హీరో చియాన్ విక్రమ్ కెరీర్ లో “తంగలాన్” హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించడం సంతోషంగా ఉంది

చియాన్ విక్రమ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్” ఈ నెల 15న థియేటర్స్ లోకి వచ్చి అన్ని చోట్ల నుంచీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందించగా..నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. “తంగలాన్” సినిమాకు వస్తున్న హ్యూజ్ రెస్పాన్స్ పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా. ఒక మంచి సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకాన్ని “తంగలాన్” నిలబెట్టిందని ఆయన అన్నారు. తాజా ఇంటర్వ్యూలో “తంగలాన్” సినిమా సక్సెస్ గురించి నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా మాట్లాడారు.

  • “తంగలాన్” సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. మేము ఇంత భారీ ఓపెనింగ్స్ తెలుగులో ఎక్స్ పెక్ట్ చేయలేదు. మేము అనుకున్న దానికంటే రెట్టింపు కలెక్షన్స్ వస్తున్నాయి. కలెక్షన్స్ తో మేము ఆశ్చర్యపోతున్నాం. ఏ, బీ, సీ సెంటర్స్ అన్నింటా మంచి వసూళ్లు వస్తున్నాయి. చియాన్ విక్రమ్ గారి కెరీర్ లో ఇవే హయ్యెస్ట్ ఓపెనింగ్స్. 200 కోట్ల రూపాయల వరకు రాబడుతుందని ఆశిస్తున్నాం. అందుకే టీమ్ థియేట్రికల్ విజిట్ కు వెళ్తున్నారు. ఆడియెన్స్ కు తంగలాన్ ను మరింత చేరువచేయాలని ప్రయత్నిస్తున్నాం. విక్రమ్ గారు కూడా తెలుగులో బాగా ప్రమోట్ చేస్తున్నారు. హైదరాబాద్ తో పాటు విజయవాడ కూడా వెళ్లారు. తమిళంలో తంగలాన్ తో పాటు డీమాంటీ కాలనీ 2 కూడా రిలీజైంది. తంగలాన్ కు బిగ్ ఓపెనింగ్స్ వచ్చాయి. డీమాంటీ కాలనీ 2 కూడా బాగానే ఆడుతోంది.
  • తెలుగులో మాతో పాటు 15న రిలీజైన అన్ని సినిమాలూ బాగా ఆడాలని కోరుకున్నాను. ఇప్పుడూ అదే మాట చెబుతున్నా. తంగలాన్ కు థియేటర్స్ పెరుగుతున్నాయి. అన్ని ఏరియాల్లో స్క్రీన్స్ యాడ్ చేస్తున్నారు. హిందీలో మూడు బిగ్ ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి. అందుకే అక్కడ రిలీజ్ 30వ తేదీన చేస్తున్నాం. మిగతా అన్ని భాషల్లోనూ 30న తంగలాన్ రిలీజ్ కు రాబోతోంది.
  • మా సంస్థ నుంచి బడ్డీ, తంగలాన్ రెండూ భిన్నమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. నిర్మాతగా నేనెప్పుడూ దర్శకుడినే నమ్ముతాను. ఆ తర్వాత స్క్రిప్ట్. పా రంజిత్ గారు ఎంత బాగా మూవీ చేయగలరో నాకు తెలుసు. నాకు చియాన్ విక్రమ్ గారితో మూవీ చేయాలనే డ్రీమ్ ఉండేది. విక్రమ్ గారు తంగలాన్ చేసేందుకు ముందుకు రావడం ఇంకా సంతోషంగా అనిపించింది. ఈ మూవీ సక్సెస్ తర్వాత విక్రమ్ గారి ఇంటికి బొకే పంపాను. ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. కలెక్షన్స్ ఎలా ఉన్నాయి కనుక్కున్నారు.
  • మా స్టూడియో గ్రీన్ సంస్థలో చేసిన మొదటి సినిమా పరుత్తి వీరన్ పీరియాడిక్ మూవీ. ఇలాంటి ప్రయత్నాలు మేము గతంలోనే చేశాం. అయితే తంగలాన్ లాంటి మూవీ చేయాలంటే కనీసం పదీ పదిహేనేళ్ల టైమ్ పడుతుంది. తంగలాన్ స్క్రిప్ట్ విషయంలో పా రంజిత్ గారు తప్ప మిగతా ఎవరూ ఇన్వాల్వ్ కాలేదు. చియాన్ విక్రమ్ గారు తన యాక్టింగ్ మీద మాత్రమే ఫోకస్ చేశారు.
  • తంగలాన్ వరకు నాకు సెట్ ఎక్స్ పీరియన్స్ చాలా తక్కువ. మొత్తం 108 రోజుల షూటింగ్ జరిగితే నేను కేవలం 4 రోజులు వెళ్లాను. 2 గంటల చొప్పున సెట్ లో గడిపాను. పా రంజిత్ గారి మీద నమ్మకంతోనే ఆయన, ఆయన టీమ్ కు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాం.
