్ మాట్లాడుతూ ‘‘వ్యవస్థ సిరీస్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అంత మంచి సక్సెస్ అందించిన ప్రేక్షకులకు, ఆనంద రంగ గారికి, సపోర్ట్ చేసిన ఎంటైర్ టీమ్‌కు ధన్యవాదాలు’’ అన్నారు.https://youtu.be/VYLbTiQ2fkI
కామ్నా జెఠ్మలానీ మాట్లాడుతూ ‘‘ఎగ్జయిటెడ్‌గా, నెర్వస్‌గా ఉన్నాను. ఎందుకంటే ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించాను. చిన్న రోల్ అయినా చాలా ఇంపార్టెంట్ ఉండటంతో యాక్సెప్ట్ చేశాను. సంపత్‌గారికి, కార్తీక్ రత్నం, హెబ్బా పటేల్ అందరికీ థాంక్స్’’ అన్నారు.https://youtu.be/h4T1t8H09_Q
సంపత్ రాజ్ మాట్లాడుతూ ‘‘నాపై నమ్మకంతో నాకీ అవకాశాన్ని ఇచ్చిన ఆనంద్ రంగాగారికి థాంక్స్. వెంకట్, పట్టాభిగారు సహా డైరెక్షన్ టీమ్‌కి ధన్యవాదాలు. వ్యవస్థ చేసే ముందు చాలా మంది ఎందుకు చేస్తున్నావని అడిగారు. అయితే నాకు స్క్రిప్ట్‌పై నమ్మకం ఉందని చెప్పాను. ఇదొక స్లో బర్నర్‌లా ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యింది. కంటెంట్ బావుంటే ఆడియెన్స్ ఆదరిస్తారని మరోసారి వ్యవస్థ ప్రూవ్ చేసింది. జీ 5 మార్కెటింగ్ స్ట్రాటజీతో దీన్ని సూపర్ సక్సెస్ చేశారు’’ అన్నారు.https://youtu.be/G6BVzLXIHTE
జీ 5 తెలుగు ఒరిజినల్ కంటెంట్ హెడ్, వైస్ ప్రెసిడెంట్ సాయితేజ దేశ్ రాజ్ మాట్లాడుతూ ‘‘20 రోజుల ముందే చెప్పాం. వ్యవస్థతో హిట్ ఇస్తామని. హిట్ కాదు.. జీ5కిది సమ్మర్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇంత మంచి విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు థాంక్స్. రెక్కీ, పులి మేక.. ఇప్పుడు వ్యవస్థతో జీ 5 ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. ఇంకా మంచి కంటెంట్‌తో ఆడియెన్స్‌ను మెప్పించబోతున్నాం’’ అన్నారు.
దర్శకుడు ఆనంద్ రంగ మాట్లాడుతూ ‘‘నా టీమ్‌ను నా ఫ్యామిలీగా భావించి వర్క్ చేశాను. అందుకనే మంచి ఔట్‌పుట్ వచ్చింది. కంటెంట్ మీ ముందే ఉంది. ఇక మీరే చూసి ఎంజాయ్ చేయాలి’’ అన్నారు.
నిర్మాత పట్టాభి చిలుకూరి మాట్లాడుతూ ‘‘జీ 5, ఆనంద్ రంగాకి థాంక్స్. మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. చాలా హ్యాపీగా అనిపిస్తోంది.
సందీప్ కిషన్ మాట్లాడుతూ ‘‘వ్యవస్థలో వర్క్ చేసిన వారందరరూ చాలా కావాల్సిన వారే. సంపత్‌గారితో కలిసి సినిమా చేయాలని ఎదురు చూస్తున్నాను. అలాగే కామ్నా జెఠ్మలానీతో నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి పరిచయం ఉంది. హెబ్బా పటేల్‌కి కంగ్రాట్స్. కార్తీక్ రత్నం అంటే చాలా ఇష్టం. తను వ్యవస్థలో పోషించిన తీరు అద్భుతం. జీ5కి అభినందనలు. వారు కంటెంట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లే తీరు బావుంది. ఇక దర్శకుడు ఆనంద్ రంగగారితో డీకే బోస్ చిత్రం నుంచి పరిచయం ఉంది. వ్యవస్థ సినిమాను ఎలా తెరకెక్కించారా అని వెయిట్ చేసి చూశాను. ఎంటైర్ టీమ్‌కి కంగ్రాట్స్. 150 మిలియన్స్ వ్యూయింగ్ మినిట్స్‌తో ఆదరిస్తోన్న ప్రేక్షకులకు థాంక్స్’’ అన్నారు.https://youtu.be/txxWbpsUQmo
నటీనటులు:
వంశీగా కార్తీక్ రత్నం, చక్రవర్తిగా సంపత్ రాజ్, యామినిగా హెబ్బా పటేల్, గాయత్రి పాత్రలో కామ్నా జెఠ్మలానీ తదితరులు
సాంకేతిక వర్గం:
రచన, దర్శకత్వం: ఆనంద్ రంగ, నిర్మాతలు: పట్టాభి చిలుకూరి, ఆనంద్ రంగ, సినిమాటోగ్రఫీ: అనిల్ భండారి, పి.ఆర్.ఒ: బియాండ్ మీడియా
జీ5 గురించి:
తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలి ఇలా ఇతర భాషల్లో ఉన్న గొప్ప కంటెంట్‌ను జీ5 నిత్యం ఆడియెన్స్‌కు అందిస్తూనే ఉంది. దేశ వ్యాప్తంగా జీ5కి మంచి కంటెంట్ అందిస్తుందనే పేరు ఉందన్న సంగతి తెలిసిందే. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మీద నిర్మించిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన లూసర్ 2, బీబీసీ స్టూడియో, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన గాలివాన, రెక్కి, హలో వరల్డ్, మా నీళ్ల ట్యాంగ్, అహనా పెళ్లంట, ఏటీఎం, పులి మేక వంటి ఎన్నో మంచి వెబ్ సిరీస్‌లను జీ5 అందించింది. ఇంకా మరెంతో వైవిధ్యమైన కంటెంట్‌ను అందించటానికి జీ 5 సిద్ధమవుతోంది. ఈ లిస్టులో ‘వ్యవస్థ’ చేరింది.
శ్రీ నారసింహ చిత్రాలయ బ్యానర్‌పై నరేష్ వర్మ ముద్దం దర్శకత్వంలో, ప్రమోద్ దేవా, రణధీర్, కీర్తన స్వర్గం ముస్కాన్ రాజేందర్…
Under the banner of Sri Naarasimha Chitralaya, the film "Marrichettu Kinda Manollu" was officially launched…
తన తొలి మూవీ ‘మేం ఫేమస్’తో లీడ్ యాక్టర్, దర్శకుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్ హీరోగా తన…
Dharma and Aishwarya Sharma play the lead roles in Drinker Sai, which carries the tagline…
ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "డ్రింకర్ సాయి". బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ…
Aaron Taylor-Johnson is arguably one of the fittest stars out there and his physical transformation…