దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ ల క్రేజీ ప్రాజెక్ట్ ‘లియో’ కోసం దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ పవర్ ఫుల్ వీడియోలో విజయ్ రగ్గడ్ గా కనిపించారు. ఈరోజు, విజయ్ పుట్టినరోజును పురస్కరించుకుని మేకర్స్ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
పోస్టర్‌లో విజయ్ ఎవరినో స్లెడ్జ్‌హామర్‌తో కొడుతున్నట్లు వైల్డ్ అండ్ ఇంటెన్స్ అవతార్‌లో కనిపించారు. దెబ్బ పడిన తర్వాత రక్తం, పళ్ళు గాలిలో ఎగరడం చూడవచ్చు. విజయ్ పక్కన హైనాను గమనించవచ్చు. మొత్తంమీద పోస్టర్.. లియోలో యాక్షన్‌లో ఎక్కువగా ఉంటుందని సూచిస్తుంది. పోస్టర్‌పై ”In the world of untamed rivers, calm walters either become divine Gods or dreaded demons’ అనే క్యాప్షన్ రాసుంది.
విజయ్ బర్త్ డే సందర్భం గా టీం లియో ఫస్ట్ సింగిల్ “నా రెడీ ” లిరికల్ వీడియో కూడా విడుదల చేసారు ..ఫుల్ బీట్స్ తో ఉన్న ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
7 స్క్రీన్ స్టూడియోపై ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా, జగదీష్ పళనిసామి సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో భారీ తారాగణం కనిపించనుంది. విజయ్ సరసన త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తుండగా, సంజయ్ దత్, ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీఖాన్, మాథ్యూ థామస్, శాండీ మాస్టర్ తదితరులు ఇతర ప్రముఖ తారాగణం.
రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తుండగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటర్, ఎన్. సతీస్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్. రామ్‌కుమార్ బాలసుబ్రమణియన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
అక్టోబర్ 19న లియో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.
తారాగణం: విజయ్, త్రిష కృష్ణన్, సంజయ్ దత్, ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్, మాథ్యూ థామస్, శాండీ మాస్టర్
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: లోకేష్ కనగరాజ్
నిర్మాత: ఎస్ ఎస్ లలిత్ కుమార్
బ్యానర్: 7 స్క్రీన్ స్టూడియో
సహ నిర్మాత: జగదీష్ పళనిసామి
సంగీతం: అనిరుధ్ రవిచందర్
డీవోపీ: మనోజ్ పరమహంస
యాక్షన్: అన్బరివ్
ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్
ఆర్ట్: ఎన్. సతీస్ కుమార్
కొరియోగ్రఫీ: దినేష్
డైలాగ్ రైటర్స్: లోకేష్ కనగరాజ్, రత్న కుమార్ & దీరజ్ వైద్య
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామ్‌కుమార్ బాలసుబ్రమణియన్.
పీఆర్వో: వంశీ-శేఖర్
ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి…
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచనాలు…
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్,…
గత ఏడాది బ్లాక్ బస్టర్ మూవీ ‘సైయారా’ కాంబో మళ్లీ మన ముందుకు రావటానికి సమాయత్తమవుతోంది. సైయారా అద్భుత విజయంతో…
ఎమ్మెస్ రాజు అంటే ఒక బ్రాండ్. సుమంత్ ఆర్ట్స్ పతాకంపై ఆయన నిర్మించిన "శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు,…
అలనాటి నటి, గాయని, నిర్మాత కృష్ణవేణమ్మ జీవితాన్ని గ్రంధస్తం చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందని, ఆమె జీవితం నేటి తరానికి…