“కన్యాకుమారి” సినిమా నుంచి తిరుపతి క్యారెక్టర్ పరిచయం చేస్తూ రైతు టీజర్ రిలీజ్

Must Read

గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ జంటగా నటిస్తున్న సినిమా “కన్యాకుమారి”. ఈ చిత్రాన్ని రాడికల్ పిక్చర్స్ బ్యానర్ పై దర్శక నిర్మాతగా సృజన్ రూపొందిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు “కన్యాకుమారి” సినిమా నుంచి తిరుపతి క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ రైతు టీజర్ రిలీజ్ చేశారు.

Kanyakumari Official Teaser | Telugu Movie 2025 | Radical Pictures| Sree Charan, Geeth Saini |

రైతు టీజర్ ఎలా ఉందో చూస్తే – శ్రీకాకుళం జిల్లాలోని పెంటపాడులో ఐదు ఎకరాల రైతు తిరుపతి. ఏడో తరగతి చదువుకున్న తిరుపతి వ్యవసాయం చేస్తుంటాడు. ఈ వృత్తే అతని పెళ్లికి అడ్డుగా మారుతుంటుంది. సంబంధాల కోసం వెళ్లిన చోటల్లా ఉద్యోగస్తుడైన కుర్రాడికే మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాం అంటారు. తిరుపతి రైతు అనే చిన్నచూపు చూస్తుంటారు. బాగా చదువుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని తనను తక్కువ చేసి మాట్లాడిన వాళ్లతో ఛాలెంజ్ చేస్తాడు తిరుపతి. ఈ యువ రైతు చేసిన సవాలును నిలబెట్టుకున్నాడా లేదా అనేది సినిమాలో చూడాలి. ఫన్నీగా, ఇంట్రెస్టింగ్ గా ఉన్న రైతు టీజర్ ఆకట్టుకుంది.

నటీనటులు – గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ

టెక్నికల్ టీమ్

ఎడిటింగ్ – నరేష్ అడుప
సినిమాటోగ్రఫీ – శివ గాజుల, హరిచరణ్ కె
మ్యూజిక్ – రవి నిడమర్తి
సౌండ్ డిజైనర్ – నాగార్జున తాళ్లపల్లి
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా
బ్యానర్ – రాడికల్ పిక్చర్స్
కో ప్రొడ్యూసర్స్ – సతీష్ రెడ్డి చింతా, వరీనియా మామిడి, అప్పల నాయుడు అట్టాడ, సిద్ధార్థ్.ఎ
రచన, ప్రొడ్యూసర్, డైరెక్టర్ – సృజన్

Latest News

షూటింగ్‌ పూర్తి చేసుకున్న హ్రీం…

తెలుగు భీజాక్షరాల్లో ‘హ్రీం’ అనే అక్షరానికి ఎంతో ఉన్నతమైన విలువలతో కూడిన అర్థం ఉంది. ‘హ్రీం’ అనే ఒక్క భీజాక్షరంలో ‘హ’, ‘ర’, ‘ఈ’, ‘మ’...

More News