సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు‘డేంజర్’ అంటూ డ్ర‌గ్స్‌పై హీరో కృష్ణసాయి పోరాటం

▪ ‘ఓ యువతా నీ గమ్యం ఎటు వైపు?’ అనే సందేశంతో పాట‌
▪ డ్ర‌గ్స్‌పై ప్ర‌చార చిత్రాల‌కు గ‌వ‌ర్న‌ర్ల‌తో పాటు పోలీసు ఆఫీస‌ర్‌ల ప్ర‌శంస‌లు
▪ డ్ర‌గ్స్‌పై యువ‌త‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు సినిమా కూడా
▪ ‘డేంజర్’ మూవీపై హీరో కృష్ణసాయి స్పెషల్ అనౌన్స్‌మెంట్

హైద‌రాబాద్:
విద్యార్థులు గంజాయి కోరల్లో చిక్కుతున్నారు. పుస్తకాలు ఉండాల్సిన వారి బ్యాగుల్లో మాదక ద్రవ్యాలు దర్శనమిస్తున్నాయి. డిగ్రీలు పూర్తి చేయకముందే డ్రగ్స్ కి బానిసై భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. ఉద్యోగాలు చేయాల్సిన వయసులో మత్తు అనే ఊబిలో కూరుకు పోతున్నారు. ఇదేంటని అడిగిన తల్లిదండ్రులపై దాడులు చేసే పశు ప్రవర్తనలకు దిగజారి పోతున్నారు. ప్రశ్నించిన వారిపై పగ పెంచుకుంటున్నారు. మత్తుకు బానిసై ముఠాగా ఏర్పడి విక్రయాలు సైతం జరుపుతున్నారు. అదే మత్తులో హత్యలు, అత్యాచారాల వంటి ఆరాచకాలు ఎన్నో. అలాంటి డ్రగ్స్‌ను అరికట్టేందుకు త‌న‌వంతు బాధ్య‌త‌గా హీరో కృష్ణసాయి ప్ర‌చార చిత్రాల‌ను తీస్తున్నారు.

డ్ర‌గ్స్‌పై యువ‌త‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుకు స్పందించిన హీరో కృష్ణసాయి ప‌లు ప్ర‌చార చిత్రాల‌ను రూపొందిస్తున్నారు. కృష్ణ సాయి చారిటబుల్ ట్రస్ట్ నిర్మాణంలో ‘ఓ యువతా నీ గమ్యం ఎటు వైపు?’ అనే సందేశంతో రూపొందించిన ప్రచార వీడియోకు మంచి స్పందన లభించింది.

ఈ సంద‌ర్బంగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆవరణలో హీరో కృష్ణసాయి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. హీరో కృష్ణసాయి మాట్లాడుతూ.. “తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు, మా బాధ్యతగా డ్రగ్స్‌పై ఓ చైతన్యపూరిత గీతాన్ని రూపొందించాం. గ‌వ‌ర్న‌ర్లు, పోలీస్ విభాగంతో పాటు, సామాజిక మాధ్యమాల్లోనూ ప్ర‌శంసలు వెల్లువెత్తాయి. ప్రతి సినిమాకి ముందు ‘స్మోకింగ్ డేంజర్’ అని హెచ్చరికలు చేసే మెసేజ్ వలన యువతలో అవ‌గాహ‌న క‌లిగడంతో సిగరెట్, తంబాకు, గుట్కా వినియోగం బాగా తగ్గిపోయింది, సినిమా మాధ్య‌మం వ‌ల్ల ప్ర‌జ‌లు ప్రభావితం అవుతారు. అందుకే ఇప్పుడు డ్రగ్స్‌పై అవగాహన పెంచేందుకు మేం రూపొందించిన పాట‌ను ‘డేంజర్’ అనే సినిమాలోనిది. ఈ సినిమా యువతను మార్పు దిశగా నడిపిస్తుందని నమ్మకం ఉంది,” అని అన్నారు. ఇలాంటి సామాజిక స్పృహ కలిగిన చిత్రాలు, ఉద్యమాలు ముందుకు వెళ్లాలంటే మీడియా మద్దతు కీలకం, అందుకు ప్ర‌తి ఒక్క‌రి స‌హ‌కారం కావాలి,” అంటూ మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు హీరో కృష్ణ‌సాయి.

ఇటీవ‌ల డ్ర‌గ్స్‌పై పాట రూపొందించిన‌ హీరో కృష్ణసాయి అందులో న‌టించారు. ఈ ప్ర‌చార చిత్రానికి ప్ర‌ముఖుల నుంచి ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. అప్పటి గవర్నర్లు తమిళసై, దత్తాత్రేయ, కేంద్ర క్యాబినెట్ మంత్రి కిష‌న్ రెడ్డి, తెలంగాణ‌ డీజీపీ జితేందర్‌, హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఐపిఎస్, ఇంటెలిజెన్స్ ఐజి సుమతి, అదనపు డీజీపీ జిహెచ్‌పి రాజు, నార్కోటిక్ బ్యూరో చీఫ్ అదనపు డిజిపి సందీప్ శాండిల్య, ఇతర ఐఎఎస్, ఐపిఎస్ అధికారులను ఈ డ్రగ్స్ పాటను వీక్షించి హీరో కృష్ణసాయిని అభినందించారు.

నిర్మాణం: కృష్ణసాయి చారిటబుల్ ట్రస్ట్
సంగీతం: శంభు ప్రసాద్
దర్శకుడు, పాట రచయిత: పిఎస్ నారాయణ
న‌టీన‌టులు: కృష్ణసాయి,పూజిత, మేక రామ‌కృష్ణ‌, ర‌మేష్ గుత్తుల‌, నితిష్‌, వెంక‌టేశ్వ‌ర‌రావు త‌దిత‌రులు
సింగ‌ర్: ర‌మ‌ణ సీలం
ఎడిట‌ర్: రాము
కో-డైరెక్ట‌ర్: కృష్ణ‌శ్యామ్
కెమెరామెన్: విజయ్ కుమార్

Tfja Team

Recent Posts

మహేష్ విట్ట ‘’ఉత్తుత్త హీరోలు‘’ చిత్రానికి బెస్ట్ విషెస్ తెలిపిన హీరో ప్రదీప్ మాచిరాజు

‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…

8 hours ago

‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ బోలెడన్ని ట్విస్టులతో ఉంటుంది.. ఏ ఒక్కరినీ నిరాశపర్చదు.. గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌లో రాజీవ్ కనకాల

రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…

1 day ago

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) కి యువ నిర్మాత వంశీ నందిపాటి విరాళం

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…

2 days ago

మార్చి 4వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తున్న సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ”ఓం శాంతి శాంతి శాంతిః”

సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…

2 days ago

బుక్ మై షోలో 100కె టికెట్ బుకింగ్స్ క్రాస్ చేసిన బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ మూవీ “కపుల్ ఫ్రెండ్లీ”

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ…

2 days ago

మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ డైరీని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )నూతన డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 'మా…

2 days ago