రేపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించబోతోంది తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్. ఈ వేడుక రావాల్సిందిగా అసోసియేషన్ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందజేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు వీరశంకర్, వైస్ ప్రెసిడెంట్ వశిష్ట, దర్శకులు అనిల్ రావిపూడి, హరీశ్ శంకర్ నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానాన్ని అందజేశారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రి వస్తానని చెప్పినట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంచి విజన్ ఉందని, ప్రపంచ సినిమాకు టాలీవుడ్ హబ్ గా మారేలా చేద్దామని సీఎం చెప్పినట్లు టీఎఫ్ డీఏ అధ్యక్షుడు వీరశంకర్ తెలిపారు. ఈ సందర్భంగా
టీఎఫ్ డీఏ ప్రెసిడెంట్ వీర శంకర్ మాట్లాడుతూ – నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను, హరీశ్ శంకర్, అనిల్ రావిపూడి, వశిష్ట మరికొందరు వెళ్లి కలిశాం. ఐదు నిమిషాలు మాట్లాడాలని వెళ్తే సుమారు గంట సేపు మాతో సినిమా ఇండస్ట్రీ గురించి సీఎం మాట్లాడటం హ్యాపీగా అనిపించింది. చిత్ర పరిశ్రమ అభివృద్ధి గురించి సీఎం గారి విజన్ కు ఆశ్చర్యం వేసింది. ప్రపంచ సినిమా హబ్ గా టాలీవుడ్ మారాలని, ఆ దిశగా ప్రభుత్వం సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. వరల్డ్ క్లాస్ ఫిలిం ఇనిస్టిట్యూట్ హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించాం. డైరెక్టర్స్ డే ను ప్రపంచమంతా గుర్తుపెట్టుకునేలా ఈ ఈవెంట్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు తప్పకుండా వస్తామని మాటిచ్చారు. అని చెప్పారు.
లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు చక్కటి సోషల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…