టాలీవుడ్

క‌ల‌ర్స్ స్వాతి ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతోన్న హిలేరియస్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘టీచర్’90స్ టీమ్ నుంచి వ‌స్తోన్న మ‌రో న‌వ్వుల జ‌ల్లు

ఆద్యంతం కడుపుబ్బ నవ్వించే నవ్వుల జల్లుతో తెరకెక్కుతోంది టీచర్‌. తెలంగాణలోని అంకాపూర్‌ అనే గ్రామంలో ఉన్న ముగ్గురు డల్‌ స్టూడెంట్స్ కి సంబంధించిన కథతో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో టీచర్‌గా కలర్స్ స్వాతి నటిస్తున్నారు. అడ్డూఅదుపూ లేకుండా అల్లరి చేసే ముగ్గురు విద్యార్థులు టీచర్‌ని కలిసిన తర్వాత ఏం జరిగింది? వాళ్ల జీవితాలు ఎలా మారాయి? అనేది హృద్యంగా ఉంటుంది. సరదా సన్నివేశాలు, సంభాషణలు, అందమైన, అమాయకమైన ప్రేమ, భావోద్వేగాలతో కూడిన ప్రయాణం… ప్రేక్షకుల మనసులను టచ్‌ చేస్తుందనడంలో అసలు సందేహం లేదు.


ఇటీవల 90స్‌- ఎ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌ తో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న టీమ్‌ నుంచి వస్తోంది టీచర్‌. ఆదిత్య హసన్‌ ఈ సినిమాను డైరక్ట్ చేశారు. నవీన్‌ మేడారం నిర్మించారు. ఎంఎన్‌ఓపీ (మేడారం నవీన్‌ అఫిషియల్‌ ప్రొడక్షన్స్) సంస్థ నిర్మిస్తోన్న రెండో సినిమా ఇది.

నటీనటులు
స్వాతి రెడ్డి (కలర్స్ స్వాతి), నిఖిల్‌ దేవాదుల (బాహుబలి ఫేమ్‌), నిత్యశ్రీ (కేరాఫ్‌ కంచరపాళెం ఫేమ్‌), రాజేంద్ర గౌడ్‌, సిద్ధార్థ్‌ (90స్‌ ఫేమ్‌), హర్ష, పవన్‌ రమేష్‌, నరేందర్‌ నాగులూరి, సురేష్‌ తదితరులు

సాంకేతిక నిపుణులు
రచన – దర్శకత్వం: ఆదిత్య హసన్‌
కెమెరా: అజీమ్‌ మహమ్మద్‌
సంగీత దర్శకత్వం: సిద్ధార్థ్‌ సదాశివుని
ఎడిటర్‌: అరుణ్‌ తాచోత్‌
ఆర్ట్ డైరక్టర్‌: తిపోజి దివ్య
లిరిక్స్ : కందికొండ
కాస్ట్యూమ్‌ డిజైనర్‌: రేఖ బొగ్గారపు
లైన్‌ ప్రొడ్యూసర్‌: వినోద్‌ నాగుల
సహ నిర్మాతలు: శ్రావిన్‌, రాజశేఖర్‌ మేడారం
ప్రొడక్షన్‌: ఎంఎన్‌ఓపీ – అమోఘ ఆర్ట్స్ సహకారంతో…
పీఆర్‌ఓ : నాయుడు – ఫణి (బియాండ్‌ మీడియా)
సమర్పణ: రాజేశ్వర్‌ బొంపల్లి
నిర్మాత: నవీన్‌ మేడారం

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

10 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago