సెప్టెంబర్ 8న తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు

Must Read

తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఎలక్షన్స్ జరిగి రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి. రెండేళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ 8వ తేదీన నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి ఎన్నికలు నిర్వహించాలని ఛాంబర్ సభ్యులు నిర్ణయించారు.

ఈ సందర్భంగా ఛాంబట్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఫిలింఛాంబర్ స్థాపించి 14 సంవత్సరాలు అయ్యింది. ఎలక్షన్స్ కోసం అడ్వైజర్లుగా సుదర్శన్ థియేటర్ అధినేత భాస్కరరావు, నిర్మాత గురురాజ్, జె వి ఆర్ గార్లు వ్యవరిస్తున్నారు. ఎలక్షన్ ఆఫీసర్ గా అడ్వకేట్ కె వి ఎల్ నరసింహారావు గారు వ్యవహరిస్తారు. సెప్టెంబర్ 1వ తేదీన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమౌతుంది. 8వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు. ఛాంబర్ లో 1000 మంది ప్రొడ్యూసర్స్, 16000 మంది 24 క్రాఫ్ట్స్ మెంబెర్స్ వున్నారు. సభ్యులకు ఇన్సూరెన్స్, సభ్యుల పిల్లలకు స్కాలర్షిప్ అందిస్తున్నాము. సభ్యుల సంక్షేమమే ధ్యేయంగా ఛాంబర్ పనిచేస్తుంది. సభ్యులందరు తప్పకుండా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నాను. అలాగే తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ నిర్వహిస్తోంది. అవార్డ్ కమిటీని ఎఫ్ డి సి వారు ప్రకటించారు. తెలంగాణకు సంబంధం లేనివ్యక్తులు ఎఫ్ డి సి లో పనిచేస్తున్నారు. మా ఛాంబరుకు ప్రాధాన్యం లేకుండా చేశారు. దీన్ని నేను ఖండిస్తున్నాను. కమిటీని రివైజ్ చెయ్యాలని కోరుతున్నాను అన్నారు.

తెలంగాణ ఫిలింఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ గురురాజ్ మాట్లాడుతూ.. ఛాంబర్ ఎన్నికల నామినేషన్లు ప్రక్రియ 1వ తేదీ ఉంటుంది. 2వ తేదీ నామినేషన్స్ పరిశీలించి కంఫర్మ్ చేస్తారు. 8వ తేదీ ఎన్నికలు జరుగుతాయి. మా ఛాంబర్ నుండి ఇప్పటి వరకు 250కి పైగా సినిమాలు సెన్సార్ జరుపుకున్నాయి. చిన్న సినిమాలు, చిన్న నిర్మాతలకు చేయూత నిచ్చేందుకే మా ఛాంబర్ పనిచేస్తుంది అన్నారు.

నిర్మాత జె వి ఆర్ మాట్లాడుతూ..50 సంవత్సరాలుగా తెలంగాణా వివక్షకు గురౌతోంది. సినిమా పరిశ్రమలో కూడా తెలంగాణా నిర్మాతలు, నటులు, సాంకేతిక నిపుణుల పట్ల వివక్ష చూపిస్తున్నారు. గద్దర్ అవార్డ్స్ కమిటీలో కూడా తెలంగాణ ఛాంబరుకు ప్రాతినిధ్యం లేకుండా చేశారు. ఈ కమిటిని రివైజ్
చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాం. సెప్టెంబర్ 8న జరిగే ఎన్నికల్లో సభ్యులందరు పాల్గొనాలని కోరుతున్నాను అన్నారు.

సుదర్శన్ థియేటర్ అధినేత భాస్కర్ రావు మాట్లాడుతూ తెలుగు సినీపరిశ్రమ చాలా ఇబ్బందుల్లో ఉంది. తెలంగాణా ప్రభుత్వం దీనిపై దృష్టి చారించి సహాయ సహకారాలు అందించాలన్నారు.

Latest News

DaakuMaharaaj WillReference Point for other Films Bobby

The highly anticipated film Daaku Maharaaj, starring Nandamuri Balakrishna, is set for a grand worldwide release on January 12,...

More News