తెలంగాణ ప్రభుత్వం టెలివిజన్ రంగంలో ప్రతిభను గుర్తించి సత్కరించేందుకు తెలంగాణ టెలివిజన్ అవార్డ్స్ 2024” నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ అవార్డ్స్‌కు సంబంధించిన విధానాలు, నియమావళి, లోగో రూపకల్పన వంటి అంశాలను ఖరారు చేయడానికి ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
15 మంది సభ్యుల కమిటీకి TGFDC MD కన్వీనర్‌గా ఉంటారు. నిర్మాత శరత్ మరార్ ఛైర్మన్‌గా, ఈ కమిటీలో టెలివిజన్ పరిశ్రమ నుండి కె. బాపినీడు, మంజుల నాయుడు, పి. కిరణ్ సహా ప్రముఖ సభ్యులు ఉంటారు.
అన్ని విభాగాలలో పారదర్శకత, సమగ్రత, సృజనాత్మక నైపుణ్యాన్ని నిర్ధారించడానికి అవార్డుల ఫ్రేమ్ వర్క్, విజన్ ని రూపొందించే బాధ్యతను ప్యానెల్‌కు అప్పగించారు.
ఈ సందర్భంగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సినీ, టెలివిజన్ రంగాల్లో ప్రతిభా ప్రదర్శనకు కేంద్రంగా ఎదుగుతోంది. ‘తెలంగాణ టెలివిజన్ అవార్డ్స్ 2024’ ద్వారా స్థానిక సృజనాత్మక ప్రతిభను గౌరవించే వేదికను అందిస్తున్నాం. ఇది సృజనాత్మకతను, స్థానిక ప్రతిభను ప్రోత్సహించే ప్రభుత్వ సంకల్పానికి ప్రతీక.
ఈ చొరవ రాష్ట్ర ప్రభుత్వం చలనచిత్రం, టెలివిజన్, ఎంటర్టైన్మెంట్ ఎకోసిస్టంను బలోపేతం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగం.
సినిమా, టెలివిజన్, ఎంటర్టైన్మెంట్ రంగాల అభివృద్ధికి ప్రభుత్వ కృషిలో భాగంగా ఈ అవార్డులు కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు తెలిపారు. కథనం, సాంకేతిక నైపుణ్యం, నటనలో ఉన్నతతను గుర్తించే ఈ అవార్డులు, తెలంగాణ టెలివిజన్ పరిశ్రమ స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లే మైలురాయిగా నిలుస్తాయని పేర్కొన్నారు.
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…