‘బాక్’ నుంచి తమన్నా భాటియా & రాశి ఖన్నా గ్లామర్ షో ప్రోమో సాంగ్ రిలీజ్

అత్యంత విజయవంతమైన హారర్ కామెడీ సిరీస్ ‘అరణ్మనై’ నుంచి నాల్గవ చిత్రం అరణ్మనై 4, తెలుగులో బాక్ పేరుతో వస్తోంది. సుందర్ సి దర్శకత్వంతో పాటు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, రాశి ఖన్నా హీరోయిన్స్. మేకర్స్ ఇటీవల అన్ని ప్రధాన పాత్రలు ఫస్ట్ లుక్ పోస్టర్‌లను విడుదల ద్వారా ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. ఈరోజు ‘పంచుకో’అనే ప్రోమో సాంగ్ తో వచ్చారు.

 హిప్హాప్ తమిళా కొన్ని లైవ్లీ బీట్‌లతో ఫుట్-ట్యాపింగ్ నంబర్‌ను స్కోర్ చేశారు. సాహితీ ఫన్నీ లిరిక్స్ రాస్తే, రాఘవి హస్కీ వాయిస్ మెస్మరైజ్ చేస్తోంది. తమన్నా, రాశీఖన్నాల గ్లామర్‌ ఈ పాటను మరింత అందంగా తీర్చిదిద్దింది. వారి గ్రేస్ ఫుల్ మూమెంట్స్, ముఖ్యంగా హిప్ మూమెంట్స్ చూడటానికి ఒక ట్రీట్‌గా వున్నాయి.  ట్రెండీ అవుట్ ఫిట్స్ ధరించి, హీరోయిన్లిద్దరూ అదరగొట్టారు. ప్రోమో సాంగ్‌లో సినిమాలోని కొన్ని ఎక్సయిటింగ్ సన్నివేశాలను కూడా చూపించారు.

అవ్నీ సినిమాక్స్  P Ltd పతాకంపై ఖుష్బు సుందర్, ACS అరుణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ LLP తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఏప్రిల్ 26న ‘బాక్ ‘ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

ఈ చిత్రానికి కృష్ణమూర్తి డీవోపీగా పని చేస్తుండగా, ఎడిటింగ్‌ను ఫెన్నీ ఆలివర్‌ పర్యవేక్షిస్తున్నారు. గురురాజ్ ఆర్ట్ డైరెక్టర్.  

తారాగణం: సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా, వై వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్,  కోవై సరళ

సాంకేతిక సిబ్బంది:
కథ & దర్శకత్వం: సుందర్ సి
నిర్మాతలు: ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్
బ్యానర్: అవ్నీ సినిమాక్స్క్స్ P Ltd.
తెలుగు రిలీజ్: ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి
సంగీతం: హిప్హాప్ తమిళా
సినిమాటోగ్రాఫర్: ఇ కృష్ణమూర్తి అకా కిచ్చ
ఎడిటర్: ఫెన్నీ ఆలివర్
ఆర్ట్: గురురాజ్
కొరియోగ్రఫీ: బృందా మాస్టర్
స్టంట్స్: రాజశేఖర్
పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ ,క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల

ల‌వ్‌, ఎమోష‌న్, డ్రామా వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తోపాటు చ‌క్క‌టి సోష‌ల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…

1 week ago

అవినాష్ తిరువీధుల “వానర” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అదరహో..’ రిలీజ్, ఈ నెల 26న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…

2 weeks ago

‘దండోరా’ చిత్రం అద్భుతంగా ఉంటుంది.. మంచి అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వస్తారు – దర్శకుడు మురళీకాంత్

వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్…

2 weeks ago

డిసెంబర్ 19న రాబోతోన్న ‘జిన్’ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…

2 weeks ago

‘ఎర్రచీర’పక్కాగా ఫిబ్రవరి 6న విడుదల

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…

2 weeks ago

ఫిబ్రవరి 13న ‘ఫంకీ’.. వాలెంటైన్స్ వీకెండ్‌కు ఫుల్ ఫన్ గ్యారంటీ!

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…

2 weeks ago