అత్యంత వైభవంగా మొదలైన దళపతి 69 పూజ

  • భారీగా తెరకెక్కిస్తున్న కేవీయన్‌ ప్రొడక్షన్స్
  • విజయ్‌ సినీ కెరీర్‌లో ఆఖరి సినిమా

విజయ్‌ సినిమా కెరీర్‌లో ఆఖరి చిత్రం దళపతి 69ని అత్యంత వైభవంగా ప్రారంభించింది కేవీయన్‌ ప్రొడక్షన్స్. పూజా కార్యక్రమాలతో భారీ సినిమాకు కొబ్బరికాయ కొట్టేశారు. నవరాత్రుల్లో రెండో రోజున ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలు కావడం ఆనందంగా ఉందంటున్నారు మేకర్స్. సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల సమక్షంలో ఆత్మీయంగా జరిగింది దళపతి 69 మూవీ పూజ.

శనివారం నుంచి సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుంది. దళపతి కెరీర్‌లో హిస్టారిక్‌ ప్రాజెక్ట్ ఇది. సిల్వర్‌స్క్రీన్‌ మీద ఆయన చివరిసారిగా కనిపించనున్న చిత్రం ఇదే. దళపతి ఫ్యాన్స్ కి ఇదొక ఎమోషనల్‌ ప్రాజెక్ట్.విజయ్‌ సరసన ఈ చిత్రంలో పూజా హెగ్డే నాయికగా నటిస్తున్నారు. బాబీ డియోల్‌ కీలక పాత్రలో కనిపిస్తారు. గౌతమ్‌ వాసుదేవ మీనన్‌, నేషనల్‌ అవార్డ్ విన్నింగ్‌ యాక్ట్రెస్‌ ప్రియమణి, వెటరన్‌ యాక్టర్‌ ప్రకాష్‌ రాజ్‌, రెయిజింగ్‌ స్టార్‌ మమిత బైజు ప్రధాన పాత్రల్లో మెప్పించడానికి సిద్ధమవుతున్నారు.

హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. కేవీయన్‌ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్‌ కె నారాయణ నిర్మిస్తున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా వెండితెరమీద విలక్షణమైన నటనతో బాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తున్న విజయ్‌ కెరీర్‌లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న సినిమా ఇది. అనిరుద్‌ సంగీతం అందిస్తున్నారు. సత్యన్‌ సూర్యన్‌ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తారు. ప్రదీప్‌ ఇ రాఘవ్‌ ఈ సినిమాకు ఎడిటింగ్‌ విభాగాన్ని హ్యాండిల్‌ చేస్తున్నారు. అనల్‌ అరసు యాక్షన్‌ కొరియోగ్రఫీని అందిస్తున్నారు. సెల్వ కుమార్‌ ఆర్ట్ డైరక్టర్‌గా పనిచేస్తున్నారు. పల్లవి సింగ్‌ కాస్ట్యూమ్స్ విభాగాన్ని హ్యాండిల్‌ చేస్తున్నారు. ‘ధీరన్‌ అదిగారమ్‌ ఒండ్రు’, ‘మాస్టర్‌’ సినిమాలకు పనిచేసిన సత్యన్‌ సూర్యన్‌.. దళపతి 69 ని మరో రేంజ్‌లో చూపిస్తారనే కాన్ఫిడెన్స్ ఆల్రెడీ ప్రేక్షకుల్లో క్రియేట్‌ అయింది.
ప్యాన్‌ ఇండియా రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్. తమిళ్‌, తెలుగు, హిందీలో 2025 అక్టోబర్‌లో విడుదల కానుంది ఈ సినిమా. విజయ్‌ లెగసీని దృష్టిలో పెట్టుకుని, ఆయన నటిస్తున్న చివరి సినిమాను అత్యంత భారీగా, తరాలు గుర్తుపెట్టుకునేలా తెరకెక్కించే పనిలో ఉన్నారు మేకర్స్.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

8 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

8 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

8 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago