ఈ పాశ్చాత్య పోకడలో తెలుగుదనం వున్న సినిమాలు, తెలుగు వారి సంప్రదాయాలు చూపించే సినిమాలు చాలా అరుదుగా వస్తున్నాయి. సహజత్వంతో కూడిన ఈ అంశాలను హైలైట్ చేస్తూ చూపించే సినిమాలను తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు. తాజాగా యేవమ్ చిత్రంలో తెలంగాణ ఒగ్గు కథ కల్చర్‌ని హైలైట్ చేస్తూ, తెలంగాణ సంస్కృతిలోని ముఖ్యమైన అంశమైన ఒగ్గుకథను ఈ చిత్రంలో చూపించారు యేవమ్ చిత్ర దర్శకుడు ప్రకాష్ దంతులూరి. ఈచిత్రంలో ఓ కీలకమైన సన్నివేశం వచ్చేటప్పుడు ఆ సన్నివేశంలోని గాఢతను తెలంగాణ ఒగ్గుకథతో చెబుతున్నారు. ఈ కథలో హిందూ సంప్రదాయంలోని గ్రామ దైవాల గొప్పదనాన్ని ఒగ్గుకథలో కూడా ఈ చిత్రంలో చూపించారు. ఒగ్గుకథను సినిమాలో
ముఖ్య అంశంగా చేర్చిన కమర్షియల్ సినిమా అని చెప్పొచ్చు. ఈ ఒగ్గుకథను కూడా రియల్‌గా ఒగ్గుకథలను పాడే ఒగ్గుకథ కళాకారుల చేతనే చెప్పించడం విశేషం.
దర్శకుడు మాట్లాడుతూ ఈ ఒగ్గుకథతో కథలోని గాఢతను, సన్నివేశంలోని సారాంశంను చెప్పించడంతో ప్రేక్షకులు కథలో ఇన్‌వాల్వ్ అవ్వడమే కాకుండా వారికి కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు మంచి స్పందన వస్తుంది. ఈ నెల 14న విడుదల కాబోతున్న ఈ చిత్రం అందని అలరిస్తుందనే నమ్మకం వుంది అన్నారు.
ప్రకాష్ దంతులూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చాందిని చౌదరి
దిని చైదరి, వశిష్ట సింహా, భరత్‌రాజ్,ఆషు రెడ్డి ముఖ్యతారలు. ఈ చిత్రానికి నవదీప్, పవన్ గోపరాజు నిర్మాతలు. గోపరాజు రమణ, దేవిప్రసాద్, కల్పిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్ ఎస్‌వీ విశ్వేశ్వర్, సంగీతం కీర్తన శేషు, నీలేష్ మందలపు అందిస్తున్నారు. సుజనా అడుసుమిల్లి ఎడిటర్‌గా, రాజు పెన్మెత్స ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…