తంగలాన్” క్యారెక్టర్ లుక్ రిలీజ్

Must Read

చియాన్ విక్రమ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్”. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగాఈ సినిమా రూపొందింది. “తంగలాన్” సినిమాను పా రంజిత్ నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఇవాళ టాలెంటెడ్ హీరోయిన్ పార్వతీ తిరువోతు బర్త్ డే సందర్భంగా “తంగలాన్” లో ఆమె నటించిన గంగమ్మ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. మహిళా రైతు క్యారెక్టర్ లో ఆమె నటిస్తున్నట్లు ఫస్ట్ లుక్ ద్వారా తెలుస్తోంది.

“తంగలాన్” సినిమాను త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. చియాన్ విక్రమ్ ను ఓ కొత్త నేపథ్యంలో, విభిన్నమైన క్యారెక్టర్ లో దర్శకుడు పా.రంజిత్ చూపించబోతున్నారు.

నటీనటులు – చియాన్ విక్రమ్, మాళవిక మోహనన్, పార్వతీ తిరువోతు, పశుపతి, హరికృష్ణన్, అన్భు దురై తదితరులు

టెక్నికల్ టీమ్

సంగీతం – జీవీ ప్రకాష్ కుమార్
ఆర్ట్ – ఎస్ ఎస్ మూర్తి
ఎడిటింగ్ – ఆర్కే సెల్వ
స్టంట్స్ – స్టన్నర్ సామ్
పీఆర్ ఓ – జీఎస్ కే మీడియా
బ్యానర్స్ – స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్
నిర్మాత – కేఈ జ్ఞానవేల్ రాజా
దర్శకత్వం – పా రంజిత్

Latest News

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పి, సితార...

More News