Ramarao On Duty Teaser | Ravi Teja, Divyansha , Rajisha | Sarath Mandava | Sudhakar Cherukuri

Presenting you the Teaser of Ramarao on Duty Movie written and directed by Sarath Mandava. Produced by Sri Lakshmi Venkateswara Cinemas and RT Team Works, Starring Ravi Teja, Divyansha Kaushik and Rajisha Vijayan.

నా లైఫ్‌లో తండేల్ అల్లు అరవింద్ గారే.. అక్కినేని నాగచైతన్య

Must Read

‘తండేల్’లో చైతన్యది కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్: అల్లు అరవింద్

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. ‘కార్తికేయ-2’ లాంటి బంపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో సక్సెస్‌ఫుల్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్స్ ఓ రేంజ్‌లో చేస్తున్న చిత్ర యూనిట్ తాజాగా ట్రైలర్‌ను వైజాగ్‌లోని రామా టాకీస్‌ రోడ్డులోని శ్రీరామ పిక్చర్ ప్యాలెస్‌లో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్‌లో లాంచ్ చేసింది. అభిమానుల మధ్య ఎంతో ఉత్సాహంగా జరిగిన ఈ వేడుకకు మెగా నిర్మాత అల్లు అరవింద్‌తో పాటు హీరో అక్కినేని నాగచైతన్య హాజరయ్యారు. నాగచైతన్యకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.

ట్రైలర్ విషయానికి వస్తే.. లవ్ స్టోరీ తర్వాత జంటగా వచ్చిన నాగచైతన్య, సాయిపల్లవి స్క్రీన్‌పై అదరగొట్టేశారు. నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య అదిరిపోయిన కెమెస్ట్రీకి తోడు కాస్త దేశభక్తిని కూడా జోడించి డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను భారీగా ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ ఇద్దరి నోటా ఉత్తరాంధ్ర యాస బాగా పలికింది. తండేల్ అంటే లీడర్ అనే విషయాన్ని ఈ ట్రైలర్ ద్వారా తెలియజేశారు. ‘రాజూ.. ఊళ్లో అందరూ మన గురించి ఏటేటో మాటాడుకుంటున్నారు రా’ అనే సాయి పల్లవి డైలాగుతో ట్రైలర్ మొదలవుతుంది. వాళ్లు అనుకుంటున్నదే నిజం చేసేద్దామని ఆమె అనగానే ఇద్దరి లవ్ స్టోరీ మొదలవుతుంది. అయితే తరచూ చేపల వేటకు వెళ్లే అతడు.. ఆమెకు దూరమవుతూ ఉంటాడు. కానీ ఓసారి పాకిస్థాన్ సరిహద్దుకు వెళ్లి అక్కడే చిక్కుకుపోతాడు. అక్కడితో ట్రైలర్ కాస్తా లవ్ ట్రాక్ నుంచి దేశభక్తి వైపు వెళ్తుంది. మా దేశంలోని ఊరకుక్కలన్నీ ఉత్తరం వైపు తిరిగి పోస్తే.. ప్రపంచ పటంలో పాకిస్థాన్ లేకుండా పోతుంది.. మా యాసను మాత్రం ఎటకారం చేస్తే రాజులమ్మ జాతరే అని రెండు పవర్ ఫుల్ డైలాగులు చైతూ నోటి వెంట వినిపిస్తాయి. మొత్తం ట్రైలర్ ఒక పవర్ ప్యాక్డ్‌గా ప్రేక్షకులను తొలిరోజే థియేటర్లకు రప్పించేలా ఉంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్, పాటలు అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ అంచనాలను ఆకాశానికి పెంచేసింది.

ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో హీరో నాగచైతన్య మాట్లాడుతూ..‘‘మన పుష్ప కా బాప్ అల్లు అరవింద్ గారు. ఏడాదిన్నర నుంచి నా లైఫ్‌లో నిజమైన తండేల్ ఆయనే. చివరికి వచ్చేసరికి ఆయన లేకుండా ఇంకో సినిమా నేను ఎలా చేయగలను అనే ఫీలింగ్ వచ్చేసింది. ఈ సినిమాలో ఆయన ఇన్వాల్వ్‌మెంట్ చాలా ఉంది. ఆయన గైడెన్స్ చాలా విలువైనది. నేను జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటా. వైజాగ్ విషయానికి వస్తే .. ఏ సినిమా రిలీజ్ అయినా వైజాగ్ టాక్ ఏంటి అనేది కనుక్కుంటా. ఇక్కడ సినిమా ఆడిందంటే ప్రపంచంలో ఎక్కడైనా ఆడాల్సిందే. వైజాగ్ నాకు ఎంత క్లోజ్ అంటే నేను ఇక్కడి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా. మా ఇంట్లో రూలింగ్ వైజాగ్ వాళ్లదే. కాబట్టి మీకో రిక్వెస్ట్.. తండేల్ సినిమాకు వైజాగ్‌లో కలెక్షన్స్ షేక్ అవ్వాలి. లేదంటే ఇంట్లో నా పరువుపోతుంది(నవ్వుతూ). ఈపాలి యాట తప్పేదేలేదు. ఫిబ్రవరి 7న థియేటర్లలో రాజులమ్మ జాతరే.’’ అని చెప్పారు.

నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ..‘‘మేము చాలా కష్టపడి ఈ సినిమా తీశాం. మేము ఎంత కష్టపడి తీసినా మీరు ఆదరించే స్థాయిలోనే మా ఆనందం ఉంటుంది. మీరు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. చందూ మొండేటి ఈ కథను అత్యద్భుతంగా మలిచి చాలా బాగా తీశారు. సాయిపల్లవి గారు అద్భుతంగా నటించారు. హీరో నాగచైతన్య ఏ సినిమాలోనూ ఇంతవరకు నటించని స్థాయిలో ఈ సినిమాలో నటించారు. కొన్ని సీన్స్ చూస్తే మన గుండె కరిగిపోయేలా నటించారు. ఈ సినిమాతో బెస్ట్ పెర్ఫార్మెన్స్‌ అనిపించుకుంటారు.దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాలో మ్యూజిక్‌ను చించిపడేశాడు. శ్రీకాకుళంలో ఒక చిన్న ఊళ్లో జరిగిన కథను సినిమాగా తీశాం. ఉత్తరాంధ్రవాళ్లంతా ఈ సినిమా చూసి ఆనందిస్తారనే నమ్మకం ఉంది.’’ అని చెప్పారు.

తారాగణం: నాగచైతన్య, సాయిపల్లవి

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: చందూ మొండేటి
సమర్పణ: అల్లు అరవింద్
నిర్మాత: బన్నీ వాసు
బ్యానర్: గీతాఆర్ట్స్
మ్యూజిక్: దేవిశ్రీ ప్రసాద్
డీఓపీ: శమ్దాత్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్: శ్రీనాగేంద్ర తంగల
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్‌షో

Latest News

దిల్ రాజు చేతుల మీదుగా ‘బరాబర్ ప్రేమిస్తా’ నుంచి ‘రెడ్డి మామ’ అంటూ సాగే మాస్ సాంగ్ విడుదల

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా ‘బరాబర్ ప్రేమిస్తా’. ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ సమర్పణలో...

More News