ఫీల్‌గుడ్ మరియు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ పట్టం కడతారు. అలాంటి సినిమాలు ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌గానే వుంటాయి. ఆ కోవలోనే రూపొందుతున్న మరో ఫీల్ గుడ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రామ్ ఎన్‌ఆర్‌ఐ’. ‘పవర్ ఆఫ్ రిలేషన్ షిప్’ అనేది ఈ చిత్రం ఉపశీర్షిక. బిగ్‌బాస్ ఫేమ్ అలీ రజా కథానాయకుడిగా, సీతా నారాయణన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎన్.లక్ష్మీ నందా దర్శకుడు. మువ్వా క్రియేషన్స్ పతాకంపై ఎస్‌ఎంకే ఫిల్మ్స్ సింగులూరి మోహన్‌కృష్ణ సమర్పణలో మువ్వా సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి తెల్లవారే వెలుగుల్లోనా అనే తొలి లిరికల్ వీడియోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ గారు మాట్లాడుతూ… ‘ ఈ పాటను చూస్తుంటే ఎంతో ఆనందంగా వుంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అందాలను ఒడిసి పట్టి చాలా అందమైన, అద్భుతమైన లోకేషన్స్‌లో ఈ పాటను చిత్రీకరించినట్లుగా కనిపిస్తుంది. ఈ పాట ద్వారా మంచి లోకేషన్స్‌ను దర్శక, నిర్మాతలు సెల్యూలాయిడ్స్‌పైకి తెచ్చినందుకు అభినందనలు. సినిమా విజువల్స్ చూస్తుంటే ది బెస్ట్ సాంకేతిక విలువలతో నిర్మించిన సినిమాలా అనిపిస్తుంది. నాగబాబు కర్రా అద్భుతమైన సినిమాటోగ్రఫీ ఈ పాటలో కనిపిస్తుంది. మన మాతృభూమికి మనం ఎంతో కొంత చేయాలి. మన మూలాలను మరిచిపోకూడదు అనే ఆలోచనతో మంచి కాన్సెప్ట్‌తో, ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడికి, నిర్మాతకు నా అభినందనలు. ఇంత మంచి సినిమాకు వర్క్ చేసిన టీమ్‌కు కూడా నా శుభాకాంక్షలు. ఈ నెల 21న జరగనున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుకతో పాటు ఈ చిత్రం కూడా విజయవంతం కావాలని మనస్పూర్తి గా కోరుకుంటున్నాను’ అన్నారు.
శ్రవణ్ సంగీతం సమకూర్చిన ‘తెల్లవారే వెలుగుల్లోనా’ అనే ఈ పాటకు రామాంజనేయులు యామినేని సాహిత్యం అందించగా, గాయకుడు రేవంత్ ఆలపించారు. పల్లె గొప్పతనాన్ని, గ్రామీణ అందాలను చూపిస్తూ తెరకెక్కిన ఈ పాట విజువల్‌గా కూడా ఆకట్టుకునే విధంగా వుంది. ‘పల్లెసీమకు ఎగిరే.. మనసే ఆనందంలో ఎగిరే.. ఊరివైపు పయనించే….’ అని పాడుతూ హీరో అలీ రజా ఎంతో హుషారుగా..ఎనర్జీగా ఈ పాటలో కనిపిస్తాడు. మంచి లిరికల్ విలువలతో కూడిన ఈ పాట వినగానే క్యాచీగా వుంది.
తారాగణం: అలీ రజా, సీతా నారాయణన్, విజయ్‌చందర్, గీతాంజలి, మువ్వ సత్యానారాయణ, సన, సూర్య, రఘు, జోగి నాయుడు, వేణుగోపాల్, రవివర్మ, జయవాణి, శ్రీమణి, మైనా
సాంకేతిక నిపుణులు:
కథ, స్కీన్‌ప్లే, దర్శకత్వం: ఎన్.లక్ష్మీ నందా(డీఎఫ్ టెక్)
నిర్మాత: మువ్వా సత్యనారాయణ
సమర్పణ: ఎస్‌ఎంకే ఫిల్మ్స్ సింగులూరి మోహన్‌కృష్ణ
సంభాషణలు: వీరబాబు బాసిన
సాహిత్యం: రామాంజనేయలు యామినేని
సంగీతం: శ్రవణ్
సినిమాటోగ్రఫర్: నాగబాబు కర్రా
ఎడిటర్: కె.రమేష్
ఆర్ట్: జేకే మూర్తి
ఫైట్స్: సూపర్ ఆనంద్
కొరియోగ్రఫీ: రేలంగి కిరణ్
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…