ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక లోకానికి సెల్యూట్ చేస్తూ హీరో తిరువీర్ “భగవంతుడు” మూవీ నుంచి ‘శరణమన్న శరణం’ సాంగ్ రిలీజ్

యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా “భగవంతుడు”. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ నటుడు రిషి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను పనస శంకరయ్య గౌడ్ సమర్పణలో రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా నిర్మిస్తున్నారు ప్రొడ్యూసర్ రవి పనస. ఈ సినిమాతో జి.జి. విహారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రొమాంటిక్ పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న “భగవంతుడు” సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘శరణమన్న శరణం’ సాంగ్ రిలీజ్ చేశారు.

శ్రామిక శక్తికి నమస్కరిస్తూ ‘శరణమన్న శరణం’ పాటను రూపొందించారు. ఈ పాటకు హాయ్ కే.పి స్ఫూర్తికరంగా కంపోజ్ చేయగా, సింగర్ కుమార వాగ్దేవి పాటలోని భావోద్వేగాలను పలికిస్తూ పాడారు. ఈ పాట గురించి “భగవంతుడు” మేకర్స్ స్పందిస్తూ – మన మట్టిలో ప్రతి పని ఒక అమ్మ దేవత సాక్షిగానే మొదలవుతుంది. పొలం గట్టున నాగలి సాగేముందు ‘పోలేరమ్మ’ను, చెరువు కట్టపై అలుగులు పోసేటప్పుడు ‘గంగమ్మ’ను, కష్ట, సుఖాల్లో ‘ఎల్లమ్మ’ను స్మరించుకోవడం మన శ్రామిక సంస్కృతిలో భాగం. ఈ అమ్మ దేవతలు శ్రామికుల చెమట చుక్కల్లో తోడుండే ధైర్య రూపాలు. మన సంస్కృతిలో అమ్మ దేవతల శరణుజొచ్చంది ఏ పనీ మొదలు కాదు. పూర్తి కాదు. అమ్మలకు, సబ్బండ వర్గాలకు ఘనమైన ట్రిబ్యూటే మా ఈ “శరణమన్న శరణం”. ఇది నాగలి పట్టిన రైతు, సుత్తి పట్టిన కమ్మరి, చక్రం తిప్పిన కుమ్మరి… ఇలా సకల సబ్బండ కులాల శ్రమజీవుల గుండె చప్పుడు. రక్తాన్ని చెమటగా మార్చి, ఉత్పత్తి చేసే మట్టి చేతులకు, మట్టి చేతులు మోసే పనిముట్లకు నివాళి ఈ గీతం. ఇది ఈ దేశపు సబ్బండ కులాల పతాక గీతం. శ్రమను, తల్లిని ప్రేమించే, పూజించే వారి బతుకు గీతం. మట్టి మనుషులకి వారిని కంటికి రెప్పలా కాపాడే అమ్మ దేవతలకీ మే డే సందర్భంగా మా వందనం. అంటూ కార్మిక లోకానికి సెల్యూట్ చేశారు.

నటీనటులు – తిరువీర్, ఫరియా అబ్దుల్లా, రిషిలతో పాటు రవీందర్ విజయ్, షెల్లీ కిషోర్, కాలకేయ ప్రభాకర్, చిరాగ్ జానీ తదితరులు

టెక్నికల్ టీమ్

కాస్ట్యూమ్ డిజైనర్ – ఆయేషా మరియం
యాక్షన్ – రామ్ కిషన్, రాబిన్ సుబ్బు
లిరిక్స్ – చంద్రబోస్, గోరెటి వెంకన్న, కాసర్ల శ్యామ్,
కొరియోగ్రఫీ – ఈశ్వర్ పెంటి
సినిమాటోగ్రఫీ – రాజ్ తోట
మ్యూజిక్ : హాయ్ కె.పి
ప్రొడక్షన్ డిజైనర్ – గాంధీ నడికుడికర్
ఎడిటర్ – ప్రవీణ్ పూడి
సమర్పణ – పనస శంకరయ్య గౌడ్
బ్యానర్ – రవి పనస ఫిలిం కార్పొరేషన్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
నిర్మాత – రవి పనస
స్టోరీ, డైరెక్షన్ – జి.జి.విహారి

TFJA

Recent Posts

2027 సంక్రాంతి రిలీజ్ కు వస్తున్న డైరెక్టర్ పా.రంజిత్ భారీ పాన్ ఇండియా యాక్షన్ మూవీ “వేట్టువం”

సరికొత్త కథా నేపథ్యాలతో అద్భుతమైన మేకింగ్ తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసే దర్శకుడు పా. రంజిత్ "వేట్టువం" టైటిల్ తో…

19 hours ago

మెగాస్టార్ చిరంజీవి క్లాప్‌తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,#RC17 # RC2Sukku ముహూర్తపు వేడుకతో ఘనంగా ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి క్లాప్‌తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాస్టర్ స్టోరీటెల్లర్ సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్…

20 hours ago

నవీన్ చంద్ర ‘NC 51’ షూటింగ్ పూర్తి

నటుడు నవీన్ చంద్ర హీరోగా, దర్శకుడు ఆర్.పి. బాల తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ‘NC 51’ షూటింగ్ పూర్తయింది. ఆర్.పి.…

3 days ago

హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘ఓరి నాయనో’ చిత్రం!

▪️ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టిన ప్రముఖ నిర్మాత వంశీ నందిపాటి.. తొలి సన్నివేశానికి దర్శకత్వం వహించిన డా. అనిల్ విశ్వనాథ్…

3 days ago

“సమ్మర్ హాలిడేస్” సినిమా ట్రైలర్ చూశాక నా బాల్యం గుర్తుకువచ్చింది, ఈ దీపావళికి ఫ్యామిలీతో కలిసి ఈ మూవీ చూడండి – ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో కింగ్ ఆఫ్ ఎంటర్ టైన్ మెంట్ హీరో శ్రీవిష్ణు

నవంబర్ 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "సమ్మర్ హాలిడేస్" కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్…

4 days ago

‘రుద్రవనం పీఎస్’ ఊహించిన దాని కంటే పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను – గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్

ఎల్లో ఫ్లవర్స్, శ్రీ చక్ర మూవీస్ బ్యానర్ల మీద రమేష్ పుప్పాల, సూర్యకాంతి నిర్మాతలుగా శశిధర్ మున్నంగి తెరకెక్కించిన న్యూ…

4 days ago