  • మనల్ని ఏదో ఒక శక్తి నడిపిస్తుందని మనమంతా నమ్ముతాం. కొందరు దేవుడిని విశ్వసిస్తారు. మరికొందరు కర్మను నమ్ముతారు. మనం తప్పు చేస్తే ఏదో చెడు జరుగుతుందనే ఫీల్ కలుగుతుంటుంది. నేచర్ కూడా అలాగే తప్పు చేస్తే నేచర్ కూడా శిక్షిస్తుంది. మాళవిక మోహనన్ ఆరతి క్యారెక్టర్ ఆ భావనతో క్రియేట్ చేశారు దర్శకుడు పా.రంజిత్. సినిమాల మేకింగ్ విషయంలో నా నమ్మకం ఏంటంటే ప్రేక్షకుల అభిరుచిని విశ్వసించడమే.
  • కంగువ, తంగలాన్ సినిమాలను బడ్జెట్ పరంగా ఖచ్చితంగా ప్లాన్ చేయలేం. ఇవి రెండూ డిఫరెంట్ మూవీస్. వీటిని ఇలా స్టార్ట్ చేసి ఆ టైమ్ కు ముగించుదాం అని కన్ఫర్మ్ గా చెప్పలేం. మిగతా సినిమాలకు కాస్త బడ్జెట్ అటూ ఇటూగా అంచనా వేయొచ్చు. కానీ కంగువ, తంగలాన్ కు అలా చేయలేం. సినిమాకు కావాల్సింది ఇవ్వాల్సిందే.
  • తంగలాన్ లో చియాన్ విక్రమ్ గారితో పాటు పార్వతీ, మాళవిక, పశుపతి..ఇంకా ప్రతి ఒక్కరి పాత్రల నటనకు ప్రశంసలు వస్తున్నాయి. వారు ఆ పాత్రలుగా మారిపోయారు. బయట చూస్తే మీరు వారిని గుర్తుపట్టలేరు. అంత సహజంగా పర్ ఫార్మ్ చేశారు. షూటింగ్ టైమ్ లో చాలా మందికి గాయాలు అయ్యాయి. వారికి టైమ్ ఇచ్చి మళ్లీ షెడ్యూల్ చేసుకుంటూ వచ్చాం.
  • కంగువ ట్రైలర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. మరో కొత్త ట్రైలర్ కూడా రిలీజ్ ముందు విడుదల చేస్తాం. ఆ ట్రైలర్ కంప్లీట్ గా ఫ్రెష్ కట్ తో ఉంటుంది. ఇవాళ మోర్ రూటెడ్ మూవీస్ ఆదరణ పొందుతున్నాయి. కాంతార కన్నడ వారికి కూడా పెద్దగా పరిచయం లేని కథే. అలాంటి సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ పొందింది. తెలుగులో రంగస్థలం లాంటి సినిమాను అంతకముందు ఊహించలేం. హీరోకు ఫిజికల్ ప్రాబ్లమ్ ఉందంటే మన వాళ్లు గతంలో ఊహించలేకపోయేవారు. పుష్ప కూడా అంతే. కానీ ఆ తర్వాత అల్లు అర్జున్ వాకింగ్ స్టైల్ ట్రెండ్ అయ్యింది. మా సంస్థలో పక్కా కమర్షియల్ సినిమాలు కూడా చేస్తాం. తెలుగులో స్టార్ హీరోలతో ప్రాజెక్ట్ కుదిరితే అలాంటి మూవీ నిర్మిస్తాం.
  • ఏదైనా నిజం మాట్లాడితే అది కాంట్రవర్సీ అవుతుంటుంది. నేను మనసులో ఉన్నది చెబుతుంటా. నేషనల్ అవార్డ్స్ లో పొన్నియన్ సెల్వన్ కు అవార్డ్ లు రావడం సంతోషంగా ఉంది. అలాగే మిగతా విన్నర్స్ కు కూడా కంగ్రాట్స్ చెబుతున్నాం.
Tfja Team

Recent Posts

‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ ,క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల

ల‌వ్‌, ఎమోష‌న్, డ్రామా వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తోపాటు చ‌క్క‌టి సోష‌ల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…

1 week ago

అవినాష్ తిరువీధుల “వానర” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అదరహో..’ రిలీజ్, ఈ నెల 26న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…

2 weeks ago

‘దండోరా’ చిత్రం అద్భుతంగా ఉంటుంది.. మంచి అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వస్తారు – దర్శకుడు మురళీకాంత్

వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్…

2 weeks ago

డిసెంబర్ 19న రాబోతోన్న ‘జిన్’ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…

2 weeks ago

‘ఎర్రచీర’పక్కాగా ఫిబ్రవరి 6న విడుదల

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…

2 weeks ago

ఫిబ్రవరి 13న ‘ఫంకీ’.. వాలెంటైన్స్ వీకెండ్‌కు ఫుల్ ఫన్ గ్యారంటీ!

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…

2 weeks ago